హైదరాబాద్:హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానంలో 50వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించాలని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు.

హుజూర్ నగర్ అసెంబ్లీ  ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్దిగా బరిలోకి దిగుతున్న శానంపూడి సైదిరెడ్డికి  తెలంగాణ సీఎం కేసీఆర్  సోమవారం నాడు బీ ఫారం అందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అన్ని సర్వేల్లో కూడ టీఆర్ఎస్ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని రిపోర్టులు చెబుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల ప్రచారంలో కూడ తాను పాల్గొంటానని కేసీఆర్ సైదిరెడ్డికి హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ ను చిత్తుగా ఓడించాలని కేసీఆర్ ప్రజలను కోరారు.ఇక బీజేపీకి డిపాజిట్ కూడ దక్కొద్దని ఆయన టీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు.ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు.

ఏనాడూ కూడ నియోజకవర్గాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్ కు అన్ని వర్గాల నుండి ఆదరణ ఉందన్నారు.

నియోజకవర్గంలోని మెజారిటీ గ్రామపంచాయితీల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులే విషయం సాధించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. కాంగ్రెస్ ఓటమి ఖాయమని తేలిందన్నారు. అయినా ఆ పార్టీ హడావుడి చేస్తోందన్నారు. తనకు టిక్కెట్టు కేటాయించినందుకు గాను సైదిరెడ్డి సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు

హుజూర్ నగర్ చాలా హాట్ గురూ..: కేసీఆర్ కు సవాల్ ఇదే...

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: బిజెపిలోకి కాసోజు శంకరమ్మ?

హుజూర్‌నగర్ బైపోల్: సీపీఐ, జనసేన మద్దతుకు ఉత్తమ్ ప్రయత్నాలు

సైదిరెడ్డి స్థానీయత: ఉత్తమ్ ప్రకటనలోని ఆంతర్యం ఇదే...

శానంపూడి సైదిరెడ్డి ఆంధ్రవాడా: ఉత్తమ్ కుమార్ రెడ్డి భాష్యం అదే

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: జానా రెడ్డి కొడుక్కి బీజేపీ గాలం

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డే

హుజుర్ నగర్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల : అక్టోబర్ 21న పోలింగ్

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: మళ్లీ తెర మీదికి కాసోజు శంకరమ్మ

జగదీష్ రెడ్డి వ్యాఖ్య: రేవంత్ రెడ్డితో మాట్లాడించింది ఉత్తమ్ కుమార్ రెడ్డే

హుజూర్ నగర్ అభ్యర్థి: అన్న మాటను కాదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి