తాజా ట్విస్ట్: ఈటల రాజేందర్ తో బీసీ సంఘాల భేటీ
తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో శుక్రవారం నాడు పలువురు బీసీ సంఘాల నేతలు భేటీ అయ్యారు. ఈ పరిణామం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో శుక్రవారం నాడు పలువురు బీసీ సంఘాల నేతలు భేటీ అయ్యారు. ఈ పరిణామం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.
కొంత కాలంగా మంత్రివర్గం నుండి ఈటల రాజేందర్ ను తప్పిస్తారనే ప్రచారం సాగుతోంది. కొత్త రెవిన్యూ చట్టం గురించిన సమాచారాన్ని రెవిన్యూ అసోసియేషన్ ప్రతినిధులకు లీక్ చేశారని ఈటల రాజేందర్ పై ప్రచారం సాగుతోంది.
ఈ పరిణామంతో ఈటలను మంత్రివర్గం నుండి తప్పిస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారం నేపథ్యంలోనే గురువారం నాడు హూజూరాబాద్ లో జరిగిన కార్యకర్తల సమావేశంలో మంత్రి ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు.
మంత్రి పదవి తనకు ఎవరి బిక్ష కాదన్నారు.గులాబీ పార్టీకి ఓనర్లమని కూడ తేల్చి చెప్పారు. చాలా ఆవేశంతో ఈటల రాజేందర్ ఆ సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో ఈటల రాజేందర్ ప్రసంగంలోని మాటలను పరిశీలిస్తే ఆయన మనసులోని భావాలను వ్యక్తం చేసినట్టుగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఈ సమావేశం గురించి మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దీంతో టీఆర్ఎస్ నాయకులు కొందరు ఈటల రాజేందర్ తో చర్చించారు. దీంతో ఈటల రాజేందర్ మరో ప్రకటనను మీడియాకు విడుదల చేశారు.మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ ఎక్కువ స్థానాలు కైవసం చేసుకొంటుందన్నారు. కేసీఆర్ యే తమ నాయకుడు అంటూ ఆయన స్పష్టం చేశారు.సోషల్ మీడియా సంయమనంతో ఉండాలని కూడ ఆయన కోరారు.
ఈటల రాజేందర్ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్‌లో ప్రకంపనలకు కారణమైంది. ఈ వ్యాఖ్యలపై చర్చ సాగుతోంది. శుక్రవారం నాడు షామీర్‌పేటలోని తన నివాసంలో ఈటల రాజేందర్ ను పలువురు బీసీ సంఘాల నేతలు, పార్టీలోని ఆయన సన్నిహితులు సమావేశమయ్యారు.
ఏ పరిస్థితుల్లో ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది.... ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక చోటు చేసుకొన్న పరిణామాలపై కూడ ఆయన తన సన్నిహితులతో చర్చించినట్టుగా సమాచారం. తాము అండగా ఉన్నామని పలువురు బీసీ సంఘాల నేతలు ఈటల రాజేందర్ కు అండగా నిలిచినట్టుగా తెలుస్తోంది.
సంబంధిత వార్తలు
భూమి కోసం వెళ్లా.. పార్టీ మారడానికి కాదు: వైఎస్‌తో భేటీపై ఈటల వివరణ
వ్యాఖ్యలపై కలకలం: ఈటెల రాజేందర్ యూటర్న్
కేసీఆర్‌కు షాక్: ఈటల సంచలన కామెంట్స్
ఈటల సంచలన వ్యాఖ్యలు: టీఆర్ఎస్‌లో ముసలం, కేటీఆర్‌కు ఎదురుతిరుగుతుందా..?