సిరిసిల్ల: మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు. కేటీఆర్‌ ఫోన్‌తో ఈటల తుస్సుమన్నారని ఆయన సెటైర్లు వేశారు. అధికార పార్టీపై ఈటల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

శుక్రవారం నాడు సిరిసిల్ల జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈటల రాజేందర్ మాటలతో భూకంపం వస్తుందని భావించినట్టుగా ఆయన చప్పారు. కానీ, కేటీఆర్ ఫోన్ తో ఈటల తుస్సుమన్నారని ఆయన అభిప్రాయపడ్డారు.ఈటల వ్యాఖ్యలను చూసి ఏదో జరుగుతోందని అనుకొన్నామన్నారు.

ఇదేనా కరీంనగర్ పౌరుషం అంటూ ఆయన ఈటల రాజేందర్ ను ప్రశ్నించారు. కేసీఆర్ తీరుతో తెలంగాణలో ఎవరూ సంతోషంగా లేరని ఆయన చెప్పారుద. కేసీఆర్ తెలంగాణ ద్రోహి అంటూ ఆయన విమర్శలు చేశారు.మిడ్ మానేరు బాధితులకు తాను అండగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

తాజా ట్విస్ట్: ఈటల రాజేందర్ తో బీసీ సంఘాల భేటీ

భూమి కోసం వెళ్లా.. పార్టీ మారడానికి కాదు: వైఎస్‌తో భేటీపై ఈటల వివరణ

వ్యాఖ్యలపై కలకలం: ఈటెల రాజేందర్ యూటర్న్

కేసీఆర్‌కు షాక్: ఈటల సంచలన కామెంట్స్

ఈటల సంచలన వ్యాఖ్యలు: టీఆర్ఎస్‌లో ముసలం, కేటీఆర్‌కు ఎదురుతిరుగుతుందా..?