కేసీఆర్ కు సెగ: రసమయి సంచలన వ్యాఖ్యలు, ఈటలకు తోడు
ఈటల రాజేందర్ తో పాటు వేదికను పంచుకుని, పరిణామాలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వ్యాఖ్యలు టీఆర్ఎస్ లో కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై కేసీఆర్ నిఘా వర్గాల సమాచారాన్ని కోరినట్లు తెలుస్తోంది.
కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారం ఆషామాషీగా ఏమీ కనిపించడం లేదు. టీఆర్ఎస్ లో సెగ తీవ్రంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఉద్యమ నేపథ్యాన్ని అసంతృప్త నేతలు అస్త్రంగా ప్రయోగిస్తున్నట్లు కనిపిస్తోంది.
ఈటల రాజేందర్ కు రసమయి బాలకిషన్ తన వ్యాఖ్యల ద్వారా మద్దతు పలికిన వ్యవహారం ఎటు దారి తీస్తుందోననే ఉత్కంఠ నెలకొంది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రసమయి బాలకిషన్ మాట్లాడారు ఆయన నవ్వుతూనే వ్యాఖ్యలు చేసినప్పటికీ అది టీఆర్ఎస్ లోని అంతర్గత వ్యవహారాన్ని తెలియజేస్తున్నాయి.
పొట్టలో ఉన్నది దాచుకోకుండా మాట్లాడే అలవాటు తనకు ఉందని అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. సిద్ధిపేట జిల్లా ఇంద్రగూడెం పాఠశాలలో తాను 19 ఏళ్ల కిందట ఉపాధ్యాయుడిగా పనిచేశానని, ఆ పాఠశాలలో అప్పటికీ ఇప్పటికీ ఏ విధమైన మార్పు లేదని, పాఠశాల బోర్డుపై మాత్రం ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా మారిందని, కేవలం ఆ మార్పు మాత్రమే వచ్చిందని ఆయన అన్నారు.
రసమయి వ్యాఖ్యలు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టినట్లుగా భావిస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత మార్పేమీ రాలేదని రసమయి చెప్పకనే చెప్పారని అంటున్నారు. పాఠశాలలో కనీస సదుపాయాలు కూడా కల్పించలేదని ఆయన అన్నారు.
రాజేందరన్న తాను ఉద్యమాల నుంచి వచ్చినవాళ్లమని, వాస్తవాల మీద ఉద్యమాలను నడిపినవాళ్లమని, తెలంగాణ ఎలా ఉండాలో కలలు కన్నవాళ్లమని, వాస్తవంగా చూస్తే ఒక్కోసారి బాధనిపిస్తుందని రసమయి అన్నారు.
అదే సమయంలో ఈటల రాజేందర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్ కు, డాక్టర్ కు, ఇంజనీరుకు మెరిట్ ఉంటుందని, కానీ మెరిట్ లేకుండా ఉన్నవాళ్లు కొద్ది మంది రాజకీయ నాయకులని, మెరిట్ ఉండాల్సింది రాజకీయ నాయకులకేనని ఆయన అన్నారు.
హుజూరాబాద్ లో ఈటల చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మర్నాడే హైదరాబాద్ వెళ్లి ఈటలను కలిశారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఇద్దరు కూడా వేదికను పంచుకుని తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నిఘా వర్గాలు ఆ వ్యవహారంపై ఆరా తీస్తున్నాయి.
సంబంధిత వార్తలు
హుజూరాబాద్‌లో ఏం జరుగుతోంది?: ఈటల లేకుండానే గ్రామ సభ
ఈటలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి ఆసక్తికర వ్యాఖ్యలు
పావులు కదుపుతున్నారు: హరీష్ పై విజయశాంతి సంచలన ప్రకటన
కేసీఆర్ కేబినెట్: కేటీఆర్, హరీష్‌లలో ఎవరికి చోటు?
దసరా తర్వాత కేసీఆర్ కేబినెట్ విస్తరణ: హరీష్‌కు చోటు, కారణమదేనా
ఎమ్మెల్సీగా సుఖేందర్ రెడ్డి ఏకగ్రీవం: మంత్రి పదవికి దక్కేనా?
ఈటల రాజేందర్ పై కేసీఆర్ వెనక్కి: మంత్రివర్గ విస్తరణపై సందేహాలు
ఈటల వ్యాఖ్యల్లో తప్పులేదు: ఎంపీ లక్ష్మీకాంతరావు బాసట
మంత్రి ఈటల రాజేందర్ సేఫ్: వెనక్కి తగ్గిన కేసీఆర్
ఈటలకు మంత్రి ఎర్రబెల్లి కౌంటర్: గులాబీ జెండా బాస్ కేసీఆర్
ఈటల రాజేందర్ ధిక్కార స్వరం: వేచి చూసే ధోరణిలో కేసీఆర్
టీఆర్ఎస్ లో ఓనర్ల చిచ్చు, ఈటలా! దమ్ముంటే బయటకు రా!!: బండి సంజయ్ సవాల్
ఇప్పటికైతే మౌనంగానే ఉంటా, కేసీఆర్ ను కలవను: ఈటల రాజేందర్
జూ.ఎన్టీఆర్ పార్ట్ టైమ్, హరీష్ ఫుల్ టైమ్: కేసీఆర్ కు అల్లుడి పోటు
కేటీఆర్ ఫోన్‌తో ఈటల తుస్సుమన్నారు: రేవంత్ రెడ్డి సెటైర్లు
తాజా ట్విస్ట్: ఈటల రాజేందర్ తో బీసీ సంఘాల భేటీ
భూమి కోసం వెళ్లా.. పార్టీ మారడానికి కాదు: వైఎస్‌తో భేటీపై ఈటల వివరణ
వ్యాఖ్యలపై కలకలం: ఈటెల రాజేందర్ యూటర్న్
కేసీఆర్‌కు షాక్: ఈటల సంచలన కామెంట్స్
ఈటల సంచలన వ్యాఖ్యలు: టీఆర్ఎస్‌లో ముసలం, కేటీఆర్‌కు ఎదురుతిరుగుతుందా..?