MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Puri Jagannadh: ''పోకిరి'' హిట్టవుతుందని పూరీ నమ్మలేదట.. ఫస్ట్‌ రష్‌ చూసి హీరో కృష్ణ అన్నమాటతో!

Puri Jagannadh: ''పోకిరి'' హిట్టవుతుందని పూరీ నమ్మలేదట.. ఫస్ట్‌ రష్‌ చూసి హీరో కృష్ణ అన్నమాటతో!

Puri Jagannadh: తెలుగు చిత్రపరిశ్రమలో పూరి జగన్నాథ్‌ డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ డైరెక్టర్‌గా పేరుంది. ఈ మధ్య కాలం కలిసిరాక.. అతను తీసిన సినిమాలు ఆడట్లేదు కానీ... ఒకప్పుడు పెద్దహీరోల కెరీర్‌ను మలుపుతిప్పాడు. కొత్త హీరోలకు స్టార్‌డమ్‌ కూడా అందించారు. మహేష్, ప్రభాస్‌, చరణ్‌, ఎన్టీఆర్‌, రవితేజ ఇలా అనేక మందికి ఇండస్ట్రీ హిట్‌లను అందించిన దర్శకుడు పూరి. ముఖ్యంగా మహేష్‌తో పూరి రెండు సినిమాలు చేసి రెండూ బిగ్‌ హిట్లు అయ్యాయి. అయితే.. పోకిరీ అంత పెద్ద హిట్‌ అవుతుందని పూరీ జగన్నాథ్‌ అసలు ఊహించనేలేదంటా.. ఓ ఇంటర్వ్యూలో పోకిరీ సినిమా గురించి పలు షాకింగ్‌ విషయాలు పంచుకున్నారు.   

2 Min read
Author : Bala Raju Telika
Published : Apr 14 2025, 01:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Mahesh Babu

Mahesh Babu

పూరీ జగన్నాథ్ దృష్టిలో పోకిరి ఫ్లూక్‌ సినిమా అంట.. తన దగ్గర ఉన్న వందల చెల్ల కథలతో దీన్ని సినిమాగా తీద్దామని అనుకున్నారంట పూరీ. ఏదోఒక సినిమా తీద్దాము అనే పోకిరి ప్రారంభించారంట. కానీ పోకిరి సినిమా ఫస్ట్ రష్ చూసిన మహేష్‌బాబు తండ్రి సూపర్‌స్టార్‌ కృష్ణ ఈ సినిమా ఇండస్ట్రి హిట్ అవుతుంది అన్నారంట. అయితే.. దీన్ని పూరి అసలు నమ్మలేదంట. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
pokiri movie scene

pokiri movie scene

పోకిరి హిట్‌ అవుతుందని కృష్ణ చెప్పగానే.. మీ అబ్బాయి హీరో  కాబట్టి అలా చెబుతున్నారా అని పూరి అడిగారాంట. అలాంటిది ఏమీ లేదు.. సినిమాలో కొత్తదనం కనిపిస్తుంది.. ఫోకస్‌ చేసి తీస్తే ఇండస్ట్రీ హిట్‌ అని కృష్ణ ధైర్యాన్ని ఇచ్చారంట. నిజమే కదా.. 350 సినిమాలకు పైగా నటించి, నిర్మాత, దర్శకుడి ఇలా అనే కోణాల్లో సినిమా చూసిన వ్యక్తికి ఆ మాత్రం అర్థంకాదా. అయితే... ప్రయత్నం అందరూ ఒకేలా చేస్తారు, కానీ తీసుకునే జాగ్రత్తలు సినిమాని ముందుకి తీసుకెళతాయి అన్న సూక్తి పోకిరి పనికొస్తుందట. 

36
Puri Jagannadh

Puri Jagannadh

పోకిరికి ముందు తర్వాత అనేలా తెలుగు సినిమాని పూర్తిగా మార్చేశాడు పూరీ జగన్నాథ్‌. అప్పటి వరకు మూస సినిమాలకన్నా పోకిరి చాలా భిన్నంగా ఉంది. ఇంగ్లీష్‌ సినిమాలలా పోకిరిలోని సీన్లు చాలా ఫాస్ట్‌గా నడుస్తుంటాయి. ఇది ఆడియన్స్‌ని కట్టిపడేసింది. దీంతోపాటు సినిమా నిడివి తక్కువే.. అంతేకాకుండా పాటలు కూడా సందర్భానికి తగట్టుగానే ఉండేవి. బలవంతంగా చొప్పించినవి లేవు. ఒక్కడు తరువాత ఫుల్ మాస్ సినిమా మహేష్‌కి ఇదే కావడం మరో ప్రాధాన్యం ఇచ్చింది. 

46
director Puri Jagannadh

director Puri Jagannadh

అతడు సినిమాకే మహేష్‌కు మంచి నటుడిగా గుర్తింపురాగా.. పోకిరి సినిమాతో మరో పది మార్కులు దక్కాయి. పోకిరీ స్టోరీ విషయానికి వస్తే.. ప్రియురాలు వదిలేసినా అండర్ కవర్ కాప్ గానే హీరో ఉంటాడు.. ఎక్కడా డ్రామా కనిపించదు. ఇక అలీ, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, నాజర్, మాస్టర్ భరత్, షాయాజీ షిండే, సుబ్బరాజు ఇలా ప్రతీ పాత్రని ఒక్కొక్కటి పరిచయం చేసుకుంటూ సినిమా వెళుతుంది. లాజిక్ మిస్ అయిన సీన్ ఒక్కటి కూడా ఉండదు. దీంతో మణిశర్మ, పూరీ, మహేష్, ఇలియానా, ఫైట్ మాస్టర్ విజయ్, ఇలా ప్రతి ఒక్కరి కష్టానికి తగిన ఫలితం ఇచ్చిన సినిమాగా నిలిచింది. 

56
Puri Jagannadh speech

Puri Jagannadh speech

వాస్తవానికి థ్రిల్లర్ లేదా యాక్షన్ సినిమాలలో ట్విస్ట్ ఒకసారి తెలిసిన తర్వాత ఎవరికీ చూడాలి అనిపించదు. కానీ పోకిరి ట్విస్ట్ మొదటిసారి థ్రిలింగ్‌గా అనిపిస్తుంది. అంతేకాకుండా ట్విస్ట్‌ సీన్‌ని ఆడియన్స్‌ మళ్లీ మళ్లీ చూసేలా చిత్రీకరణ చేయడం పూరి ప్రత్యేకత అని చెప్పవచ్చు. ఇక సినిమాలో భారీ సెట్స్ లేకుండా చిన్న చిన్న ప్రాంతాల్లో తీయడం కూడా కలిసొచ్చింది. రిపీట్ వాల్యూ బాగా ఎక్కువ ఉన్న సినిమాగా నిలిచింది. మహేష్ తరం నటులు అప్పటివరకు చేసిన సినిమాలకన్నా ఎక్కువ ఆదాయం తెచ్చిన సినిమా. అందులో 75 ఏళ్ల వజ్రోత్సవ వేడుకలు, అప్పటికి హీట్ లో ఉన్న సినిమా, సమ్మర్ సెలవులు, ముందే ఆడియో హిట్, మహేష్ లుక్ ఇలా అన్నీ అంశాలు కలిసి హిట్ చేశాయని దర్శకుడు చెప్పుకొచ్చారు. 

 

66
Puri Jagannadh

Puri Jagannadh

పూరీ జగన్నాథ్‌కు ఇటీవల లైగర్‌, డబుల్‌ ఇస్‌మార్ట్‌ డిజాస్టర్లు కావడంతో కొంత గ్యాప్‌ వచ్చింది. తాజాగా ఆయన తమిళనటుడు విజయ్‌సేతుపతికి కథను చెప్పి ఒప్పించారు. ప్రస్తుతం ఈ సినిమాపై పూరి దృష్టి సారించినట్లు తెలుస్తోంది. 

About the Author

BR
Bala Raju Telika
తెలిక బాలరాజు ఈనాడు పత్రికలో 8 సంవత్సరాలు సబ్ ఎడిటర్ రిపోర్టర్‌గా పని చేశారు. అనంతరం News X తదిర వెబ్ సైట్లలో నూ ఫీచర్, న్యూస్, స్పోర్ట్స్ కంటెంట్ క్రియేటర్ గా పని చేశారు. మొత్తం 10 సంవత్సరాల జర్నలిజం అనుభం ఉంది. ఫీచర్స్, స్పోర్ట్స్, రాజకీయాలు, ఎంటర్‌‌టైన్మెంట్ ఇలా ఏ రంగానికి సంబంధించిన వార్తలైనా, ఫీచర్లైనా రాయడం బాలరాజు ప్రత్యేకత.
తెలుగు సినిమా
మహేష్ బాబు ఘట్టమనేని
కృష్ణ ఘట్టమనేని
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sneha Photos: ఏంజెల్‌లా మెరిసిపోతున్న స్నేహ.. పోజులతో పనిలేదు, చిన్న స్మైల్‌ చాలు.. చూస్తే ఫిదా
Recommended image2
Pithapuramlo Ala Modalaindi Review: పిఠాపురంలో అలా మొదలైంది మూవీ రివ్యూ.. కూతురిని ఎలా పెంచాలంటే?
Recommended image3
Ram Charan Movie: నోటి దురుసు ఎక్కువ, రాంచరణ్ మూవీ షూటింగ్ లో తాగేసి పడిపోయాడు.. వార్నింగ్ ఇచ్చినా వినలేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved