MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • National
  • ప్ర‌కృతి క‌న్నెర్ర చేస్తే ఇంత భ‌యంక‌రంగా ఉంటుందా.? ఈ వీడియోలు చూస్తే వ‌ణుకు పుట్టాల్సిందే

ప్ర‌కృతి క‌న్నెర్ర చేస్తే ఇంత భ‌యంక‌రంగా ఉంటుందా.? ఈ వీడియోలు చూస్తే వ‌ణుకు పుట్టాల్సిందే

Wayanad: కేరళలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు మరోసారి తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. వయనాడ్ జిల్లాలో జరుగుతున్న సొరంగం నిర్మాణ పనుల వద్ద భారీ కొండచరియలు విరిగిపడటంతో పలువురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. 

2 Min read
Author : Narender Vaitla
Published : Jul 07 2026, 05:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సొరంగం నిర్మాణ ప్రాంతంలో ఒక్కసారిగా విరిగిపడ్డ కొండచరియ
Image Credit : Gummalla Lakshmana/X

సొరంగం నిర్మాణ ప్రాంతంలో ఒక్కసారిగా విరిగిపడ్డ కొండచరియ

వయనాడ్‌లోని అనక్కంపొయిల్–కల్లాడి సొరంగం నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. మీనాక్షి వంతెన సమీపంలోని కొండ భారీగా కూలిపోవడంతో నిర్మాణ ప్రాంతమంతా మట్టి దిబ్బలతో నిండిపోయింది. నిర్మాణ పనుల కోసం తవ్విన ప్రాంతం కుంగిపోవడంతో అక్కడ ఉన్న కార్మికులు అప్రమత్తం అయ్యేలోపే శిథిలాల కింద చిక్కుకున్నారు. ప్రమాదంలో ఒక ఇల్లు, సమీపంలోని చర్చి తీవ్రంగా దెబ్బతినగా, బస్‌స్టాప్‌, వంతెనలో కొంత భాగం కూడా మట్టిలో కూరుకుపోయాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
శిథిలాల కింద పలువురు కార్మికులు.. సహాయక చర్యలు ముమ్మరం
Image Credit : Gummalla Lakshmana/X

శిథిలాల కింద పలువురు కార్మికులు.. సహాయక చర్యలు ముమ్మరం

ఈ ఘటనలో 30 నుంచి 50 మంది వరకు కార్మికులు చిక్కుకుని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే కొంతమందిని స్థానికులు, సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీసి సమీప ఆసుపత్రులకు తరలించాయి. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నిర్మాణ సంస్థకు చెందిన తాత్కాలిక కార్యాలయ కంటైనర్లు, కార్మికులను తీసుకువెళ్తున్న బస్సులు, కార్లు, జేసీబీ యంత్రాలు కూడా మట్టి కింద పూడుకుపోయాయి. సమీపంలో ఉన్న ఓ కుటుంబం కూడా శిథిలాల కింద చిక్కుకుని ఉండొచ్చన్న అనుమానంతో గాలింపు కొనసాగుతోంది.

Related Articles

Related image1
PM Modi: మోదీ ఇండోనేసియా టూర్‌లో కీల‌క ఒప్పందం.. ఇది భార‌త్ స‌త్తా
Related image2
Facts: ట్ర‌క్కుల వెనుక 'Use Dipper At Night' అని ఎందుకు రాస్తారు? దీనికి కండోమ్‌కి సంబంధం ఏంటి.?
35
భారీ వర్షాలతో రెస్క్యూకు ఆటంకం.. అప్రమత్తమైన అధికారులు
Image Credit : Gummalla Lakshmana/X

భారీ వర్షాలతో రెస్క్యూకు ఆటంకం.. అప్రమత్తమైన అధికారులు

ఘటన జరిగిన వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్‌, ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్‌, రాపిడ్ రెస్పాన్స్ బృందాలు రంగంలోకి దిగాయి. అయితే నిరంతర వర్షం, కూలిపోయిన భారీ వృక్షాలు, ఉప్పొంగుతున్న చిన్న నది కారణంగా సహాయక చర్యలు నెమ్మదిగా సాగుతున్నాయి. ప్రమాదం మరింత పెరగకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వయనాడ్, కోజికోడ్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేయగా, మరికొన్ని జిల్లాల్లో ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు అమల్లో ఉన్నాయి. కల్లాడి ప్రాంతంలో గత 24 గంటల్లో 265 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది.

#KERALA#Wayanad Landslide: Mudslide at the Kalladi tunnel work site blocks the road, injuring 5 workers. Victims are hospitalized; no fatalities reported. Operations were halted earlier due to heavy rains, with KSDMA recording 265mm of rainfall in 24 hours. 🌧️⚠️ #KeralaRainspic.twitter.com/Uv2X0jDKpV

— Gummalla Lakshmana (@GUMMALLALAKSHM3) July 7, 2026

45
అత్యవసర సమావేశం.. ఘటనాస్థలానికి మంత్రులు
Image Credit : Gummalla Lakshmana/X

అత్యవసర సమావేశం.. ఘటనాస్థలానికి మంత్రులు

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అత్యవసరంగా స్పందించింది. ముఖ్యమంత్రి వీడీ సతీశన్ పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వీలైనంత త్వరగా రక్షించాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రులు ఘటనాస్థలానికి బయలుదేరి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన అన్ని సహాయ చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగానికి ప్రభుత్వం సూచించింది.

55
2024 విషాదం మళ్లీ గుర్తు చేసిన తాజా ప్రమాదం
Image Credit : Gummalla Lakshmana/X

2024 విషాదం మళ్లీ గుర్తు చేసిన తాజా ప్రమాదం

వయనాడ్‌లో గత ఏడాది కూడా భారీ కొండచరియలు విరిగిపడి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ముండక్కై, చూర్‌మాలా ప్రాంతాల్లో సంభవించిన ఆ ప్రకృతి విపత్తులో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన నుంచి కోలుకోకముందే మరోసారి భారీ వర్షాల కారణంగా వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటం స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. ప్రస్తుతం వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
భారత దేశం
వైరల్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
నేపాల్ వరదల్లో మృత్యుంజయుడు 9రోజులతర్వాత ప్రాణాలతో బయటకు | Miracle Rescue in Nepal! 2 People
Recommended image2
Now Playing
తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ పవర్ ఫుల్ స్పీచ్ | CM Vijay Powerful Speech in Assembly
Recommended image3
Now Playing
నేపాల్ వరద విధ్వంసం తర్వాత ప్రస్తుతం ఎలా ఉందో చూడండి | Nepal Floods Massive Cleanup Underway
Related Stories
Recommended image1
PM Modi: మోదీ ఇండోనేసియా టూర్‌లో కీల‌క ఒప్పందం.. ఇది భార‌త్ స‌త్తా
Recommended image2
Facts: ట్ర‌క్కుల వెనుక 'Use Dipper At Night' అని ఎందుకు రాస్తారు? దీనికి కండోమ్‌కి సంబంధం ఏంటి.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved