విద్యా బుద్ధులు నేర్పించాల్సిన టీచరే దారి తప్పాడు. తన వద్దకు వచ్చే విద్యార్థులకు మంచేదో, చెడోదే చెప్పాల్సింది పోయి.. వారికి బలవంతంగా పోర్న్ చిత్రాలను చూపించాడు. ఈ విషయం కాస్త ఆ విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియడంతో.. వారు పోలీసులను ఆశ్రయించారు. ఈ సంఘటన ఔరంగాబాద్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఔరంగాబాద్ లోని ఓ ప్రవైట్ స్కూల్ లో పనిచేసే ఓ ఉపాధ్యాయుడు మూడో తరగతి చదివే విద్యార్థులకు పోర్న్ వీడియోలు చూపించాడు.  దాదాపు 8మంది విద్యార్థులను రోజూ తన క్యాబిన్ కి పిలిచి.. తన స్మార్ట్ ఫోన్ లో ఈ వీడియోలు చూపించేవాడు. అతను  చాలా కాలంగా ఈ పనులు చేస్తుండటం గమనార్హం. ఈ విషయం ఎవరికైనా చెబితే ఊరుకోను అంటూ అంటూ వారికి అతను వార్నింగ్ కూడా ఇచ్చాడు. దీంతో.. ఆ చిన్నారులు ఎవరూ ఈ విషయంలో నోరు మెదపలేదు. 

Also Read శాడిజం.. భార్య మీద కోపంతో పసివాడికి మద్యం తాగించి..

అయితే... వారిలో ఓ విద్యార్థిని ఈ విషయాన్ని వారి తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ చిన్నారి తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు స్కూల్ కి వచ్చి విచారణ జరిపారు. పలువురు విద్యార్థులు చెప్పిన  విషయాల మేరకు అతను నేరం చేసినట్లు తెలుసుకున్నారు.

పోక్సో చట్టం సహా... పలు సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఇదిలా ఉండగా.. సదరు టీచర్ ని స్కూల్ యాజమాన్యం ట్రాన్స్ఫర్ చేసింది. స్కూల్ ప్రిన్సిపల్ పై కూడా చర్యలు తీసుకోవాలని కొందరు చిన్నారుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడం గమనార్హం.