Asianet News TeluguAsianet News Telugu

షాకింగ్.. చెల్లిపై అత్యాచారం చేసిన అన్న.. స్కూల్‌కు తీసుకెళ్తానని చెప్పి..

బాలికను స్కూల్‌లో దింపడానికి అని తీసుకెళ్లిన సోదరుడు.. ఆమెపైనే అత్యాచారానికి పాల్పడ్డాడ్డు. స్థానికంగా తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

15 years Girl raped by her brother in tamil nadu
Author
Chennai, First Published Dec 1, 2021, 4:23 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

బాలికను స్కూల్‌లో దింపడానికి అని తీసుకెళ్లిన సోదరుడు.. ఆమెపైనే అత్యాచారానికి పాల్పడ్డాడ్డు.  ఈ షాకింగ్ ఘటన తమిళనాడులో (Tamil Nadu) చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. తమిళనాడులోని కృష్ణగిరి ప్రాంతానికి చెందిన విజయ్ అనే యువకుడు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అయితే ఇటీవల అతని తల్లి అనారోగ్యంతో మృతిచెందింది. దీంతో విజయ్ ఒంటరిగానే జీవనం సాగిస్తున్నాడు. అయితే విజయ్‌ అలా ఒంటరిగా ఉండటం చూడలేపోయినా అతని సవతి తల్లి తమతో పాటు ఉండాల్సిందిగా కోరింది. 

విజయ్‌ను (Viajay) తన ఇంటికి తీసుకొచ్చింది. అయితే ఆమెకు ఓ 15 ఏళ్ల కూతురు ఉంది. అయితే సవతి తల్లి ఇంటికి వచ్చిన విజయ్‌‌ చాలా నీచంగా ఆలోచించాడు. సవతి తల్లి కూతురుపైనే కన్నేశాడు. చెల్లలు అవుతుందని కూడా మరిచి  అత్యాచారం చేయాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే సోమవారం బాలికను స్కూల్‌లో దింపివస్తానని బైక్‌పై తీసుకెళ్లిన విజయ్.. తన ప్లాన్‌ను అమలు చేశాడు.

బాలికను స్కూల్‌కు తీసుకెళ్లకుండా సమీపంలోని ఎవరూ లేని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాలికను ఈ విషయం ఎవరికి చెప్పవద్దని బెదిరించాడు. ఇంటి వద్ద దింపేసి బయటకు వెళ్లాడు. అయితే విజయ్ బెదిరింపులకు బయపడిన బాలిక ఈ విషయాన్ని ఇంట్లో చెప్పకుండా ఉండిపోయింది. అయితే ఇంటికి వచ్చినప్పటీ నుంచి బాలిక నీరసంగా ఉండటం గమనించిన ఆమె తల్లి.. ఏమైందని అడిగింది. దీంతో బాలిక తల్లికి అసలు విషయం చెప్పి బోరున విలపించింది. 

Also read: ప్రియుడితో నగ్న వీడియో కాల్స్.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త...కూతురుతో కూడా..

దీంతో బాలిక తల్లి.. పోలీసు స్టేషన్‌కు వెళ్లి విజయ్‌పై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే విజయ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. అతనిపై పోక్సో చట్టంతో (pocso act) పాటుగా సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

భార్య, పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్నాడు..
ఓ వ్యక్తి.. తన భార్య, ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి.. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీకి చెందిన అమిత్ కుమార్(30) నిక్కీ(27) ని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆరేళ్ల వయసుకున్న కుమార్తె, మూడేళ్ల వయసున్న కుమారుడు ఉన్నారు. కాగా.. అమిత్ కుమార్ కజిన్ సౌరబ్... మంగళవారం ఉదయం.. వారికి ఇంటికి వెళ్లాడు. అయితే.. లోపలి నుంచి.. డోర్ లాక్ వేసినట్లు గుర్తించారు. ఎంత సేపు డోర్ కొట్టినా.. వారు తెరవకపోవడం గమనార్హం.

అనుమానం వచ్చి.. సౌరబ్ వెంటనే తన తండ్రికి సమాచారం అందించాడు. ఇద్దరూ కలిసి.. డోర్ తెరిచేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో.. నలుగురు శవాలై కనిపించారు. దీంతో.. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అమిత్ సీలింగ్ కి ఉరివేసుకొని కనిపించాడు. మిగిలిన ముగ్గురు విషం తీసుకోవడం వల్ల చనిపోయినట్లు కనపడింది.  అమిత్.. ఆ ముగ్గురికి  విషం ఇచ్చి.. ఆ తర్వాత తాను.. ఉరి వేసుకన్నాడని పోలీసులు భావిస్తున్నారు. నలుగురు మృతదేహాలను శవ పరీక్ష నమిత్తం.. ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు  చేసుకొని దర్యాప్తు  చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. భార్య భర్తల మధ్య మనస్పర్థలు ఉన్నాయని తమకు తెలుసని.. కానీ.. ఇలా చనిపోయేంత వరకు ఉన్నాయనే విషయం తమకు తెలీదని.. బంధువులు చెప్పడం గమనార్హం. 

Follow Us:
Download App:
  • android
  • ios