కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కు ఆ పార్టీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు మద్దతుగా నిలిచారు. ఈటల రాజేందర్  వ్యాఖ్యలను ఆయన సమర్ధించారు.

ఆదివారం నాడు ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు స్పందించారు. ఈటల రాజేందర్ వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదన్నారు. తెలంగాణ ఉద్యమం నుండి వచ్చిన నేత ఈటల రాజేందర్ అని ఆయన గుర్తు చేశారు.ఈటల రాజేందర్ వ్యాఖ్యల్లో తప్పులు వెతకడం సరైంది కాదన్నారు.

ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు సీఎం కేసీఆర్ అత్యంత సన్నిహితుడు. కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఈటల రాజేందర్ కు మద్దతుగా నిలవడం ప్రాధాన్యత సంతరించుకొంది.గత నెల 29వ తేదీన ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  మంత్రి పదవి తనకు బిక్ష కాదన్నారు.బీసీ కులాన్ని అడ్డుపెట్టుకొని ఏనాడూ కూడ మంత్రి పదవిని అడగలేదన్నారు.

తాను ఇల్లు కట్టుకొంటే ఎందుకు కక్ష కట్టారని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించేందుకు డబ్బులు పంచారని కూడ ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. గులాబీ జెండాకు తామే ఓనర్లమని ఆయన తేల్చి చెప్పారు.
 

సంబంధిత వార్తలు

మంత్రి ఈటల రాజేందర్ సేఫ్: వెనక్కి తగ్గిన కేసీఆర్

ఈటలకు మంత్రి ఎర్రబెల్లి కౌంటర్: గులాబీ జెండా బాస్ కేసీఆర్

ఈటల రాజేందర్ ధిక్కార స్వరం: వేచి చూసే ధోరణిలో కేసీఆర్

టీఆర్ఎస్ లో ఓనర్ల చిచ్చు, ఈటలా! దమ్ముంటే బయటకు రా!!: బండి సంజయ్ సవాల్

ఇప్పటికైతే మౌనంగానే ఉంటా, కేసీఆర్ ను కలవను: ఈటల రాజేందర్

జూ.ఎన్టీఆర్ పార్ట్ టైమ్, హరీష్ ఫుల్ టైమ్: కేసీఆర్ కు అల్లుడి పోటు

కేటీఆర్ ఫోన్‌తో ఈటల తుస్సుమన్నారు: రేవంత్ రెడ్డి సెటైర్లు

తాజా ట్విస్ట్: ఈటల రాజేందర్ తో బీసీ సంఘాల భేటీ

భూమి కోసం వెళ్లా.. పార్టీ మారడానికి కాదు: వైఎస్‌తో భేటీపై ఈటల వివరణ

వ్యాఖ్యలపై కలకలం: ఈటెల రాజేందర్ యూటర్న్

కేసీఆర్‌కు షాక్: ఈటల సంచలన కామెంట్స్

ఈటల సంచలన వ్యాఖ్యలు: టీఆర్ఎస్‌లో ముసలం, కేటీఆర్‌కు ఎదురుతిరుగుతుందా..?