మంత్రి ఈటల రాజేందర్ సేఫ్: వెనక్కి తగ్గిన కేసీఆర్
పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించిన కేసీఆర్ ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి తప్పించాలనే ఆలోోచనను కేసీఆర్ విరమించుకున్నట్లు తెలుస్తోంది. కొంత మంది మంత్రులు, టీఆర్ఎస్ నేతల అభిప్రాయాలను తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్: మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ ను తప్పించాలనే ఆలోచన నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. కలెక్టర్లతో ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని వెల్లడించారనే ఆరోపణపై ఈటలను మంత్రి వర్గం నుంచి తప్పించాలని కేసీఆర్ భావించినట్లు ప్రచారం సాగింది.
ఆ నేపథ్యంలో ఈటల రాజేందర్ హుజూరాబాద్ లో జరిగిన సభలో తీవ్రంగా ప్రతిస్పందించారు. మంత్రి పదవి తనకు భిక్ష కాదని, తామే గులాబీ బాస్ లమని అన్నారు. దాంతో టీఆర్ఎస్ లో తీవ్ర కలకలం చెలరేగింది. ఈటల రాజేందర్ వ్యవహారం ముగిసిన కథ అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈటల మంత్రివర్గంలో కొనసాగుతారని కూడా చెప్పారు.
తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతో భేటీ తర్వాత ఎర్రబెల్లి దయాకర్ రావు ఆ విషయం చెప్పారు. దీంతో ఆయన మాటలకు విశ్వసనీయత చేకూరుతోంది.
కేసీఆర్ సూచనల మేరకు కేటీఆర్ ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై కొంత మంది మంత్రుల అభిప్రాయాలను, సీనియర్ పార్టీ నేతల అభిప్రాయాలను తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిణామాన్ని కాంగ్రెసు, బిజెపి అవకాశంగా తీసుకుంటున్నాయని వారు చెప్పినట్లు సమాచారం.
ఈటల రాజేందర్ విషయంలో తీవ్రమైన నిర్ణయం తీసుకుంటే వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెసు పార్టీలు దాన్ని అవకాశంగా తీసుకుంటాయని చెప్పినట్లు తెలుస్తోంది. తమ అభిప్రాయాలను కేసీఆర్ కు తెలియజేసి ఈటల విషయంలో తగిన నిర్ణయం తీసుకునేలా చూడాలని వారు కోరినట్లు సమాచారం.
మీడియా వార్తాకథనాలతో ఈటల రాజేందర్ నిస్పృహకు గురయ్యారని, దానివల్లనే తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని, ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి తొలగించే ఉద్దేశమేదీ లేదని కేటీఆర్ చెప్పారు. దీంతో ప్రస్తుతానికి వివాదం సద్దుమణిగినట్లు భావిస్తున్నారు.
సంబంధిత వార్తలు
ఈటలకు మంత్రి ఎర్రబెల్లి కౌంటర్: గులాబీ జెండా బాస్ కేసీఆర్
ఈటల రాజేందర్ ధిక్కార స్వరం: వేచి చూసే ధోరణిలో కేసీఆర్
టీఆర్ఎస్ లో ఓనర్ల చిచ్చు, ఈటలా! దమ్ముంటే బయటకు రా!!: బండి సంజయ్ సవాల్
ఇప్పటికైతే మౌనంగానే ఉంటా, కేసీఆర్ ను కలవను: ఈటల రాజేందర్
జూ.ఎన్టీఆర్ పార్ట్ టైమ్, హరీష్ ఫుల్ టైమ్: కేసీఆర్ కు అల్లుడి పోటు
కేటీఆర్ ఫోన్‌తో ఈటల తుస్సుమన్నారు: రేవంత్ రెడ్డి సెటైర్లు
తాజా ట్విస్ట్: ఈటల రాజేందర్ తో బీసీ సంఘాల భేటీ
భూమి కోసం వెళ్లా.. పార్టీ మారడానికి కాదు: వైఎస్‌తో భేటీపై ఈటల వివరణ
వ్యాఖ్యలపై కలకలం: ఈటెల రాజేందర్ యూటర్న్
కేసీఆర్‌కు షాక్: ఈటల సంచలన కామెంట్స్
ఈటల సంచలన వ్యాఖ్యలు: టీఆర్ఎస్‌లో ముసలం, కేటీఆర్‌కు ఎదురుతిరుగుతుందా..?