Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్‌కు షాక్: ఈటల సంచలన కామెంట్స్

తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవిపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కొంత కాలంగా ఆయనను మంత్రివర్గం నుండి తప్పిస్తారని ప్రచారం సాగుతున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

minister etala rajendar sensational comments on minister post
Author
Karimnagar, First Published Aug 29, 2019, 6:38 PM IST | Last Updated Aug 30, 2019, 11:45 AM IST

కరీంనగర్: తనకు దక్కిన మంత్రి పదవి ఎవరి బిక్ష కాదని తెలంగాణ రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

గురువారం నాడు ఆయన కరీంనగర్ జిల్లాలోని హూజూరాబాద్‌లోని సాయిరూపా గార్డెన్స్ లో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.బీసీ కోటాలో మంత్రి పదవి కావాలని తాను ఏనాడూ అడగలేదన్నారు.ధర్మాన్ని, న్యాయాన్ని ఎప్పుడుమోసం చేయలేదన్నారు.

తాను ఎవరి వద్దనైనా ఒక్క రూపాయి తీసుకొన్నట్టుగా రుజువు చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. తాను ఇల్లు కట్టుకొంటే ఎందుకు కక్ష కట్టారని ఆయన ప్రశ్నించారు.ప్రజలే చరిత్ర నిర్మాతలు...ఎవరు హీరో... ఎవరు జీరోలో త్వరలోనే తేలుతుందని  ఆయన ప్రకటించారు.

తాను గులాజీ పార్టీ ఓనర్లమన్నారు. చిల్లర ప్రచారంపై సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదన్నారు. న్యాయం నుండి ఎవరూ తప్పించుకోలేరని ఈటల అభిప్రాయపడ్డారు. ప్రజా క్షేత్రంలో శిక్ష తప్పదన్నారు.

ప్రజలే చరిత్ర నిర్మాతలు..... వ్యక్తులు చరిత్ర నిర్మాతలు కాదని ఆయన తేల్చిచెప్పారు.తాను ఎల్లప్పుడు వెలిగే దీపాన్ని అని ఆయన చెప్పుకొన్నారు. తాను పార్టీలో మధ్యలో వచ్చిన వ్యక్తి కాదన్నారు. గులాబీ పార్టీకి ఓనర్లమన్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో తనను చంపుతామని రెక్కీ నిర్వహించినా కూడ బెదిరిపోలేదన్నారు. రాజశేఖర్ రెడ్డి బతికున్న  సమయంలో గులాబీ జెండాను పట్టుకొనే ఉన్నానని ఆయన గుర్తు చేసుకొన్నారు. 

కొత్త రెవినూ చట్టానికి సంబంధించి కలెక్టర్ల సమావేశంలో జరిగిన వివరాలను చట్టంలో  పొందుపర్చనున్న అంశాలను రెవిన్యూ అసోసియేషన్ ప ్రతినిధులకు మంత్రి ఈటల చెప్పారనే ప్రచారం సాగుతోంది.

ఈ విషయమై కేసీఆర్ మంత్రి ఈటలపై ఆగ్రహంగా ఉన్నారని ప్రచారంలో ఉంది. ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుండి తప్పిస్తారనే ప్రచారం సాగుతున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకొన్నాయి.

 

"

 

 

సంబంధిత వార్తలు

మంత్రి పదవి ఎవరి బిక్ష కాదు: ఈటల సంచలనం

కేసీఆర్ ఆగ్రహం: ఈటెల రాజేందర్ మంత్రి పదవికి గండం?

కేసీఆర్ కేబినెట్: కేటీఆర్, హరీష్‌లలో ఎవరికి చోటు?

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios