హుజూర్ నగర్ ఉప ఎన్నిక: మళ్లీ తెర మీదికి కాసోజు శంకరమ్మ
కేసీఆర్ హామీతో 2018 ఎన్నికల్లో తప్పుకున్న కాసోజ్ శంకరమ్మ తిరిగి తెర మీదికి వచ్చారు. హుజూర్ నగర్ అసెెంబ్లీ టీఆర్ఎస్ టికెట్ తనకు కావాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ కూతురు కవిత పోటీ చేస్తే తనకు అభ్యంతరం లేదని అన్నారు.
హుజూర్ నగర్: శాసనసభ ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కే. చంద్రశేఖర రావు ఇచ్చిన హామీ మేరకు తప్పుకున్న కాసోజు శంకరమ్మ మళ్లీ తెర మీదికి వచ్చారు. ఉప ఎన్నికలో హుజూర్ నగర్ టీఆర్ఎస్ టికెట్ తనకు కావాలని ఆమె కోరుతున్నారు.
హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ టికెట్ తనకే కావాలని తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ డిమాండ్ చేశఆరు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున హుజూర్ నగర్ నుంచి పోటీ చేసి తాను ఓడిపోయినా ఐదేళ్ల పాటు పార్టీ నియోజకవర్గం ఇంచార్జీగా ప్రజలకు సేవ చేశానని ఆమె గుర్తు చేశారు.
2018లో శానంపూడి సైదిరెడ్డికి టికెట్ ఇచ్చినప్పుడు కేసీఆర్ కు ఇచ్చిన మాట ప్రకారం నడుచుకున్నట్లు ఆమె గురువారం హుజూర్ నగర్ లో మీడియా ప్రతినిధులతో అన్నారు. ప్రస్తుతం జరిగే ఉప ఎన్నికలో తనకు టికెట్ ఇవ్వాలని ఆమె కోరారు.
తనకు టికెట్ ఇస్తే బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెసు చీఫ్ సోనియా గాంధీలతో మాట్లాడి ఏకగ్రీవానికి సహకరించాలని కోరనున్నట్లు ఆమె తెలిపారు. అయితే, కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఇక్కడి నుంచి పోటీ చేస్తే తాను తప్పుకుంటానని ఆమె అన్నారు. ఓటర్ల కాళ్లు పట్టుకుని కవిత విజయానికి కృషి చేస్తానని ఆమె చెప్పారు.
సంబంధిత వార్తలు
జగదీష్ రెడ్డి వ్యాఖ్య: రేవంత్ రెడ్డితో మాట్లాడించింది ఉత్తమ్ కుమార్ రెడ్డే
హుజూర్ నగర్ అభ్యర్థి: అన్న మాటను కాదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
ఈ మధ్యే వచ్చినోళ్ల సలహాలు అక్కర్లేదు: రేవంత్‌పై కోమటిరెడ్డి వ్యాఖ్యలు
హుజూర్ నగర్ ఉప ఎన్నిక: కాంగ్రెసు అభ్యర్థి పద్మావతి, ఉత్తమ్ ప్రకటన
హుజూర్ నగర్ ఉప ఎన్నిక: ఉత్తమ్ పద్మావతికి రేవంత్ రెడ్డి నిరసన సెగ
నాలుగు రాష్ట్రాల్లో ఉపఎన్నికలకు నోటిఫికేషన్: లిస్ట్‌లో లేని హుజూర్‌నగర్
హుజూర్‌నగర్ నుండి పోటీకి ఉత్తమ్ సతీమణి నో
హుజూర్‌నగర్: ఉత్తమ్ సీనియారిటీకి లోకల్ ట్విస్ట్
టీఆర్ఎస్ లో అసంతృప్తి... ఉత్తమ్ షాకింగ్ కామెంట్స్