మన వ్యక్తిత్వం ఎలాంటిదో మన మాట తీరును బట్టి లేదా కళ్లను చూసి చెబుతుంటారు. అయితే ఇంకొంతమంది మాత్రం మనం నిలబడే విధానంతోనే మన వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోవచ్చంటున్నారు. అదెలాగంటే...
మనుషులన్నాకా.. ఏ ఇద్దరూ కూడా ఒకే రకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉండదు. వ్యక్తికి వ్యక్తికి మధ్య భిన్నమైన మనస్తత్వం ఉంటుంది. ప్రతి వ్యక్తిలో ప్రేమ, కోపం , సహనం, ప్రశాంతత, చిరాకు, క్రమశిక్షణ , సోమరితనం, ఉదాసీనత వంటివి ఉంటాయి. అన్ని భావోద్వేగాలను సమర్థవంతంగా నిర్వహించే వారు సంపూర్ణ వ్యక్తులుగా గుర్తించబడతారు. కానీ ఎవరూ పరిపూర్ణ వ్యక్తిత్వం కలవారు ఉండరేమో అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ప్రతి వ్యక్తిలో ఏదో ఒక లోపం ఉండే ఉంటుంది.
కానీ మనుషులను ధనవంతులు, కులం లేదా మతం, ఉన్నత, నిమ్న వర్గాల వారిగా చూడటం మానేసి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో చూడటం ముఖ్యం.
చాలా మంది మనం మాట్లాడే విధానం, కళ్లను బట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తుంటారు. అలాగే వారు నిలబడే విధానం బట్టి కూడా తమ వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చంటున్నారు కొందరు. నడవడం, కూర్చోవడం, మాట్లాడటం వంటివి వ్యక్తికి వ్యక్తికి భిన్నంగా ఉంటాయి. నిలబడే విధానం కూడా ఇలాగే ఉంటుంది. కొంతమంది వంగి నిలబడితే.. మరికొంతమంది నిటారుగా నిలబడతారు. మరి కొంతమంది సగం వంగి నిలబడతారు. ఇవన్నీ మన వ్యక్తిత్వాలను తెలియజేస్తాయంటున్నారు కొందరు. అదెలా అంటే..
నిటారుగా నడవడం, నిటారుగా నిలబడటం వంటివి కొందరిలో మనం చూస్తుంటాం. కానీ ప్రతి ఒక్కరూ ఇలా ఎల్లప్పుడు ఉండలేరు. ఈ క్రింద పేర్కొన్న భంగిమలు తక్కువ వ్యక్తిత్వాన్ని సూచిస్తాయట. ఒకవేల మీరు కూడా స్టాండ్ ఆప్ అయితే మీరు నిలబడే విధానాన్ని మెరుగుపరుచుకోవచ్చు. తద్వారా మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుందంటున్నారు.
కొంచెం వంగి నిలబడటం మీ వ్యక్తిత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, గురించి తెలియజేస్తుంది. కొంచెం వంగి నిలబడేవారిలో ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుందట. మనస్తత్వవేత్త డాక్టర్ సీమా హింగోరానీ ప్రకారం.. ఎవరైతే వీపును నిటారగా కాకుండా కొంచెం కిందికి వంచుతారో వారు సాధారణంగా తక్కువ ఆత్మగౌరవాన్ని కలిగి ఉంటారట. అలాగే వీరు తక్కువ ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారట.
నిటారుగా నిలబడటం.. మనస్తత్వవేత్త శాస్త్రవేత్త ప్రకారం.. నిటారుగా నిలబడటమే మంచిదని అంటారు. యోగా, జాగింగ్ వంటి వ్యాయామాల ద్వారా దీన్ని సాధించవచ్చు. అయితే కొంతమంది నడిచేటప్పుడు లేదా కూర్చునేటప్పుడు కొంచెం తూలడమో లేకపోతే వంగడమే చేస్తుంటారు. ఇలాంటి వారు బలహీనమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారట. కూర్చునప్పుడు లేదా నిలబడ్డప్పుడు తిన్నగా ఉంటే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నట్టు అట.
హైపర్ ఆక్టివిటీతో లేదా చంచలత తో బాధపడుతున్న వ్యక్తులు సాధారణంగా ఈ స్థితిలో నిలబడతారు. వీరిలో తల వారి శరీరంలోని మిగిలిన భాగాలకంటే ముందుకు ఉంటుంది. ఇలాంటి వ్యక్తులు అనేక విషయాల గురించి కుతూహలంగా ఉంటారు. అంతేకాదు వీరు దేనినీ కూడా నమ్మరని హింగోరాని అంటున్నారు. ఇలాంటి వారు ప్రశాంతంగా ఉండలేరట. వీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందని మనస్తత్వవేత్త డాక్టర్ సీమా హింగోరానీ చెబుతున్నారు.
మన కదలికలు, మాట్లాడే విధానం ద్వారా అయితే ఎలా మన వ్యక్తిత్వాన్ని తెలుసుకుంటారో మనం కూర్చునే లేదా నిలబడటం, నడవడం వంటివి కూడా మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఇవి కూడా ముఖ్యమే.
