హైదరాబాద్:  ప్రస్తుతానికి తాను మౌనంగానే ఉంటానని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. మంత్రి పదవి  ఎవరి బిక్ష కాదని గురువారం నాడు  మంత్రి ఈటల సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

శుక్రవారం నాడు పలు బీసీ సంఘాల నేతలు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఈటల రాజేందర్   పలు విషయాలను వారితో పంచుకొన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించేందుకు కొందరు డబ్బులు పంచారని ఆయన ఆరోపించారు. తనను  ఓడించాల్సిన అవసరం ఎవరికి ఉందో బయటకు రావాల్సిన అవసరం ఉందన్నారు.  ఈ విషయాలను  అవసరమైన సమయంలో  బయటపెడతానని ఈటల రాజేందర్  నిన్నటి సమావేశంలోనే ప్రకటించారు.

సీఎంను కలవాలనుకోలేదని ఆయన బీసీ సంఘాల నేతలకు స్పష్టం చేశారు. ప్రస్తుతానికి తాను మౌనంగానే ఉంటానని ఆయన  తేల్చి చెప్పారు. గురువారం నాడు హుజూరాబాద్ సభలో  ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ లో కలకలం రేపాయి.

కరీంనగర్ జిల్లాతో పాటు ఈటల రాజేందర్ కు సన్నిహితులు, బీసీ సంఘాల నేతలు ఆయనను కలుసుకొన్నారు. ఈటలకు బీసీ సంఘాల నేతలు మద్దతుగా నిలిచారు.
 

సంబంధిత వార్తలు

జూ.ఎన్టీఆర్ పార్ట్ టైమ్, హరీష్ ఫుల్ టైమ్: కేసీఆర్ కు అల్లుడి పోటు

కేటీఆర్ ఫోన్‌తో ఈటల తుస్సుమన్నారు: రేవంత్ రెడ్డి సెటైర్లు

తాజా ట్విస్ట్: ఈటల రాజేందర్ తో బీసీ సంఘాల భేటీ

భూమి కోసం వెళ్లా.. పార్టీ మారడానికి కాదు: వైఎస్‌తో భేటీపై ఈటల వివరణ

వ్యాఖ్యలపై కలకలం: ఈటెల రాజేందర్ యూటర్న్

కేసీఆర్‌కు షాక్: ఈటల సంచలన కామెంట్స్

ఈటల సంచలన వ్యాఖ్యలు: టీఆర్ఎస్‌లో ముసలం, కేటీఆర్‌కు ఎదురుతిరుగుతుందా..?