MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Technology
  • Gadgets
  • POCO: పోకో నుంచి 3 మైండ్ బ్లోయింగ్ 5G కొత్త ఫోన్లు.. భారీ డిస్కౌంట్లు, అద్భుతమైన ఫీచర్ల వివరాలు ఇవే

POCO: పోకో నుంచి 3 మైండ్ బ్లోయింగ్ 5G కొత్త ఫోన్లు.. భారీ డిస్కౌంట్లు, అద్భుతమైన ఫీచర్ల వివరాలు ఇవే

POCO: పోకో అద్భుతమైన ఫీచర్లతో కొత్త ఫోన్లను తీసుకుచ్చింది. ఈ కొత్త 5G స్మార్ట్‌ఫోన్లపై రూ.3,000 వరకు డిస్కౌంట్స్ కూడా అందిస్తోంది. భారీ బ్యాటరీలు, సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేలు, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్లతో వచ్చిన వీటిపై అదిరిపోయే ఆఫర్లు అందిస్తోంది.

4 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 13 2026, 03:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
భారీ బ్యాటరీ, సూపర్ ఫీచర్లు.. పోకో కొత్త 5G మొబైల్స్ మార్కెట్లోకి వచ్చేశాయి
Image Credit : X/IndiaPOCO

భారీ బ్యాటరీ, సూపర్ ఫీచర్లు.. పోకో కొత్త 5G మొబైల్స్ మార్కెట్లోకి వచ్చేశాయి

భారత మార్కెట్లో కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌లు సందడి చేస్తున్నాయి. పోకో బ్రాండ్ నుంచి రీసెంట్‌గా విడుదలైన మోడల్స్ ఇవాళ్టి నుంచి సేల్‌కి అందుబాటులోకి వచ్చాయి. భారీ బ్యాటరీ, సూపర్ అమోలెడ్ స్క్రీన్, పవర్ ఫుల్ ప్రాసెసర్లతో వచ్చిన ఈ ఫోన్లపై బ్యాంక్ ఆఫర్లు, ఫ్లాట్ డిస్కౌంట్లు భారీగా లభిస్తున్నాయి.

ప్రస్తుతం కొత్త 5G మొబైల్ కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి ఇవి మంచి ఛాయిస్. ముఖ్యంగా రూ.3,000 వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంది. ఈ ఫోన్ల ధరలు, స్పెసిఫికేషన్లు, డిస్కౌంట్ ఆఫర్ల పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
POCO X8 5G: రూ.3,000 తగ్గింపు, మైండ్ బ్లోయింగ్ ఫీచర్లు
Image Credit : X/mehtababd

POCO X8 5G: రూ.3,000 తగ్గింపు, మైండ్ బ్లోయింగ్ ఫీచర్లు

POCO X8 5G ఫోన్ ఇండియన్ మార్కెట్లో 3 వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. దీని బేస్ వేరియంట్ 6GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ.29,999 గా ఉంది. ఇక 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.32,999 కాగా, 8GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ.35,999 గా ఉంది.

ఈ ఫోన్‌పై కంపెనీ రూ.3,000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఇందులో రూ.2,000 ఫ్లాట్ ఆఫర్ ఉండగా, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, లేదా ఎస్బీఐ కార్డ్స్ ఉపయోగించి కొనుగోలు చేస్తే రూ.1,000 అదనపు బెనిఫిట్ లభిస్తుంది. ఆఫర్ల తర్వాత ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.26,999కే అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా బ్లాక్, ఫైరీ ఆరెంజ్, ఫ్రాస్ట్ వైట్ కలర్లలో దీన్ని సొంతం చేసుకోవచ్చు.

ఈ మొబైల్‌లో 6.83 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే ఇచ్చారు. ఇది 120Hz రీఫ్రెష్ రేట్, 3500nits పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. వెట్ టచ్ 2.0 సపోర్ట్ వల్ల తడి చేతులతో కూడా స్క్రీన్‌ను ఈజీగా వాడవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత HyperOS 3.0పై పనిచేస్తుంది. ఇందులో 4nm స్నాప్‌డ్రాగన్ 6s Gen 4 ఆక్టాకోర్ ప్రాసెసర్ వాడారు. కెమెరా విషయానికి వస్తే 50MP OIS మేన్ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. 9000mAh భారీ బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జింగ్, 22.5W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఈ ఫోన్ ప్రత్యేకత. MIL-STD-810H మిలిటరీ గ్రేడ్, IP69K రేటింగ్ కూడా ఇందులో ఉన్నాయి.

35
POCO X8 Power 5G: 10,000mAh బ్యాటరీతో పవర్ హౌస్
Image Credit : X/IndiaPOCO

POCO X8 Power 5G: 10,000mAh బ్యాటరీతో పవర్ హౌస్

మీరు రూ.35,000 లోపు అత్యంత శక్తివంతమైన ఫోన్ కోసం చూస్తుంటే POCO X8 Power 5G మంచి ఆప్షన్. ఫ్లిప్‌కార్ట్‌లో బ్యాంక్ ఆఫర్లు లేకుండానే ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.35,999గా ఉంది. 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌పై 55% వరకు, 8GB + 256GB వేరియంట్‌పై 54% వరకు డిస్కౌంట్ లభిస్తోంది.

కంపెనీ ఈ ఫోన్‌పై రూ.2,000 కూపన్ డిస్కౌంట్ అందిస్తోంది. ఇది అప్లై చేసిన తర్వాత ఫోన్ ధర రూ.32,299కి తగ్గుతుంది. పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేయడం ద్వారా రూ.34,700 వరకు ఎక్స్చేంజ్ బోనస్ పొందే అవకాశం ఉంది. నెలవారీ రూ.2,833 చొప్పున 12 నెలల నో-కాస్ట్ EMI సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. HDFC Bank, SBI, Flipkart Axis Bank కార్డ్స్ ద్వారా ఈ ఈఎమ్‌ఐ బెనిఫిట్స్ పొందవచ్చు.

ఈ ఫోన్‌లో 6.83 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లే, 120Hz రీఫ్రెష్ రేట్, 3,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ఉన్నాయి. ఇందులో 10,000mAh బిగ్ సిలికాన్-కార్బన్ బ్యాటరీ ఇచ్చారు. దీనికి 100W హైపర్‌ఛార్జ్ ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, 27W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 4nm ప్రాసెసింగ్‌తో కూడిన స్నాప్‌డ్రాగన్ 6 Gen 5 చిప్‌సెట్, LPDDR5X RAM, UFS 4.1 స్టోరేజ్ ఉన్నాయి. కెమెరా విభాగంలో 50MP OIS ప్రైమరీ కెమెరా, 8MP ఆల్ట్రా వైడ్ లెన్స్, 32MP సెల్ఫీ కెమెరా అందించారు. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత షావోమీ హైపర్ ఓఎస్ 3పై నడుస్తుంది. దీనికి 4 ప్రధాన అప్‌డేట్లు ఇవ్వనున్నారు.

45
POCO M8x 5G: బడ్జెట్ ధరలో సూపర్ ప్రాసెసర్
Image Credit : X/IndiaPOCO

POCO M8x 5G: బడ్జెట్ ధరలో సూపర్ ప్రాసెసర్

తక్కువ బడ్జెట్‌లో మంచి 5G ఫోన్ కావాలనుకునే వారి కోసం POCO M8x 5G వచ్చింది. 6GB RAM, భారీ బ్యాటరీ ఉన్న ఈ ఫోన్ ధర రూ.22,999గా నిర్ణయించారు. అయితే రూ.2,000 డిస్కౌంట్ ఆఫర్ తర్వాత దీని ధర రూ.21,000కు చేరుతుంది. బాక్స్‌లోనే ఛార్జర్, బ్యాక్ కవర్ కూడా వస్తాయి.

ఈ ఫోన్‌లో 6.9 అంగుళాల పెద్ద HD+ ఐపీఎస్ డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రీఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. స్క్రీన్‌కు గొరిల్లా గ్లాస్ 7i రక్షణ లభిస్తుంది. దీని లేదర్ గ్రీన్ బ్యాక్ ప్యానెల్ డిజైన్ లగ్జరీ లుక్‌ను ఇస్తుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 5 చిప్‌సెట్‌తో భారత్‌లో విడుదలైన తొలి డివైజ్ ఇది.

ఫోన్‌లో 7900mAh శక్తివంతమైన బ్యాటరీ ఉంది. సాధారణ వినియోగంలో ఇది హ్యాపీగా రెండు రోజుల పాటు వస్తుంది. దీనికి 45W ఛార్జర్ ఇస్తున్నారు. 22.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల అత్యవసర సమయాల్లో ఈ ఫోన్ పవర్ బ్యాంక్‌లా కూడా ఉపయోగపడుతుంది. ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. కెమెరా పరంగా ఇది వేగంగా ఫోటోలు తీస్తుంది. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత షావోమీ హైపర్ ఓఎస్ పై పనిచేస్తుంది. కంపెనీ దీనికి 4 ఏళ్ల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లను ఆఫర్ చేస్తోంది.

55
ఏ ఫోన్ ఎవరికి బెస్ట్ ఆప్షన్?
Image Credit : X/mehtababd

ఏ ఫోన్ ఎవరికి బెస్ట్ ఆప్షన్?

ఈ మూడు కొత్త 5G స్మార్ట్‌ఫోన్లు వేర్వేరు బడ్జెట్, అవసరాలకు తగ్గట్టుగా మార్కెట్లోకి వచ్చాయి. మీ బడ్జెట్ రూ.20,000 ప్రాంతంలో ఉండి, పెద్ద స్క్రీన్, రెండు రోజులు వచ్చే బ్యాటరీ కావాలంటే POCO M8x 5G సరైన ఎంపిక.

ఒకవేళ మీ బడ్జెట్ రూ.30,000 దాకా ఉండి, అమోలెడ్ స్క్రీన్, మంచి కెమెరా, పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్ కావాలంటే POCO X8 5G వైపు వెళ్లవచ్చు. ఇక అసలు బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతుందనే భయం లేకూడదు, 100W ఫాస్ట్ ఛార్జింగ్, భారీ 10,000mAh బ్యాటరీ కావాలనుకునే గేమింగ్, మల్టీమీడియా లవర్స్ కోసం POCO X8 Power 5G బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
గాడ్జెట్‌లు
సాంకేతిక వార్తలు చిట్కాలు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
ఇ-కామర్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
iPhone Duo: శాంసంగ్‌కు గట్టి పోటీ.. ఆపిల్ ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ ఐఫోన్ డ్యూయో వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే షాకే
Recommended image2
iPhone 18 Pro Max: 45 గంటల బ్యాటరీ లైఫ్‌తో మైండ్ బ్లాకింగ్ ఫీచర్లు.. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ధరెంతో తెలుసా?
Recommended image3
iPhone 18 Pro: ల్యాప్‌టాప్‌ల కంటే స్పీడ్.. 2nm A20 ప్రో చిప్‌తో ఆపిల్ ఐఫోన్ 18 ప్రో వచ్చేసింది భయ్యా.. ధర, ఫీచర్లు ఇవే
Related Stories
Recommended image1
Train Lower Berth: రైలు ప్రయాణంలో లోయర్ బెర్త్ కన్ఫర్మ్ కావాలా? ఈ ఐదు సీక్రెట్ ట్రిక్స్ మీకోసం
Recommended image2
Seed Ganesha Idols: చిరంజీవి మెచ్చిన సీడ్ గణేష.. సీడ్ వినాయకుడితో మనకు వచ్చే 5 మైండ్ బ్లాకింగ్ బెనిఫిట్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved