MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • National
  • PM Modi: మోదీ మార్క్.. దేశ రాజ‌కీయాల్లో మ‌రో ఆస‌క్తిక‌ర ప‌రిణామం

PM Modi: మోదీ మార్క్.. దేశ రాజ‌కీయాల్లో మ‌రో ఆస‌క్తిక‌ర ప‌రిణామం

PM Modi: ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్ వెలుపల కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్న వేళ, ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) అధినేత శరద్ పవార్, ఆయన కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

1 Min read
Author : Narender Vaitla
Published : Jul 22 2026, 02:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
రైతుల సమస్యలపై ప్రధానికి వినతిపత్రం
Image Credit : PMO India/X

రైతుల సమస్యలపై ప్రధానికి వినతిపత్రం

ప్రధానమంత్రి మోదీతో జరిగిన సమావేశంలో శరద్ పవార్ దేశంలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ ఒక వినతిపత్రాన్ని అందజేశారు. సమావేశంలో ఇరువురు నేతలు ఆత్మీయంగా మాట్లాడుకున్నట్లు, కొన్ని అంశాలపై చర్చించినట్లు ఫోటోలు వెల్లడిస్తున్నాయి. ప్రధాని స్వయంగా శరద్ పవార్‌కు స్వాగతం పలకడం కూడా చర్చనీయాంశమైంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
డీలిమిటేషన్ బిల్లుపై మద్ధతు చర్చ?
Image Credit : PMO India/X

డీలిమిటేషన్ బిల్లుపై మద్ధతు చర్చ?

కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లును మళ్లీ ప్రవేశపెట్టే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఈ భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. పార్లమెంట్‌లో రెండు మూడవ వంతు మద్ధతు కూడగట్టే ప్రయత్నాల్లో భాగంగా ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం)కు చెందిన ఎనిమిది మంది ఎంపీల మద్ధతు కీలకంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, అన్ని నియోజకవర్గాల్లో 50 శాతం సీట్ల పెంపుపై ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇస్తేనే బిల్లుపై చర్చకు సిద్ధమని ఇటీవల సుప్రియా సూలే స్పష్టం చేశారు.

Rajya Sabha MP Shri @PawarSpeaks Ji and Lok Sabha MP Smt. @supriya_sule Ji called on PM @narendramodi in Parliament earlier today. pic.twitter.com/DwTspUA0th

— PMO India (@PMOIndia) July 22, 2026

Related Articles

Related image1
మీరు కూడా డీమార్ట్‌లో ఇదే త‌ప్పు చేస్తున్నారా.? ఈ చిన్న టిప్స్ పాటిస్తే సమయం, డబ్బు రెండూ ఆదా
Related image2
ఇది కదా మ‌న‌ హైదరాబాదీలకు కావాల్సింది.. ఈ ఎలక్ట్రిక్ కారు మన రోడ్లపై పరుగులు పెడితే ఉంటది
33
ఎన్‌డీఏలో చేరికపై ఊహాగానాలు
Image Credit : PMO India/X

ఎన్‌డీఏలో చేరికపై ఊహాగానాలు

శరద్ పవార్ వర్గం ఎన్‌డీఏకు సపోర్ట్ ఇచ్చే అవకాశాలపై గత కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం, శరద్ పవార్ నేతృత్వంలోని వర్గం అధికారికంగా ఎన్‌డీఏలో చేరాలంటే ముందుగా ఎన్సీపీలోని రెండు ప్రత్యర్థి వర్గాలు మళ్లీ ఒక్కటై విలీనం కావాల్సి ఉంటుందని పార్టీ అభిప్రాయపడుతోంది. అలాంటి పరిస్థితి లేకుండా వ్యక్తిగతంగా శరద్ పవార్ లేదా ఆయన అనుచరులను కూటమిలో చేర్చుకునే ఆలోచన లేదని సమాచారం. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నిరసనలు కొనసాగుతున్న రోజే ప్రధానితో శరద్ పవార్ భేటీ కావడం మహారాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా జాతీయ రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
రాజకీయాలు
నరేంద్ర మోదీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Rahul Gandhi : రాహుల్ గాంధీపై క్రిమినల్ కేసు... ఎవరు, ఎందుకు పెట్టారో తెలుసా?
Recommended image2
దేశ ప్రజలకు మోదీ మరోసారి కీలక సందేశం.. ఈ విష‌యాలు గుర్తుపెట్టుకోండి అంటూ
Recommended image3
Now Playing
Nepal Flash Floods: నేపాల్ లో విధ్వంసం సృష్టించిన వరదలు రంగంలోకి హెలికాఫ్టర్స్ | Asianet News Telugu
Related Stories
Recommended image1
మీరు కూడా డీమార్ట్‌లో ఇదే త‌ప్పు చేస్తున్నారా.? ఈ చిన్న టిప్స్ పాటిస్తే సమయం, డబ్బు రెండూ ఆదా
Recommended image2
ఇది కదా మ‌న‌ హైదరాబాదీలకు కావాల్సింది.. ఈ ఎలక్ట్రిక్ కారు మన రోడ్లపై పరుగులు పెడితే ఉంటది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved