MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Sreeleela Janhvi Kapoor: ఇంద్రుడి కుమార్తెలే శ్రీలీల, జాన్వీ.. యంగ్‌ హీరో కామెంట్స్‌.. ఏ ఉద్దేశంతో అన్నాడో?

Sreeleela Janhvi Kapoor: ఇంద్రుడి కుమార్తెలే శ్రీలీల, జాన్వీ.. యంగ్‌ హీరో కామెంట్స్‌.. ఏ ఉద్దేశంతో అన్నాడో?

Sreeleela Janhvi Kapoor: లోకల్‌, పాన్‌ ఇండియా చిత్రాలలో నటిస్తూ నార్త్‌, సౌత్‌లోని యూత్‌కి పిచ్చెక్కిస్తున్నారు అందాల ముద్దుగుమ్మలు శ్రీలీల, జాన్వీకపూర్‌. పుష్ప-2లో కిసిక్‌ సాంగ్‌లో నృత్యం చేసి పాన్‌ఇండియా లెవల్‌లో శ్రీలీల క్రేజ్‌ సంపాదించుకుంది. ఇక అలనాటి అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె.. జాన్వీ దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇక ఇద్దరి గ్లామర్‌ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. అయితే.. వీరి అందాల గురించి ఓ షోలో యంగ్‌ హీరో చేసిన కామెంట్లు వైరల్‌ అయ్యాయి.. శ్రీలీల, జాన్వీ ఇద్దరూ ఇంద్రుడి కుమార్తెలు అని అనేశాడు. ఆ కామెంట్లను చేసిన హీరో ఎవరు, ఎక్కడ, ఎందుకు అనాల్సి వచ్చిందో ఇప్పుడు చూద్దాం.  

2 Min read
Bala Raju Telika
Published : Apr 14 2025, 04:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
hero naveen polisetty new Movie still

hero naveen polisetty new Movie still

అల్లు అరవింద్‌ ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫాం గురించి అందరికీ తెలిసిందే. ఇక ఆహా ఓటీటీలో హీరో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. సీజన్‌-4 అన్‌స్టాపబుల్‌ సీజన్‌లో హీరో నవీన్‌ పొలిశెట్టి, హీరోయిన్‌ శ్రీలీల పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమం జరిగి చాలా రోజులు అవుతున్నా.. ఇప్పటికీ రీల్స్‌ రూపంలో సామాజిక మాధ్యమాల్లో నవీన్‌, శ్రీలీల మాట్లాడిన మాటలు, నవీన్‌ పొలిశెట్టి వ్యాఖ్యలు చక్కర్లు కొడుతున్నాయి. 
 

26
hero naveen polisetty Anushka Shetty

hero naveen polisetty Anushka Shetty

నవీన్‌ పొలిశెట్టి యువ హీరోల్లో తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. నవీన్‌ మాట్లాడే విధానం, సెన్సాఫ్ హ్యూమర్ ప్రేక్షకులకు తెగ నచ్చేస్తుంది. బలమైన కథ లేకపోయినప్పటికీ కామెడీ చిత్రంగా విడుదలైన జాతిరత్నాలు కేవలం నవీన్‌ టైమింగ్‌ కామెడీ, యాక్టింగ్‌తో బంపర్‌ హిట్‌ సాధించింది. 

36
naveen polisetty with jathiratnalu team

naveen polisetty with jathiratnalu team

నవీన్‌ తెలుగులో విడుదలైన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించారు. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. ఇక ముంబయ్‌ వెళ్లి అక్కడ యాడ్స్‌, మూవీలకు పనిచేశారు. ఆ తర్వాత తెలుగులో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టిలో నటించి హ్యాట్రిక్‌ విజయాలను కైవసం చేసుకున్నారు. ఆన్ స్క్రీన్, ఆఫ్‌ స్క్రీన్ ఎప్పుడూ తన మాటలతో నవ్వులు పూయిస్తూనే ఉంటారు నవీన్‌. 

46
jathiratnalu

jathiratnalu

నవీన్‌, శ్రీలీలా కాంబినేషన్‌లో ఓ చిత్రంలో నటించారు. దాని ప్రమోషన్స్‌లో భాగంగా అన్‌స్టాపబుల్‌ బాలయ్య షోకు ఇద్దరూ వచ్చారు. బాలయ్య పంచులు.. నవీన్‌ మంచి టైమింగ్‌ కామెడీతో సరదాగా సాగింది ఆ షో. నీకు ఎలాంటి అమ్మాయి కావాలని బాలయ్య అడగ్గా.. శ్రీలీల లా ఉంటే చాలు..  క్వాలిటీస్‌ కూడా ఆ అమ్మాయికి ఉన్నట్లు ఉండాలని ఫన్‌ జెనరేట్‌ చేశారు. 

56

ఇక జాన్వి, శ్రీలీలలో నీకు ఇష్టమైన హీరోయిన్‌ ఎవరు అని బాలయ్య నవీన్‌ను అడిగాడు. దానికి వెంటనే తడుముకోకుండా ఆలోచించకుండా ఇంద్రుడి కూతురు లాంటి శ్రీలీల అని సమాధానం ఇచ్చాడు. అలాగైతే మరి జాన్వి ఎవరని బాలయ్య అనగానే ఇంద్రుడి రెండో కూతురు అని స్పాంటేనిస్‌గా చెప్పడంతో బాలయ్య నోట మాట రాలేదు. అప్పుడు బాలయ్య ముంబయి వెళ్లి బతకనేర్చిన వాడికి అయ్యావని నవీన్‌పై పంచ్‌ వేశారు.

 

66

అన్‌స్టాపబుల్‌ షోలో... శ్రీలీల వీణ పట్టుకుని కూర్చోగా.. కుర్చీ మడతపెట్టి పాటను క్లాసికల్‌ స్టైల్‌లో చేయాలని నవీన్‌ చెప్పాడు.. వెంటనే అతను రాగమందుకున్నాడు... అది వింటున్న శ్రీలీల.. తన వీణ భరించలేకపోతోందంటూ నవ్వేసింది. వచ్చన అవకాశాలు ఏవైనా రిజక్ట్‌ చేశారా అని బాలయ్య నవీన్‌ అడగ్గా.. ఫన్నీ థింగ్‌ పంచుకున్నారు. ఓ చిప్స్‌ కంపెనీ ఆడిషన్‌కు పిలిచారని.. అప్పుడు తనకు సిక్స్‌ ప్యాక్‌ లేదని అవకాశం రిజెక్ట్‌ చేశారని నవీన్‌ అన్నాడు. అసలు చిప్స్‌ తిన్నవాడికి సిక్స్‌ప్యాక్‌ ఎలా వస్తుదన్న లాజిక్‌ ఆ కంపెనీ వాళ్లకి తెలియలేదని సరదాగా వ్యాఖ్యానించారు నవీన్‌. 

About the Author

BR
Bala Raju Telika
తెలిక బాలరాజు ఈనాడు పత్రికలో 8 సంవత్సరాలు సబ్ ఎడిటర్ రిపోర్టర్‌గా పని చేశారు. అనంతరం News X తదిర వెబ్ సైట్లలో నూ ఫీచర్, న్యూస్, స్పోర్ట్స్ కంటెంట్ క్రియేటర్ గా పని చేశారు. మొత్తం 10 సంవత్సరాల జర్నలిజం అనుభం ఉంది. ఫీచర్స్, స్పోర్ట్స్, రాజకీయాలు, ఎంటర్‌‌టైన్మెంట్ ఇలా ఏ రంగానికి సంబంధించిన వార్తలైనా, ఫీచర్లైనా రాయడం బాలరాజు ప్రత్యేకత.
తెలుగు సినిమా
జాన్వీ కపూర్
ప్రసిద్ధ వ్యక్తులు

Latest Videos
Recommended Stories
Recommended image1
Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Recommended image2
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు
Recommended image3
Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved