PM Modi met Rampal Kashyap: ప్రధాని నరేంద్ర మోడీ రాంపాల్ కశ్యప్‌ను కలిశారు. అంతకుముందు, పీఎం మోడీ ప్రధాని అయి, తనను కలిసే వరకు చెప్పులు వేసుకోనని 14 ఏళ్ల కిందట కైతల్‌కు చెందిన రాంపాల్ కశ్యప్ ప్రతిజ్ఞ చేశారు.
పూర్తి కథనం చదవండి- Home
- National
- Telugu news live updates: 14 ఏళ్లుగా చెప్పుల్లేకుండా.. రాంపాల్ కశ్యప్ కు స్వయంగా చెప్పులు తొడిగిన మోడీ.. వీడియో
Telugu news live updates: 14 ఏళ్లుగా చెప్పుల్లేకుండా.. రాంపాల్ కశ్యప్ కు స్వయంగా చెప్పులు తొడిగిన మోడీ.. వీడియో

రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ఉక్రెయిన్‌పై దాడులకు దిగింది రష్యా. ఈ రోజు దేశవ్యాప్తంగా అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు సాయంత్రం 5 గంటలకు భూభారతి ప్రారంభించనున్నారు. తెలంగాణలో నేడు ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల చేయనున్నారు. కేబినెట్ సబ్ కమిటీ జీవోను విడుదల చేయనున్నారు. వీటితో పాటు ఇతర జాతీయ, అంతర్జాతీయ వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం..
14 ఏళ్లుగా చెప్పుల్లేకుండా.. రాంపాల్ కశ్యప్ కు స్వయంగా చెప్పులు తొడిగిన మోడీ.. వీడియో
భారత్ లోని టాప్-10 క్లీనెస్ట్ సిటీలు: తెలుగు రాష్ట్రాల నుంచి ఏ నగరాలున్నాయి?
India’s Top 10 Cleanest Cities 2025: స్వచ్ఛ సర్వేక్షణ్ 2025 ఫలితాలు వచ్చేశాయి. భారత్ లోని టాప్-10 అత్యంత పరిశుభ్రమైన నగరాలు (క్లీనెస్ట్ సిటీస్) ఏవో తెలిశాయి. మరోసారి మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరం మళ్లీ అగ్రస్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ నుండి మూడు నగరాలు ఈ లిస్టులో చోటుదక్కించుకున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
వందల కోట్లు సంపాదించిన పద్మనాభం.. చివరి రోజుల్లో రోడ్డున పడటానికి కారణమేంటో తెలుసా?
Padmanabham: సీనియర్ నటుడు, కమెడియన్ పద్మనాభం తనదైన కామెడీతో ఆరు దశాబ్దాలపాటు ఆడియెన్స్ ని అలరించారు. ఆయన నటుడిగానే కాదు, నిర్మాతగా, దర్శకుడిగానూ నిరూపించుకున్నారు. కానీ హాస్యనటుడిగానే గుర్తింపు తెచ్చుకున్నారు. వందల సినిమాలు చేసి మెప్పించిన ఆయన తన ఆరు దశాబ్దాల కెరీర్‌లో వందల కోట్ల విలువ చేసే ఆస్తులు సంపాదించాడు. కానీ చివరి రోజులు వచ్చేసరికి అన్నీ పోగొట్టుకుని ఇబ్బందులు పడే పరిస్థితి తలెత్తింది. మరి ఎందుకు అలా జరిగింది? ఆయన చేసిన మిస్టేక్ ఏంటనేది చూస్తే.
పూర్తి కథనం చదవండిWaqf Act Challenged by YSRCP: ముస్లింలకు అన్యాయం జరిగితే సహించం.. వక్ఫ్ చట్టంపై సుప్రీంలో వైసీపీ పిటిషన్!
Waqf Act Challenged by YSRCP: పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం తర్వాత వక్ఫ్ బిల్లు ఇటీవల చట్టంగా మారింది. అయితే.. ఈ చట్టం వల్ల ముస్లింలకు తీరని అన్యాయం జరుగుతోందని వైఎస్ఆర్‌సీపీ ఆరోపిస్తోంది. ఇక ఈ చట్టాన్ని వ్యతిరకిస్తూ.. సుప్రీంకోర్టులో ఈ రోజు వైసీపీ పిటిషన్ దాఖలు చేసింది. వక్ఫ్ బిల్లును చట్టంగా చేయడం రాజ్యాంగ విరుద్ధమని వైసీపీ పేర్కొంది. ముస్లింల నిరసనలు, ఆందోళనలను నేపథ్యంలో వాటిని బీజేపీ సర్కార్ పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైందని అందుకు చట్టాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసినట్లు పార్టీ ప్రకటించింది.
పూర్తి కథనం చదవండిGold vs Silver: మీరు వెంటనే కొనాల్సింది బంగారం కాదు వెండి.. ఎందుకంటే?
Gold Reigns, But Silver Rules the Future: బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. సాధారణంగా, బంగారం, వెండి రెండూ విలువైన లోహాలు కావడంతో ధరలు పెరుగుతున్నా కోనుగోలు విషయంలో చాలా మంది వెనక్కి తగ్గడం లేదు. అయితే మీరు ఇప్పుడు ముందు కొనాల్సింది బంగారం కాదు వెండి. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండిCM Revanth: ధరణికి బాయ్ బాయ్.. భూభారతికి జై.. పోర్టల్ ప్రారంభంపై రేవంత్ హాట్ కామెంట్స్!
Bhoobharathi Portal: తెలంగాణలో సాగు భూముల రిజిస్ట్రేషన్లు- మ్యుటేషన్ల సేవల ధరణి పోర్టల్‌ను తీసివేసి ఆ స్ఠానంలో భూభారతి పోర్టల్‌ను రేవంత్ సర్కార్ తీసుకొచ్చింది. ఈరోజు హైదరాబాద్ శిల్పకళా వేదికపై తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భూభారతి పోర్టల్ ప్రారంభించినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తొలి విడతలో నాలుగు మండలాల్లో భూభారతి పోర్టల్‌ను పైలెట్ ప్రాజెక్టు సేవలను కొనసాగించనున్నారు. నారాయణపేట జిల్ల మద్దూరు, కామారెడ్డిలోని లింగంపేట, ములగులోని వెంకటాపూర్, ఖమ్మంలోని నేలకొండపల్లి మండలాలను రేవంత్ ఎంపిక చేశార. అయితే.. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2 నుంచి పూర్తి స్థాయిలో పోర్టల్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అప్పటివరకు పోర్టల్ పనితీరుపై ప్రజల నుంచి సూచనలు, సలహాలు తీసుకుని అందుకు తగ్గట్లు మార్పులు చేర్పులు చేయనున్నారు. అయితే.. ధరణి తొలగించడానికి కారణాలు ఇలా..
Shani: మే 15 నుంచి ఈ మూడు రాశుల వారి జీవితంలో కీలక మార్పులు.. శనిదేవుడి ప్రభావం
కర్మలకు న్యాయనిర్ణేత అయిన శని దేవుడిని న్యాయమైన దేవుడు అని పిలుస్తారు. శని దేవుడు ప్రజలకు వారి కర్మల ప్రకారం ఫలితాలను ఇస్తాడు. ప్రతి ఒక్కరికీ వారి వారి కర్మల ప్రకారం ఫలాలను ఇచ్చేవాడు. శని దృష్టి నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఏప్రిల్ 15, 2025 ఒక ప్రత్యేకమైన రోజు. ఈ రోజున ఏర్పడిన గ్రహ యోగాలలో సిద్ధి యోగం ఒకటి. మంగళవారం నుంచి శని ప్రభావం మూడు రాశులపై పడనుంది. వీరి జీవితంలో కీలక మార్పులు మొదలు కానున్నాయి. ఇంతకీ ఆ రాశుల వారి జీవితంలో జరిగే మార్పులు ఏంటంటే..
భార్య వేధింపులు.. రాజ్‌భవన్ దగ్గర టెకీ సూసైడ్ అటెంప్ట్..
Techie Suicide Attempt Wife's Harassment: కుటుంబ గొడవలతో విసిగిపోయిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని రాజ్‌భవన్ దగ్గర సూసైడ్ చేసుకునేందుకు ప్రయత్నించాడు. హెబ్బాళ్‌లో ఉండే జుహైల్ అహ్మద్ (26) సూసైడ్ చేసుకునేందుకు ట్రై చేసిన వ్యక్తిగా గుర్తించారు.
పూర్తి కథనం చదవండిMarriage – Experts Advice: భార్యపై అనుమానం ఎందుకు వస్తుంది? ఇలా గుర్తించి.. ఇట్టే పరిష్కరించుకోండి!
Marriage – Experts Advice: భార్యాభర్తల మధ్య బంధం ఎంతో పవిత్రమైనది. కానీ నేటి కాలంలో ఒకరిపై ఒకరు అనుమానం పెంచుకుంటూ.. జీవితాలను చీకటి మయం చేసుకుంటున్నారు. అనుమానాన్ని ఆదిలోనే తుంచేయకపోతే అది పెనుభూతంగా మారుతోందంటున్నారు నిపుణులు. ఒకసారి అనుమానం ప్రారంభమయ్యాక.. అది మనిషిని కుంగదీస్తుందని.. చివరికి ఎవరో ఒకరి ప్రాణాలు పోయినా కూడా అనుమానం మనసులో నుంచి పోదని అంటున్నారు. మరి భార్యాభర్తలు ఎలాంటి విషయాలను అనుమానించాలి. ఏ సందర్భంలో అనుమానించాలి.. అనుమానం రాకుండా ఉండాలంటే ఎలాంటి పనులు చేయాలి? ఒకవేళ ఇప్పటికే అనుమానం మొదలై ఉంటే దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి అన్న విషయాలు తెలుసుకుందామా?
పూర్తి కథనం చదవండిIPL 2025: వరుస ఓటములు.. సీఎస్కేకు ధోని సర్జరీ.. ముగ్గురు స్టార్లు అవుట్?
CSK MS Dhoni's Drastic Rebuild: ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వరుసగా ఐదు మ్యాచ్‌లు ఓడి, పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పడిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్ ప్రదర్శనలు చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. ఈ క్రమంలోనే సీఎస్కే కెప్టెన్ గా తిరిగొచ్చిన ధోని చెన్నై టీమ్ ను రీబిల్డ్ చేసే పనిలో పడ్డాడు.
పూర్తి కథనం చదవండి14 ఏళ్లుగా చెప్పులు ధరించని వ్యక్తికి స్వయంగా షూస్ తొడిగిన ప్రధాని మోదీ.. ఎందుకో తెలుసా.?
మోదీ ప్రధాని అయ్యాక, తనను కలిసే వరకు చెప్పులు వేసుకోనని 14 ఏళ్ల కిందట రాంపాల్ కశ్యప్ మొక్కుకున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ రాంపాల్ కశ్యప్ ను తొలిసారి కలిశారు. ఈ సందర్భంగా మోదీ నేరుగా రాంపాల్ కు షూలను ధరించమని అందించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
పూర్తి కథనం చదవండిMehul choksi: రూ. 1300 కోట్ల కుంభకోణంలో నిందితుడి అరెస్ట్.. భారత్ తీసుకువచ్చే ప్రయత్నాలు
రూ.13,000 కోట్ల పీఎన్‌బీ బ్యాంక్ రుణ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన మెహుల్ చోక్సీని భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. 2025 ఏప్రిల్ 12, శనివారం నాడు మెహుల్ చోక్సీని అరెస్టు చేశారు. ప్రస్తుతం న్యాయపరమైన ప్రక్రియల కోసం అతడు కస్టడీలో ఉన్నాడు. అతనికి తన న్యాయవాదిని కలుసుకునే హక్కు ఇచ్చారు. చోక్సీ అప్పగింతకు భారత ప్రభుత్వం నుంచి అధికారికంగా అభ్యర్థన అందిందిదని అని బెల్జియన్ న్యాయశాఖ ప్రకటించింది.
Sreeleela Janhvi Kapoor: ఇంద్రుడి కుమార్తెలే శ్రీలీల, జాన్వీ.. యంగ్ హీరో కామెంట్స్.. ఏ ఉద్దేశంతో అన్నాడో?
Sreeleela Janhvi Kapoor: లోకల్, పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ నార్త్, సౌత్‌లోని యూత్‌కి పిచ్చెక్కిస్తున్నారు అందాల ముద్దుగుమ్మలు శ్రీలీల, జాన్వీకపూర్. పుష్ప-2లో కిసిక్ సాంగ్‌లో నృత్యం చేసి పాన్‌ఇండియా లెవల్‌లో శ్రీలీల క్రేజ్ సంపాదించుకుంది. ఇక అలనాటి అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె.. జాన్వీ దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇక ఇద్దరి గ్లామర్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. అయితే.. వీరి అందాల గురించి ఓ షోలో యంగ్ హీరో చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి.. శ్రీలీల, జాన్వీ ఇద్దరూ ఇంద్రుడి కుమార్తెలు అని అనేశాడు. ఆ కామెంట్లను చేసిన హీరో ఎవరు, ఎక్కడ, ఎందుకు అనాల్సి వచ్చిందో ఇప్పుడు చూద్దాం.
PM Modi: తెలంగాణలో అడవులపైకి బుల్డోజర్లను పంపడంలో కాంగ్రెస్ ప్రభుత్వం బిజీబిజీ: మోదీ
PM Modi: ప్రకృతి నాశనం, వన్యప్రాణులకు హాని’.. ఇదే కాంగ్రెస్ పాలనని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. అటవీ సంపదను కాంగ్రెస్ నాశనం చేస్తోందని ఆరోపించారు.
పూర్తి కథనం చదవండిPM Modi: ముస్లింలపై నిజంగానే ప్రేమ ఉంటే ముందు ఆ పనిచేయండి.. కాంగ్రెస్‌కు మోదీ సవాల్
ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి కాంగ్రెస్ పై ఫైర అయ్యారు. హర్యానాలోని హిసార్‌లో జరిగిన సభలో మాట్లాడారు. కాంగ్రెస్‌ని మోదీ తీవ్రంగా విమర్శించారు. ముస్లింల మీద నిజంగా శ్రద్ధ ఉంటే కాంగ్రెస్ వాళ్ళని అధ్యక్షుడిగా ఎందుకు చేయకూడదని మోదీ సవాల్ విసిరారు. మోదీ ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..
పూర్తి కథనం చదవండికాంగ్రెస్ చీకటి రోజులకు బీజేపీ ముగింపు పలికింది: ప్రధాని మోదీ
హర్యానాలోని యమునానగర్‌లో విద్యుత్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ, కాంగ్రెస్ పాలనలో చీకటి రోజులను గుర్తు చేశారు. అంబేద్కర్ పారిశ్రామిక దృష్టిని ఉటంకిస్తూ, దేశ నిర్మాణంలో విద్యుత్ పాత్రను నొక్కి చెప్పారు.
Hyderabad: SRH టీమ్ ఉన్న హోటల్‌లో అగ్నిప్రమాదం.. జట్టు పరిస్థితి ఏంటంటే
హైదరాబాద్‌లోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో సోమవారం మంటలు చెలరేగాయి. ఈ హోటల్‌లో ఐపీఎల్ జట్టైన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఆటగాళ్లు బస చేస్తున్నారు. బంజారహిల్స్‌లో ఉండే పార్క్ హయత్ హోటల్లో ఒక ఫ్లోర్‌లో మంటలు మొదలయ్యాయి. వెంటనే హోటల్ సిబ్బంది ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం అందించారు.
Electric Scooter: రూ. 60 వేలలో అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్.. లైసెన్స్ కూడా అవసరం లేదు.
ఆంపియర్ రియో 80 ఒక బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది రోజువారీ ప్రయాణానికి చాలా అనుకూలంగా ఉంటుంది. దీనిలో ఆధునిక ఫీచర్లు, ఆకర్షణీయమైన రంగులు ఉన్నాయి. డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవసరం లేదు. ఇంతకీ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Puri Jagannadh: ''పోకిరి'' హిట్టవుతుందని పూరీ నమ్మలేదట.. ఫస్ట్ రష్ చూసి హీరో కృష్ణ అన్నమాటతో!
Puri Jagannadh: తెలుగు చిత్రపరిశ్రమలో పూరి జగన్నాథ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్‌గా పేరుంది. ఈ మధ్య కాలం కలిసిరాక.. అతను తీసిన సినిమాలు ఆడట్లేదు కానీ... ఒకప్పుడు పెద్దహీరోల కెరీర్‌ను మలుపుతిప్పాడు. కొత్త హీరోలకు స్టార్‌డమ్ కూడా అందించారు. మహేష్, ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్, రవితేజ ఇలా అనేక మందికి ఇండస్ట్రీ హిట్‌లను అందించిన దర్శకుడు పూరి. ముఖ్యంగా మహేష్‌తో పూరి రెండు సినిమాలు చేసి రెండూ బిగ్ హిట్లు అయ్యాయి. అయితే.. పోకిరీ అంత పెద్ద హిట్ అవుతుందని పూరీ జగన్నాథ్ అసలు ఊహించనేలేదంటా.. ఓ ఇంటర్వ్యూలో పోకిరీ సినిమా గురించి పలు షాకింగ్ విషయాలు పంచుకున్నారు.
Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. దేశంలోనే తొలి రాష్ట్రంగా గుర్తింపు
తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అధికారికంగా అమల్లోకి వచ్చింది. న్యాయ శాఖ తాజాగా విడుదల చేసిన జీవోతో ఈ విధానం నేటి నుంచే అమలవుతోంది. గతంలో ఏప్రిల్ 8న గవర్నర్ ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలపడంతో, ప్రభుత్వం ఆ గెజిట్ నోటిఫికేషన్‌ను తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో విడుదల చేసింది. దీంతో తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అధికారికంగా అమల్లోకి వచ్చినట్లు అయ్యింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..