Asianet News TeluguAsianet News Telugu

హుజూర్‌నగర్ ఉపఎన్నిక: కాంగ్రెస్‌కు ఓటేస్తే టీఆర్ఎస్‌కి వేసినట్లే.. లక్ష్మణ్ వ్యాఖ్యలు

కేటీఆర్, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పొద్దున్నే దూషించుకుంటున్నారని.. రాత్రయితే కలిసి చర్చలు జరుపుకుంటున్నారని లక్ష్మణ్ ఆరోపించారు. హుజూర్‌నగర్ ఉపఎన్నిక విషయంలోనూ కాంగ్రెస్, టీఆర్ఎస్‌లు రాజీపడ్డాయని.. హస్తం గుర్తుకు ఓటేస్తే అది టీఆర్ఎస్‌కే చెందుతుందంటూ మండిపడ్డారు.

telangana bjp president lakshman sensational comments on congress and trs
Author
Hyderabad, First Published Sep 29, 2019, 12:41 PM IST

గత ఐదేళ్ల టీఆర్ఎస్‌ పాలనలో ప్రతి విభాగంలోనూ అవినీతి జరిగిందన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్. ఆదివారం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ అవినీతిపై కాగ్ సైతం మొట్టికాయలు వేసిందని లక్ష్మణ్ గుర్తు చేశారు.

2012 నుంచి 2017 వరకు జరిగిన విద్యుత్ కొనుగోళ్లలో రూ. 5,820 కోట్ల అధిక వ్యయం జరిగిందని కాగ్ తప్పుబట్టారని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుటుంబపాలనపై బీజేపీ పోరాటం చేస్తుంటే.. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ప్రేక్షకపాత్ర వహిస్తోందన్నారు.

ఈ రెండు పార్టీలు ప్రస్తుతం మిలాఖత్ అయ్యాయని.. కేటీఆర్, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పొద్దున్నే దూషించుకుంటున్నారని.. రాత్రయితే కలిసి చర్చలు జరుపుకుంటున్నారని లక్ష్మణ్ ఆరోపించారు.

హుజూర్‌నగర్ ఉపఎన్నిక విషయంలోనూ కాంగ్రెస్, టీఆర్ఎస్‌లు రాజీపడ్డాయని.. హస్తం గుర్తుకు ఓటేస్తే అది టీఆర్ఎస్‌కే చెందుతుందంటూ మండిపడ్డారు. కాంగ్రెస్, టీఆర్ఎస్‌లు వేరు వేరు కాదని నిజామాబాద్‌లో రైతులు టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పోటీ చేశారని ఆయన గుర్తుచేశారు.

ఇదే తరహాలో సర్పంచ్‌ల సమస్యలు పట్టించుకోకుండా జాయింట్ చెక్ పవర్, మొక్కలు పెంచకపోయినా, నీటి బిల్లు కట్టకపోయినా, కరెంట్ బిల్లు కట్టకపోయినా సస్పెండ్ చేస్తామని కేసీఆర్ బెదిరిస్తున్నారని లక్ష్మణ్ దుయ్యబట్టారు.

కేసీఆర్‌కు వ్యతిరేకంగా సర్పంచ్‌లంతా ఏకమైతే.. రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని లక్ష్మణ్ గుర్తు చేశారు. 

సంబంధిత వార్తలు:

కేసీఆర్ హుజూర్ నగర్ వ్యూహం: ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏకాకి

వీకెండ్: హుజూర్ కోసం పోరు, అజరుద్దీన్ తో వివేక్ కు కేటీఆర్ చెక్

2011 బాన్సువాడ నిర్ణయం: హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో పోటీకి టీడీపీ సై

హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఎఫెక్ట్: సర్పంచుల సంఘం అధ్యక్షుడు మిస్సింగ్?

హుజూర్ నగర్ పై చంద్రబాబు మంతనాలు: ఉత్తమ్ కు షాక్?

కోదాడలో చెల్లని పైసా హుజూర్ నగర్ లో చెల్లుతుందా: ఉత్తమ్ పై కర్నె ప్రభాకర్ ధ్వజం

హుజూర్ నగర్ ఉప ఎన్నిక... బరిలో 251మంది సర్పంచులు

కాంగ్రెస్, టీఆర్ఎస్‌లకు షాక్: హుజూర్‌నగర్ బరిలో 30 మంది లాయర్లు

ట్రక్కు లేకపోతే ఉత్తమ్ అప్పుడే ఓడిపోయేవారు: కేటీఆర్

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక: బీజేపీ అభ్యర్ధి ఈమెనే

గెలుపు మనదే,50 వేల మెజారిటీ రావాలి: సైదిరెడ్డితో కేసీఆర్

హుజూర్ నగర్ చాలా హాట్ గురూ..: కేసీఆర్ కు సవాల్ ఇదే...

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: బిజెపిలోకి కాసోజు శంకరమ్మ?

హుజూర్‌నగర్ బైపోల్: సీపీఐ, జనసేన మద్దతుకు ఉత్తమ్ ప్రయత్నాలు

సైదిరెడ్డి స్థానీయత: ఉత్తమ్ ప్రకటనలోని ఆంతర్యం ఇదే...

శానంపూడి సైదిరెడ్డి ఆంధ్రవాడా: ఉత్తమ్ కుమార్ రెడ్డి భాష్యం అదే

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: జానా రెడ్డి కొడుక్కి బీజేపీ గాలం

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డే

హుజుర్ నగర్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల : అక్టోబర్ 21న పోలింగ్

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: మళ్లీ తెర మీదికి కాసోజు శంకరమ్మ

జగదీష్ రెడ్డి వ్యాఖ్య: రేవంత్ రెడ్డితో మాట్లాడించింది ఉత్తమ్ కుమార్ రెడ్డే

హుజూర్ నగర్ అభ్యర్థి: అన్న మాటను కాదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Follow Us:
Download App:
  • android
  • ios