PM Modi: తెలంగాణలో అడవులపైకి బుల్డోజర్లను పంపడంలో కాంగ్రెస్ ప్రభుత్వం బిజీబిజీ: మోదీ
PM Modi: ప్రకృతి నాశనం, వన్యప్రాణులకు హాని’.. ఇదే కాంగ్రెస్ పాలనని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. అటవీ సంపదను కాంగ్రెస్ నాశనం చేస్తోందని ఆరోపించారు.

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో తీవ్ర చర్చనీయాంశమైన కంచ గచ్చిబౌలి భూముల అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్‌లో కంచ గచ్చిబౌలి భూముల అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. హర్యానాలోని హిసార్‌లో జరిగిన సభలో మాట్లాడారు. కాంగ్రెస్‌ని మోదీ తీవ్రంగా విమర్శించారు.
అడవులపై బుల్డోజర్లు పంపి ప్రకృతిని ధ్వంసం చేయడంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బిజీగా ఉందని విమర్శించారు. ‘ప్రకృతి నాశనం, వన్యప్రాణులకు హాని’.. ఇదే కాంగ్రెస్ పాలనని వ్యాఖ్యానించారు. అటవీ సంపదను కాంగ్రెస్ నాశనం చేస్తోందని ఆరోపించారు. ఇచ్చిన హామీలను కూడా కాంగ్రెస్ మర్చిపోయిందని మోదీ పేర్కొన్నారు.
అంతకు ముందు ముస్లింల మీద నిజంగానే ప్రేమ ఉంటే ముస్లిం నేతను కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రకటించాలని మోదీ అన్నారు. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాల్ని తప్పుబట్టారు. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన మోదీ, హర్యానాలోని హిసార్‌లో జరిగిన సభలో మాట్లాడారు. కాంగ్రెస్‌ని మోదీ విమర్శించారు. కనీసం ఒక ముస్లింనైనా అధ్యక్షుడిగా చేయగలరా అని సవాల్ విసిరారు.
వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకించినందుకు కాంగ్రెస్‌ను ఆయన తప్పుబట్టారు. కాంగ్రెస్ ఎప్పుడూ ముస్లిం మత ఛాందసవాదులను బుజ్జగిస్తూ వస్తోంది. కొత్త చట్టానికి వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్న నిరసనలే దీనికి నిదర్శనం అన్నారు.
"కాంగ్రెస్ పాలన రోజులను మరచిపోకూడదు - 2014కు ముందు, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు, దేశం విద్యుత్ అంతరాయాలను ఎదుర్కొన్న రోజులను చూశాము. ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండి ఉంటే, మనం ఇంకా విద్యుత్ అంతరాయాలను ఎదుర్కొనేవాళ్ళం" అని ప్రధాని మోదీ బహిరంగ సభలో అన్నారు.