హుజూర్ నగర్ అభ్యర్థి: అన్న మాటను కాదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

హుజూర్ నగర్ నియోజకవర్గంలో పద్మావతి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న రేవంత్ రెడ్డిని కోమటిరెడ్డి వెంకట రెడ్డి తప్పు పట్టారు. అయితే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభిప్రాయాన్ని ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యత్రిరేకించారు.

Huzurnagar bypoll: Komatireddy Rajagopal Reddy differs with his brother

హైదరాబాద్: హుజూర్ నగర్ శాసనసభ నియోజకవర్గం అభ్యర్థి విషయంలో తమ సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఆయన సోదరుడు, కాంగ్రెసు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విభేదించారు. ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక జిల్లాలవారీగా జరగదని ఆయన అన్నారు.

తమ అభ్యర్థిని తామే ఎంపిక చేసుకుంటామని అనడం సరి కాదని ఆయన గురువారం మీడియాతో అన్నారు. అభ్యర్థి ఎంపిక అధిష్టానం పరిధిలో ఉంటుందని ఆయన చెప్పారు. హుజూర్ నగర్ శాసనసభ నియోజకవర్గానికి పద్మావతియే సరైన అభ్యర్థి అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న విషయం తెలిసిందే. 

రేవంత్ రెడ్డి చెప్పిన పేరు తనకే కాదు, జానారెడ్డికి కూడా తెలియదని ఆయన అన్నారు. చామల కిరణ్ రెడ్డి పేరును తాను ప్రతిపాదించినట్లు రేవంత్ రెడ్డి చెప్పన విషయం తెలిసిందే. పద్మావతి పేరును తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించడాన్ని ఆయన వ్యతిరేకించారు. 

తాము 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నామని, తమను కాదని కొత్త అభ్యర్థిని పెడుతారా అని ఆయన అన్నారు. ఈ మధ్య పార్టీలో చేరినవారి సలహాలు తమకు అవసరం లేదని అన్నారు. గతంలో విభేదాలు ఉండేవని, అయితే తాను జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసిపోయామని ఆయన అన్నారు. 

సంబంధిత వార్తలు

ఈ మధ్యే వచ్చినోళ్ల సలహాలు అక్కర్లేదు: రేవంత్‌పై కోమటిరెడ్డి వ్యాఖ్యలు

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: కాంగ్రెసు అభ్యర్థి పద్మావతి, ఉత్తమ్ ప్రకటన

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: ఉత్తమ్ పద్మావతికి రేవంత్ రెడ్డి నిరసన సెగ

నాలుగు రాష్ట్రాల్లో ఉపఎన్నికలకు నోటిఫికేషన్: లిస్ట్‌లో లేని హుజూర్‌నగర్‌

హుజూర్‌నగర్‌ నుండి పోటీకి ఉత్తమ్ సతీమణి నో

హుజూర్‌నగర్: ఉత్తమ్ సీనియారిటీకి లోకల్ ట్విస్ట్

టీఆర్ఎస్ లో అసంతృప్తి... ఉత్తమ్ షాకింగ్ కామెంట్స్

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios