MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Relationship
  • Marriage – Experts Advice: భార్యపై అనుమానం ఎందుకు వస్తుంది? ఇలా గుర్తించి.. ఇట్టే పరిష్కరించుకోండి!

Marriage – Experts Advice: భార్యపై అనుమానం ఎందుకు వస్తుంది? ఇలా గుర్తించి.. ఇట్టే పరిష్కరించుకోండి!

Marriage – Experts Advice: భార్యాభర్తల మధ్య బంధం ఎంతో పవిత్రమైనది. కానీ నేటి కాలంలో ఒకరిపై ఒకరు అనుమానం పెంచుకుంటూ.. జీవితాలను చీకటి మయం చేసుకుంటున్నారు. అనుమానాన్ని ఆదిలోనే తుంచేయకపోతే అది పెనుభూతంగా మారుతోందంటున్నారు నిపుణులు. ఒకసారి అనుమానం ప్రారంభమయ్యాక.. అది మనిషిని కుంగదీస్తుందని.. చివరికి ఎవరో ఒకరి ప్రాణాలు పోయినా కూడా అనుమానం మనసులో నుంచి పోదని అంటున్నారు. మరి భార్యాభర్తలు ఎలాంటి విషయాలను అనుమానించాలి. ఏ సందర్భంలో అనుమానించాలి.. ఒకవేళ ఇప్పటికే అనుమానం మొదలై ఉంటే దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి అన్న విషయాలు తెలుసుకుందామా? 

3 Min read
Bala Raju Telika
Published : Apr 14 2025, 07:10 PM IST| Updated : Apr 14 2025, 07:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
indian house wife husband

indian house wife husband

రెండు వేర్వేరు కుటుంబాల నుంచి వచ్చి.. ఒక్కటిగా జీవిస్తుంటారు భార్యాభర్తలు. ఇదో కొత్త ప్రపంచం ఇక్కడ కష్టం,నష్టం, సుఖదుఖాలను ఇద్దరే భరించాలని, సమస్యలను పరిష్కరించుకుని లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌ చేసుకోవాలి. కానీ నేటి కాలంలో అధిక సంఖ్యలో పెళ్లిళ్లు తక్కువ వ్యవధిలోనే పెటాకుల వరకు వెళ్తున్నాయి. దీనిక ప్రధాన కారణం.. ఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోవడం.. ఒకరి మనసును మరొకరు అర్థం చేసుకోలేకపోవడం.. ఈక్రమంలో మొదలయ్యేదే అనుమానం. 

27
wife husband life management

wife husband life management

వాస్తవానికి అనుమానం ఎంత భయంకరమైనదో.. ఒకసారి అనుమానం మొదలైన తర్వాత.. తప్పు చేయలేదని నిరూపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేయాలి. మనసులో ఒక్కసారి అనుమానం వస్తే అది పోవాలంటే అంత సులువు కాదు. మీరు ప్రాణాలే సమర్పించినా కూడా వారు అవతలి వారు నమ్ముతారని గ్యారెంటీ లేదు. ఇక సమాజంలో ఏ రెండు జంటలు ఒకేలా ఉండవు. వారికంటూ కొన్ని ఇష్టాఅయిస్టాలు ఉంటాయి. ఇక అనుమానం రావడానికి అనేక కారణాలు దోహదం చేస్తాయి. ఒకసారి అనుమానం వచ్చిన తర్వాత అది ఎందుకు వచ్చిందో ముందు సమీక్ష చేసుకోవాలి. అనుమానానికి రావడానికి ముందు తర్వాత ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏవిధంగా ఉందో గుర్తించాలి. అసలు నా భర్తకు అనుమానం ఎందుకు వచ్చింది.. లేదా నా భార్యకు అనుమానం ఎందుకు వచ్చింది ఎక్కడ మొదలైంది అన్న విషయం గురించి ఆలోచించాలి. 

37
Chanakya Niti - Wife, husband

Chanakya Niti - Wife, husband

ఒకవేళ అనుమానం కలిగిందే అనుకున్నాం.. ఉదాహరణకు భార్యపై భర్తకు అనుమానం అనుకుందాం.. ఈక్రమంలో అనేక మంది భర్త ప్రవర్తన, మాటలు చూసి గొడవ పడటం, అలగటం, లేదా బాధపడటం వంటివి చేస్తుంటారు. దీని వల్ల సాధించేది ఏమి ఉండకపోగా.. భార్యాభర్తల మధ్య దూరం పెరిగే చాన్స్‌ ఉంటుంది. దీన్నే గోటితోపోయేది గొడ్డలి దాక తెచ్చుకోవడం అన్నట్లు మాట మాట పెరిగి ఇంకాస్త అనుమానం పెరుగుతుంది. ఇందరి మధ్య దాంపత్యం దెబ్బతింటుంది. 

47

నేటి కాలంలో భార్యాభర్తల మధ్య ఇగోలు అధికమయ్యాయి. ఇద్దరూ ఉద్యోగాలు చేయడం, సమానంగా చదువుకోవడం, ఒకే వయసు కావడం ఇలాంటి వారి మధ్య ఇగోల వల్ల గొడవలు జరుగుతున్నాయి. ఒకవేళ అనుమానం వచ్చిన వెంటనే ఇగోలకు పోకుండా.. అసలు తనకు మీ మీద అనుమానం ఎందుకు వచ్చిందో అడగండి, చెప్పే దాక వదలకoడి, తన అనుమానాలు అన్ని నివృత్తి చేస్తాను అని మాట ఇవ్వండి, తాను అడిగిన వాటికి అన్నింటికీ ప్రూఫ్స్ తో సహా నిరూపించండి, తాను మీతో ఎవరి గురించి అనుమాన పడుతున్నాడో, ఏవిషంలో అనుమానం ఉందో తెలుసుకోండి.. అవసరమైతే అవతలి వారితో మాట్లాడండి, మాట్లాడించండి, మీరు సరిగ్గా వివరిస్తే.. కచ్చితంగా ప్రతి మగాడు, మహిళ తప్పకుండా అర్థం చేసుకుంటుంది.

57

ఏదైనా సమస్య వస్తే దాని పరిష్కారం వెతక్కపోవడమే అసలు ప్రాబ్లమ్‌.. నిప్పు లేనిదే పొగ రాదు అన్నట్లు ఎవరూ ఊరికే అనుమాన పడరు.. అయితే.. కొందరు పలానా అనుమానం ఉందని చెబుతారు. కొందరు మాత్రం లోలోపల కుమిలి పోతుంటారు. దీన్ని గుర్తించి వారికి అర్థమయ్యేలా వివరించాలి. లేదంటో మానసికంగా కుంగిపోయే ప్రమాదం ఉంది. 

67

అనుమానం వెంటాడుతుంటూ.. మీ గోప్యతను కాస్త పక్కన పెట్టండి... మీ ఫోన్‌కి ఉన్న లాక్‌ తీసేయండి.. మీ భర్త, భార్య కాల్‌ చేసే సమయానికి కాల్‌ వెయిటింగ్‌, లేదా లిఫ్ట్‌ చేయకుండా ఉండకండి. మెసేజ్‌లకు స్పందించండి. దూరంగా ఉంటో కనీసం రెండు మూడు సార్లు ఫోన్‌ చేసుకుని మాట్లాడుకోవాలి. ఇంటికి చేరుకోగానే ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. ఏమేం కావాలో అడిగి తెలుసుకుని ఇష్టమైనవి చేసి పెట్టండి, భర్త పక్కన ఉన్నపుడు తనతోనే గడపండి, ఫోన్ ఎక్కువగా ముట్టకండి, తన పక్కనే ఉండి మీ స్క్రీన్ లో ఏవైనా చూస్తూ తనకి కూడా చూపించి షేర్ చేయండి. 

 

77
love life management

love life management

ఒకరంటే మరొకరికి ఎంత ఇష్టమో తెలియజేయండి. నువ్వు దొరకడం నా అదృష్టం అని చెప్పండి, మీకు చెడు చేసే పని, మీకు తలవంపులు తెచ్చే ఏ పని కలలో కూడా చెయ్యను అని ప్రామిస్‌ చేయండి. మీరు రాకుంటే తోడు లేకుంటే కనీసం పుట్టింటికి కూడా వెళ్లను అని చెప్పండి, మీరే నా జీవితం అని చెప్పండి. భార్యాభర్తలు అర్థం చేసుకోవడం పెరగాలంటే... ఎదుటి వ్యక్తి ఫేస్‌, కళ్లు చూసి వారు ఏ పరిస్థితిలో ఉన్నారో గుర్తించి దగ్గరికి వెళ్లి మాట్లాడి.. సమస్యను చర్చించుకుని పరిష్కారం వెతకడం, లేదా ఒకరికొకరు ధైర్యంగా ఉండాలని చెప్పుకోవడం పాజిటివ్ ఆలోచించడం వల్ల దంపతుల మధ్య అన్యోన్యమైన జీవితం ఏర్పడుతుంది. మొక్కై వంగనిది మానై వంగునా అన్నట్లు అనుమానం వంటి పెనుభూతం జీవితాల్లోకి వచ్చిన తొలినాళ్లలోనే గుర్తించి పైన వివరించిన విధంగా పరిష్కరించుకుని  సంతోషంగా ఉండండి మరి. 

About the Author

BR
Bala Raju Telika
తెలిక బాలరాజు ఈనాడు పత్రికలో 8 సంవత్సరాలు సబ్ ఎడిటర్ రిపోర్టర్‌గా పని చేశారు. అనంతరం News X తదిర వెబ్ సైట్లలో నూ ఫీచర్, న్యూస్, స్పోర్ట్స్ కంటెంట్ క్రియేటర్ గా పని చేశారు. మొత్తం 10 సంవత్సరాల జర్నలిజం అనుభం ఉంది. ఫీచర్స్, స్పోర్ట్స్, రాజకీయాలు, ఎంటర్‌‌టైన్మెంట్ ఇలా ఏ రంగానికి సంబంధించిన వార్తలైనా, ఫీచర్లైనా రాయడం బాలరాజు ప్రత్యేకత.
జీవనశైలి
మహిళలు
పురుషులు
యుటిలిటీ
చిట్కాలు మరియు ఉపాయాలు
వైరల్ న్యూస్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved