హుజూర్ నగర్ ఉప ఎన్నిక: బిజెపిలోకి కాసోజు శంకరమ్మ?
హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి బిజెపి అభ్యర్థిగా కాసోజు శంకరమ్మ రంగంలోకి దిగే అవకాశం ఉంది. తమ పార్టీలోకి రావాలని శంకరమ్మను బిజెపి నాయకత్వం ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే. తనకు హుజూర్ నగర్ టికెట్ ఇవ్వాలని ఆమె షరతు పెట్టినట్లు సమాచారం.
హుజూర్ నగర్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నాయకురాలు, తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ బిజెపిలో చేరే అవకాశాలున్నాయి. హుజూర్ నగర్ శాసనసభ స్థానం నుంచి ఆమె బిజెపి తరఫున పోటీ చేయవచ్చునని అంటున్నారు.
2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన శంకరమ్మ ప్రస్తుత తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 2018లో ఆమెకు టీఆర్ఎస్ టికెట్ రాలేదు. ఆమెను పక్కన పెట్టి ఎన్నారై శానంపూడి సైదిరెడ్డికి టీఆర్ఎస్ టికెట్ ఇచ్చారు. దీంతో ఆమె పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు.
ఈసారి ఉప ఎన్నికలో కూడా శానంపూడి సైదిరెడ్డికే తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర రావు టికెట్ ఖరారు చేశారు ఈ స్థితిలో తమ పార్టీలోకి రావాలని శంకరమ్మను బిజెపి నాయకులు కోరినట్లు తెలుస్తోంది. అయితే, తనకు హుజూర్ నగర్ టికెట్ ఇవ్వాలని ఆమె షరతు పెట్టినట్లు తెలుస్తోంది.
హుజూర్ నగర్ బిజెపి టికెట్ కోసం జల్లేపల్లి వెంకటేశ్వర్లు, కోదాడకు చెందిన శ్రీకళా రెడ్డి పోటీ పడుతున్నారు. మాజీ ఎంపీ రవీంద్ర నాయక్, సీనియర్ న్యాయవాది రామారావు, ముద్ర అగ్రికల్చర్ సొసైటీ చైర్మన్ రామదాసప్ప నాయుడు కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. హుజూర్ నగర్ బిజెపి టికెట్ ను బిజెపి మంగళవారంనాడు ప్రకటించే అవకాశం ఉంది.
సంబంధిత వార్తలు
హుజూర్‌నగర్ బైపోల్: సీపీఐ, జనసేన మద్దతుకు ఉత్తమ్ ప్రయత్నాలు
సైదిరెడ్డి స్థానీయత: ఉత్తమ్ ప్రకటనలోని ఆంతర్యం ఇదే...
శానంపూడి సైదిరెడ్డి ఆంధ్రవాడా: ఉత్తమ్ కుమార్ రెడ్డి భాష్యం అదే
హుజూర్ నగర్ ఉప ఎన్నిక: జానా రెడ్డి కొడుక్కి బీజేపీ గాలం
హుజూర్ నగర్ ఉప ఎన్నిక: టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డే
హుజుర్ నగర్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల : అక్టోబర్ 21న పోలింగ్
హుజూర్ నగర్ ఉప ఎన్నిక: మళ్లీ తెర మీదికి కాసోజు శంకరమ్మ
జగదీష్ రెడ్డి వ్యాఖ్య: రేవంత్ రెడ్డితో మాట్లాడించింది ఉత్తమ్ కుమార్ రెడ్డే
హుజూర్ నగర్ అభ్యర్థి: అన్న మాటను కాదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి