భార్య మీద కోపంతో ఓ వ్యక్తి కన్న కొడుకుపై శాడిజం ప్రదర్శించాడు. పసిపిల్లాడు అని కూడా చూడకుండా మద్యం తాగించాడు. అక్కడితో ఆగకుండా... కొడుకు మద్యం తాగుతుండగా  వీడియో తీసి భార్యకు పంపించాడు. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.

బెంగళూరు మాగడిరోడ్డు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ వికృత చేష్ట ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు కథనం ప్రకారం... ఓ యువతి కుమారేష్ అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత అతను రౌడీ షీటర్ అని తెలిసింది.

Also Read హత్య కేసులో జీవితఖైదు: కట్ చేస్తే అతను పోలీస్.. ఖంగుతిన్న ఉన్నతాధికారులు...

అంతలో వీరికి ఓ పిల్లాడు కూడా పుట్టాడు. భర్త రౌడీషీటర్ అని తెలియడంతో.. అతనితో కాస్త దూరంగా ఉంటూ వచ్చింది భార్య. ఈ విషయంలో ఇద్దరికీ తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలో... భార్య మీద కోపాన్ని కుమారుడిపై చూపించాలని అనుకున్నాడు.

ఇటీవల తన కొడుకుతో సహా బయటకు వెళ్లాడు. తన స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న కొడుకుకి కూడా మందు తాగించాడు. దానిని వీడియో తీసి భార్యకు పంపాడు. దీంతో ఆమె వెంటనే పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.