కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసేందుకు టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నాడని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈటలను మంత్రివర్గం నుండి తప్పిస్తారనే ప్రచారంపై కూడ సర్వత్రా చర్చ సాగుతోంది.

ఈ వ్యాఖ్యలపై ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. భవిష్యత్తు కార్యాచరణలో భాగంగానే ఈటలను తప్పిస్తారనే ప్రచారం సాగుతోందా అనే అనుమానాలను ఈటల వర్గీయులు వ్యక్తం చేస్తున్నారు.

రెండో దఫా కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 65 రోజుల తర్వాత మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ మంత్రివర్గంలో గత టర్మ్‌లో కీలకంగా వ్యవహరించిన వారిలో ఒకరిద్దరిని మినహా అందరూ కొత్తవారికే ఈ దఫా ప్రాతినిథ్యం దక్కింది.

కొందరు సీనియర్లు ఓటమి పాలు కావడంతో పాటు మరికొందరిని కేబినెట్ లోకి కేసీఆర్ తీసుకోలేదు.భవిష్యత్తులో కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసినా కూడ ఇబ్బందులు రాకుండా ఉండేలా కేసీఆర్ వ్యూహత్మకంగా కేబినెట్ లో మంత్రులను తీసుకొన్నారనే ప్రచారం కూడ లేకపోలేదు.

హరీష్ రావును మంత్రివర్గంలోకి తీసుకోలేదు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణకు కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఈ తరుణంలో కేటీఆర్, గుత్తా సుఖేందర్ రెడ్డిలను మంత్రివర్గంలో చోటు దక్కనుంది.అయితే హరీష్ రావు విషయంలో మాత్రం ఇంకా స్పష్టత లేదని ప్రచారం సాగుతోంది.

భవిష్యత్తులో కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసినా కూడ రాజకీయంగా నష్టం వాటిల్లకుండా ఉండేందుకు వీలుగానే మంత్రివర్గ కూర్పు ఉంటుందనే అభిప్రాయాన్ని కొందరు విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

రెండో దఫా ఈటల రాజేందర్ ను మంత్రివర్గంలోకి తీసుకోవడంపై అనేక తర్జన భర్జనలు జరిగినట్టుగా అప్పట్లో ప్రచారం సాగింది. కొత్త రెవిన్యూ చట్టం వివరాలను రెవిన్యూ అసోసియేషన్ ప్రతినిధులకు చెప్పారని ఈటల రాజేందర్ పై ప్రచారం ఉంది.ఈ విషయమై సీఎం కేసీఆర్ ఈటల రాజేందర్ పై ఆగ్రహంగా ఉన్నట్టుగా ప్రచారం సాగింది.

ఈ ప్రచారంపై హుజూరాబాద్ నియోజకవర్గంలో జరిగిన ప్రచారంలో ఈటల  ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి తనకు భిక్ష కాదన్నారు. తెలంగాణ ఉద్యమంలో తాను మొదటి నుండి ఉన్నవాడినని ఆయన చెప్పారు.గులాబీ పార్టీ ఓనర్లమని ఆయన స్పష్టం చేశారు. పార్టీలో మధ్యలో వచ్చినవాడిని కానేకాదన్నారు.

తనపై తప్పుడు ప్రచారం చేసే వ్యక్తుల గురించి ఈటల పరోక్ష వ్యాఖ్యలు చేశారు.కేటీఆర్ సీఎం అయితే ఆయన మాట చెల్లుబాటు అయ్యేలా మంత్రివర్గ కూర్పు చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై టీఆర్ఎస్ వర్గాల నుండి స్పష్టత రాలేదు.

ఒకవేళ ఈటల రాజేందర్ ను తప్పిస్తే  రాజకీయంగా టీఆర్ఎస్ కు నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందా.. ఉండదా.. అనే చర్చ కూడ లేకపోలేదు. రాజకీయంగా ఈటలను దెబ్బతీసేందుకు ఈ రకమైన ప్రచారం చేస్తున్నారని ఈటల వర్గీయులు కూడ భావిస్తున్నారు. కొత్తవారికి కేబినెట్ లో ప్రాధాన్యత ఇస్తే కేటీఆర్ కు రాజకీయంగా నష్టం ఉండదనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

కేసీఆర్‌కు షాక్: ఈటల సంచలన కామెంట్స్

మంత్రి పదవి ఎవరి బిక్ష కాదు: ఈటల సంచలనం

కేసీఆర్ ఆగ్రహం: ఈటెల రాజేందర్ మంత్రి పదవికి గండం?

కేసీఆర్ కేబినెట్: కేటీఆర్, హరీష్‌లలో ఎవరికి చోటు?