MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • National
  • PMAY: తెలుగు ప్ర‌జ‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం గుడ్ న్యూస్‌.. 5 ల‌క్ష‌ల ఇళ్లు కేటాయింపు

PMAY: తెలుగు ప్ర‌జ‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం గుడ్ న్యూస్‌.. 5 ల‌క్ష‌ల ఇళ్లు కేటాయింపు

PMAY: ఇళ్లు లేని పేద కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) కింద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు అదనంగా 5 లక్షల ఇళ్లను కేటాయించినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు.

2 Min read
Author : Narender Vaitla
Published : Sep 15 2026, 05:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తొలిసారి భారీగా ఇళ్ల కేటాయింపు
Image Credit : Asianet News

తొలిసారి భారీగా ఇళ్ల కేటాయింపు

గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా తెలుగు రాష్ట్రాలకు ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో ఇళ్లు మంజూరు చేయడం ఇదే తొలిసారి అని పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఈ కేటాయింపుల ద్వారా రెండు రాష్ట్రాల్లో సొంత ఇల్లు లేని అర్హులైన పేద కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది. గతంలో మంజూరైన ఇళ్లకు అదనంగా తాజా కేటాయింపులు ఉంటాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించే అర్హత కలిగిన కుటుంబాలకు పథకం నిబంధనల ప్రకారం ఆర్థిక సాయం అందుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి ఈ పథకం ద్వారా కేంద్రం నుంచి నిధులు సమకూరనున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఏపీకి గతంలో కేటాయింపులు ఎలా ఉన్నాయంటే..
Image Credit : Pemmasani Chandrasekhar Facebook

ఏపీకి గతంలో కేటాయింపులు ఎలా ఉన్నాయంటే..

2019 నుంచి 2024 మధ్య ఆంధ్రప్రదేశ్‌కు 1.78 లక్షల ఇళ్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. అయితే ఆ సమయంలో కేటాయించిన వాటిలో 42 వేల ఇళ్ల నిర్మాణం మాత్రమే పూర్తయిందని వివరించారు. 2024 తర్వాత రాష్ట్రానికి ఇళ్ల కేటాయింపును గణనీయంగా పెంచినట్లు చెప్పారు. తాజా మంజూరుతో ఏపీలో మరింత మంది పేద కుటుంబాలు సొంతింటి నిర్మాణానికి కేంద్ర సహాయం పొందే అవకాశం ఏర్పడింది. గతంలో పూర్తికాని ఇళ్లతో పాటు కొత్తగా మంజూరయ్యే ఇళ్ల నిర్మాణాన్ని కూడా వేగంగా పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

35
తెలంగాణకు 2 లక్షల ఇళ్లు..
Image Credit : Google

తెలంగాణకు 2 లక్షల ఇళ్లు..

2019-24 మధ్యకాలంలో తెలంగాణ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకంలో భాగస్వామిగా లేదని పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి ఇళ్ల కేటాయింపుపై కేంద్రాన్ని పలుమార్లు కోరారని చెప్పారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కోరిన సంఖ్య కంటే ఎక్కువగానే ఇళ్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. తాజా కేటాయింపులో తెలంగాణకు 2 లక్షల ఇళ్లు దక్కాయి. దీంతో రాష్ట్రంలోని సొంత ఇల్లు లేని అర్హులైన కుటుంబాలకు కొత్తగా అవకాశం లభించనుంది.

45
ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షల వరకు సాయం
Image Credit : our own

ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షల వరకు సాయం

ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఒక్కో ఇంటి నిర్మాణానికి కేంద్రం నుంచి రూ.1.20 లక్షల ప్రాథమిక ఆర్థిక సహాయం అందుతుంది. ఇతర ప్రభుత్వ సహాయాలను కలుపుకుంటే లబ్ధిదారుడికి దాదాపు రూ.1.80 లక్షల వరకు ప్రయోజనం లభించే అవకాశం ఉందని మంత్రి వివరించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12 వేల ఆర్థిక సాయం అందుతుంది. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత కోసం ఆవాస్ ప్లస్ యాప్‌ను వినియోగించనున్నట్లు తెలిపారు. జియో ట్యాగింగ్‌తో వివరాల నమోదు చేపట్టడంతో పాటు లబ్ధిదారులే తమ వివరాలను నమోదు చేసుకునేలా సెల్ఫ్ సర్వే సదుపాయం కూడా కల్పించినట్లు చెప్పారు.

55
అర్హత నిబంధనల్లో మార్పులు.. 2-3 ఏళ్లలో నిర్మాణం పూర్తి
Image Credit : X

అర్హత నిబంధనల్లో మార్పులు.. 2-3 ఏళ్లలో నిర్మాణం పూర్తి

పథకం అర్హత నిబంధనల్లో కేంద్రం కొన్ని మార్పులు చేసినట్లు పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. కుటుంబ నెలవారీ ఆదాయ అర్హత పరిమితిని రూ.10 వేల నుంచి రూ.15 వేలకు పెంచినట్లు చెప్పారు. మోటార్ బైక్ లేదా ఫ్రిజ్ ఉన్నంత మాత్రాన పథకం ప్రయోజనం కోల్పోకుండా నిబంధనలను సవరించినట్లు వివరించారు. ఇప్పటికే మంజూరైన ఇళ్లు, తాజాగా కేటాయించిన గృహాల నిర్మాణాన్ని రెండు నుంచి మూడేళ్లలోపు పూర్తి చేయాలన్నది కేంద్రం లక్ష్యమని తెలిపారు. లబ్ధిదారుల ఎంపికలో రాజకీయాలకు తావు లేకుండా అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
BRICS 2026: గ్లోబల్ సౌత్ బిగ్ బాస్.. బ్రిక్స్ తో భారత్ సాధించిన టాప్ 5 విజయాలు ఏంటో తెలుసా?
Recommended image2
BRICS: స‌వాళ్ల‌ను క‌లిసి ఎదుర్కోవాలి.. బ్రిక్స్ స‌ద‌స్సు ముగింపు వేళ మోదీ కీల‌క ప్ర‌సంగం
Recommended image3
BRICS Summit: డాలర్‌కు చెక్.. అమెరికాకు షాక్.. భారత్ మాస్టర్ ప్లాన్‌తో మారనున్న గ్లోబల్ ట్రేడ్
Related Stories
Recommended image1
Post Office TD: ఎలాంటి రిస్క్ లేకుండా గ్యారెంటీ ఇన్‌క‌మ్‌.. పోస్టాఫీస్‌లో అద్భుత‌మైన ప‌థ‌కం
Recommended image2
ఒక‌ప్పుడు గ్రామీణ ప్రాంతం, ఇప్పుడు అభివృద్ధికి కేరాఫ్‌.. జెడ్ స్పీడ్‌తో దూసుకెళ్తున్న హైదరాబాద్‌లోని ఈ ప్రాంతం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved