హైదరాబాద్: అక్టోబర్ 21వ తేదీన హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో  మద్దతు కూడగట్టేందుకు  టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయత్నాలను ప్రారంభించారు.

హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానం నుండి  2009, 2014, 2018 ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించాడు.  2019 ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల్లో  నల్గొండ ఎంపీ స్థానం నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు.

దీంతో ఎమ్మెల్యే పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు.  ఉప ఎన్నికల్లో పద్మావతిని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపనున్నారు.  టీఆర్ఎస్ మాత్రం గత ఎన్నికల్లో బరిలోకి దింపిన శానంపూడి సైదిరెడ్డిని బరిలోకి దింపింది.

ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల్లో  ఇతర పార్టీల మద్దతును కూడగడుతున్నారు.  ఆదివారం నాడు సీపీఐ, జనసేన నేతలను ఉత్తమ్ కుమార్ రెడ్డి  కలిశారు.

హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో  కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని  కోరారు. అయితే  ఈ విషయాలపై ఈ రెండు పార్టీలు ఏ రకమైన నిర్ణయం తీసుకొంటారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.

2018 డిసెంబర్ 7వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  సీపీఐ, తెలంగాణ జనసమితి, కాంగ్రెస్, టీడీపీలు కలిసి పోటీ చేశాయి.  ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 స్థానాలను కైవసం చేసుకొని రెండో దఫా రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకొంది.

సంబంధిత వార్తలు

సైదిరెడ్డి స్థానీయత: ఉత్తమ్ ప్రకటనలోని ఆంతర్యం ఇదే...

శానంపూడి సైదిరెడ్డి ఆంధ్రవాడా: ఉత్తమ్ కుమార్ రెడ్డి భాష్యం అదే

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: జానా రెడ్డి కొడుక్కి బీజేపీ గాలం

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డే

హుజుర్ నగర్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల : అక్టోబర్ 21న పోలింగ్

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: మళ్లీ తెర మీదికి కాసోజు శంకరమ్మ

జగదీష్ రెడ్డి వ్యాఖ్య: రేవంత్ రెడ్డితో మాట్లాడించింది ఉత్తమ్ కుమార్ రెడ్డే

హుజూర్ నగర్ అభ్యర్థి: అన్న మాటను కాదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి