MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • CM Revanth: ధరణికి బాయ్‌ బాయ్‌.. భూభారతికి జై.. పోర్టల్‌ ప్రారంభంపై రేవంత్‌ హాట్‌ కామెంట్స్‌!

CM Revanth: ధరణికి బాయ్‌ బాయ్‌.. భూభారతికి జై.. పోర్టల్‌ ప్రారంభంపై రేవంత్‌ హాట్‌ కామెంట్స్‌!

Bhoobharathi Portal: తెలంగాణలో  సాగు భూముల రిజిస్ట్రేషన్లు- మ్యుటేషన్ల సేవల ధరణి పోర్టల్‌ను తీసివేసి ఆ స్ఠానంలో భూభారతి పోర్టల్‌ను రేవంత్‌ సర్కార్‌ తీసుకొచ్చింది. ఈరోజు హైదరాబాద్‌ శిల్పకళా వేదికపై తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భూభారతి  పోర్టల్‌ ప్రారంభించినట్లు సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. తొలి విడతలో నాలుగు మండలాల్లో భూభారతి పోర్టల్‌ను పైలెట్‌ ప్రాజెక్టు సేవలను కొనసాగించనున్నారు. నారాయణపేట జిల్ల మద్దూరు, కామారెడ్డిలోని లింగంపేట, ములగులోని వెంకటాపూర్‌, ఖమ్మంలోని నేలకొండపల్లి మండలాలను రేవంత్‌ ఎంపిక చేశార. అయితే.. రాష్ట్ర వ్యాప్తంగా జూన్‌ 2 నుంచి పూర్తి స్థాయిలో పోర్టల్‌ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అప్పటివరకు పోర్టల్‌ పనితీరుపై ప్రజల నుంచి సూచనలు, సలహాలు తీసుకుని అందుకు తగ్గట్లు మార్పులు చేర్పులు చేయనున్నారు. అయితే.. ధరణి తొలగించడానికి కారణాలు ఇలా..  

1 Min read
Bala Raju Telika
Published : Apr 14 2025, 09:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
CM Revanth Reddy, Ex CM K Chandrashekar Rao

CM Revanth Reddy, Ex CM K Chandrashekar Rao

హైదరాబాద్‌లో రెవెన్యూశాఖ పొంగులేటి ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సమావేశంలో ధరణి పోర్టల్‌ మార్పుపై నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలోనే పేరు మార్పు ప్రతిపాదనకు సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదం తెలిపారు. ఇక కాంగ్రెస్‌ సర్కార్‌ అధికారంలోకి రాకమునుపే ధరణి పోర్టల్‌ అవినీతి మయం అని అనేక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో పోర్టల్‌ రద్దు చేస్తున్నాట్లు సోమవారం సీఎం రేవంత్‌ నిర్ణయం తీసుకున్నారు. గతంలోనే ధరణి ప్లేస్‌లో నూతన పోర్టల్‌ వస్తుందని కాంగ్రెస్‌ ప్రభుత్వం, పార్టీ నేతలు ప్రకటిస్తూ వచ్చారు. 

24


ధరణిలో జరిగిన అవకతవకల వల్ల గత ఎన్నికల్లో ఫలితాల్లో మార్పు కనిపించిందని సీఎం రేవంత్‌ అన్నారు. భూభూమాత రూపంలో రైతులకు ఉపయోగపడే పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. అనేక రాష్ట్రాల్లోని భూచట్టాలన్నింటినీ పరిశీలించి.. నూతన చట్టం తీసుకొచ్చినట్లు వివరించారు. హరీశ్‌రావు వంటి నేతల సూచనలు, రైతులు, మేధావులతో మాట్లాడి చట్టాన్ని రూపొందించామన్నారు. 

34
Telangana, Anumulu Revanth Reddy, CM Revanth Reddy, Telangana Cabinet meeting,

Telangana, Anumulu Revanth Reddy, CM Revanth Reddy, Telangana Cabinet meeting,

ధరణి సేవల వల్ల రైతులకు ఉపయోగం లేదని మంత్రి పొంగులేటి చెబున్నారు. భూస్వాములకు అనుకూలంగా పోర్టల్‌ను రూపొందించారని ఆయన ఆరోపించారు. అంబేద్కర్‌ జయంతి రోజున భూభారతి చట్టం అమల్లోకి రావడం శుభపరిణామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ చరిత్రలో భూభారతి చట్టం ఒక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. 

 

44
cm revanth reddy

cm revanth reddy

కేసీఆర్‌ సర్కార్‌ 2020 అక్టోబరు నుంచి ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అప్పటి వరకు 2017 సెప్టెంబరు వరకు భూ దస్త్రాల నిర్వహణ అంతా మా భూమి పోర్టల్లో నిర్వహించారు. స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా సాగు భూముల రిజిస్ట్రేషన్లు నిర్వహించగా, మ్యుటేషన్లు మాత్రం తహసీల్దారు కార్యాలయాల్లో పూర్తి చేశారు. ఈక్రమంలో భూ దస్త్రాల ప్రక్షాళన చేపట్టి.. ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చారు. 

About the Author

BR
Bala Raju Telika
తెలిక బాలరాజు ఈనాడు పత్రికలో 8 సంవత్సరాలు సబ్ ఎడిటర్ రిపోర్టర్‌గా పని చేశారు. అనంతరం News X తదిర వెబ్ సైట్లలో నూ ఫీచర్, న్యూస్, స్పోర్ట్స్ కంటెంట్ క్రియేటర్ గా పని చేశారు. మొత్తం 10 సంవత్సరాల జర్నలిజం అనుభం ఉంది. ఫీచర్స్, స్పోర్ట్స్, రాజకీయాలు, ఎంటర్‌‌టైన్మెంట్ ఇలా ఏ రంగానికి సంబంధించిన వార్తలైనా, ఫీచర్లైనా రాయడం బాలరాజు ప్రత్యేకత.
తెలంగాణ
అనుముల రేవంత్ రెడ్డి
భారత రాష్ట్ర సమితి
రాహుల్ గాంధీ

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved