హుజూర్‌నగర్: హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానం నుండి  బీజేపీ అభ్యర్ధిగా శ్రీకళా రెడ్డి పోటీ చేయనున్నారు. ఈ మేరకు మంగళశారం నాడు జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ఈ విషయమై చర్చించారు. అధికారికంగా శ్రీకళా రెడ్డి పేరును ప్రకటించే అవకాశం ఉంది.

హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా శ్రీకళా రెడ్డి  పేరును కూడ బరిలోకి దింపాలని భావిస్తున్నట్టుగా సమాచారం.  తొలుత ఈ స్థానం నుండి  శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను బరిలోకి దింపాలని భావించారు. కానీ శంకరమ్మను టీఆర్ఎస్‌ నాయకత్వం బుజ్జగించినట్టుగా సమాచారం.

త్వరలోనే శంకరమ్మకు టీఆర్ఎస్ నాయకత్వం నామినేటేడ్ పదవిని ఇచ్చే అవకాశం ఉంది. దీంతో శంకరమ్మ బీజేపీ తరపున పోటీ చేసేందుకు ఆసక్తిని చూపలేదని సమాచారం. దీంతో మరో అభ్యర్ధి కోసం బీజేపీ అన్వేషించింది.

హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ శ్రీకళా రెడ్డిని బరిలోకి దింపాలని ఆ పార్టీ  నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కోదాడ అసెంబ్లీ స్థానం నుండి 1999 ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్టు కోసం  శ్రీకళా రెడ్డి తీవ్రంగా ప్రయత్నించింది కానీ ఆ ఎన్నికల్లో  అప్పటి మంత్రి మాధవరెడ్డి చందర్ రావుకు మద్దతుగా నిలిచారు. దీంతో శ్రీకళా రెడ్డికి టిక్కెట్టు దక్కలేదు.

ఆ తర్వాత కూడ పలు దఫాలు కూడ ఆమె కోదాడ, హుజూర్‌నగర్ స్థానాల నుండి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ, చివరకు  శ్రీకళా రెడ్డి బీజేపీ టిక్కెట్టుపై హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉంది. ఈ విషయమై బీజేపీ నాయకత్వం కూడ శ్రీకళా రెడ్డి అభ్యర్ధిత్వంపై మొగ్గు చూపినట్టుగా సమాచారం. శ్రీకళారెడ్డి పేరును అధికారికంగా ఆ పార్టీ ప్రకటించే అవకాశం ుంది.

సంబంధిత వార్తలు

గెలుపు మనదే,50 వేల మెజారిటీ రావాలి: సైదిరెడ్డితో కేసీఆర్

హుజూర్ నగర్ చాలా హాట్ గురూ..: కేసీఆర్ కు సవాల్ ఇదే...

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: బిజెపిలోకి కాసోజు శంకరమ్మ?

హుజూర్‌నగర్ బైపోల్: సీపీఐ, జనసేన మద్దతుకు ఉత్తమ్ ప్రయత్నాలు

సైదిరెడ్డి స్థానీయత: ఉత్తమ్ ప్రకటనలోని ఆంతర్యం ఇదే...

శానంపూడి సైదిరెడ్డి ఆంధ్రవాడా: ఉత్తమ్ కుమార్ రెడ్డి భాష్యం అదే

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: జానా రెడ్డి కొడుక్కి బీజేపీ గాలం

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డే

హుజుర్ నగర్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల : అక్టోబర్ 21న పోలింగ్

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: మళ్లీ తెర మీదికి కాసోజు శంకరమ్మ

జగదీష్ రెడ్డి వ్యాఖ్య: రేవంత్ రెడ్డితో మాట్లాడించింది ఉత్తమ్ కుమార్ రెడ్డే

హుజూర్ నగర్ అభ్యర్థి: అన్న మాటను కాదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి