Asianet News TeluguAsianet News Telugu

హుజూర్‌నగర్ ఉపఎన్నిక: టీఆర్ఎస్‌కి సీపీఐ మద్ధతుపై ఎల్లుండి నిర్ణయం

హుజూర్‌నగర్ ఉపఎన్నిక నేపథ్యంలో సీపీఐ నేతలతో టీఆర్ఎస్ నేతల భేటీ ముగిసింది. హుజూర్‌నగర్ ఉపఎన్నికకు సీపీఐ మద్ధతు కోరుతున్న గులాబీ చీఫ్... సీపీఐ రాష్ట్ర కార్యాలయానికి టీఆర్ఎస్ నేతలు కేకే, నామా, వినోద్‌ను పంపారు.

trs cpi leaders meeting completed
Author
Huzurnagar, First Published Sep 29, 2019, 4:04 PM IST | Last Updated Sep 29, 2019, 4:09 PM IST

హుజూర్‌నగర్ ఉపఎన్నిక నేపథ్యంలో సీపీఐ నేతలతో టీఆర్ఎస్ నేతల భేటీ ముగిసింది. హుజూర్‌నగర్ ఉపఎన్నికకు సీపీఐ మద్ధతు కోరుతున్న గులాబీ చీఫ్... సీపీఐ రాష్ట్ర కార్యాలయానికి టీఆర్ఎస్ నేతలు కేకే, నామా, వినోద్‌ను పంపారు.

హుజూర్‌నగర్ అసెంబ్లీ  స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో  పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డికి మద్దతు ఇవ్వాలని గులాబీ నేతలు కోరారు. దీనిపై స్పందించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి.. ఎల్లుండి జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

సమావేశం అనంతరం టీఆర్ఎస్ ఎంపీ కేకే మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే సీపీఐ నేతలను కలిశామన్నారు. హుజూర్‌నగర్‌లో తాము సీపీఐ మద్ధతు కోరుతున్నామని టీఆర్ఎస్, సీపీఐ భావజాలం ఒక్కటేనని కేకే స్పష్టం చేశారు.

ఎప్పటికైనా మా మిత్రులు సీపీఐ అనే భావనలో ఉన్నామని, చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని వెల్లడించారు. యురేనియం తవ్వకాలు ఆపాలని, పోడు భూముల అంశాన్ని సీపీఐ నేతలు ప్రస్తావించారని కేకే పేర్కొన్నారు.

రెండు అంశాలపై తాము కూడా అనుకూలంగా ఉన్నామని రెవెన్యూ చట్టం మార్పులపై అభిప్రాయం తీసుకోవాలని సీపీఐ కోరిందని ఆ ప్రతిపాదనకు ఓకే చెప్పామన్నారు. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ..  యురేనియంపై సీఎం మంచి నిర్ణయం తీసుకున్నారన్నారు.

సమావేశంలో పోడు భూముల అంశాన్ని కూడా చర్చించామని, రెవెన్యూ చట్టంలో మార్పులకు అభిప్రాయం తీసుకోవాలని సూచించామని వెంకటరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధే తమకు ముఖ్యమని చాడ తెలిపారు.

సంబంధిత వార్తలు:

హుజూర్‌నగర్ ఉప ఎన్నికలు: సీపీఐ మద్దతుకు టీఆర్ఎస్ యత్నాలు

హుజూర్‌నగర్ ఉప ఎన్నికలు: సీపీఎం అభ్యర్ధి పారేపల్లి శేఖర్ రావు

హుజూర్‌నగర్ ఉపఎన్నిక: కాంగ్రెస్‌కు ఓటేస్తే టీఆర్ఎస్‌కి వేసినట్లే.. లక్ష్మణ్ వ్యాఖ్యలు

కేసీఆర్ హుజూర్ నగర్ వ్యూహం: ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏకాకి

వీకెండ్: హుజూర్ కోసం పోరు, అజరుద్దీన్ తో వివేక్ కు కేటీఆర్ చెక్

2011 బాన్సువాడ నిర్ణయం: హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో పోటీకి టీడీపీ సై

హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఎఫెక్ట్: సర్పంచుల సంఘం అధ్యక్షుడు మిస్సింగ్?

హుజూర్ నగర్ పై చంద్రబాబు మంతనాలు: ఉత్తమ్ కు షాక్?

కోదాడలో చెల్లని పైసా హుజూర్ నగర్ లో చెల్లుతుందా: ఉత్తమ్ పై కర్నె ప్రభాకర్ ధ్వజం

హుజూర్ నగర్ ఉప ఎన్నిక... బరిలో 251మంది సర్పంచులు

కాంగ్రెస్, టీఆర్ఎస్‌లకు షాక్: హుజూర్‌నగర్ బరిలో 30 మంది లాయర్లు

ట్రక్కు లేకపోతే ఉత్తమ్ అప్పుడే ఓడిపోయేవారు: కేటీఆర్

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక: బీజేపీ అభ్యర్ధి ఈమెనే

గెలుపు మనదే,50 వేల మెజారిటీ రావాలి: సైదిరెడ్డితో కేసీఆర్

హుజూర్ నగర్ చాలా హాట్ గురూ..: కేసీఆర్ కు సవాల్ ఇదే...

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: బిజెపిలోకి కాసోజు శంకరమ్మ?

హుజూర్‌నగర్ బైపోల్: సీపీఐ, జనసేన మద్దతుకు ఉత్తమ్ ప్రయత్నాలు

సైదిరెడ్డి స్థానీయత: ఉత్తమ్ ప్రకటనలోని ఆంతర్యం ఇదే...

శానంపూడి సైదిరెడ్డి ఆంధ్రవాడా: ఉత్తమ్ కుమార్ రెడ్డి భాష్యం అదే

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: జానా రెడ్డి కొడుక్కి బీజేపీ గాలం

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డే

హుజుర్ నగర్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల : అక్టోబర్ 21న పోలింగ్

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: మళ్లీ తెర మీదికి కాసోజు శంకరమ్మ

జగదీష్ రెడ్డి వ్యాఖ్య: రేవంత్ రెడ్డితో మాట్లాడించింది ఉత్తమ్ కుమార్ రెడ్డే

హుజూర్ నగర్ అభ్యర్థి: అన్న మాటను కాదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios