MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Automobile
  • Cars
  • ఇది కదా మ‌న‌ హైదరాబాదీలకు కావాల్సింది.. ఈ ఎలక్ట్రిక్ కారు మన రోడ్లపై పరుగులు పెడితే ఉంటది

ఇది కదా మ‌న‌ హైదరాబాదీలకు కావాల్సింది.. ఈ ఎలక్ట్రిక్ కారు మన రోడ్లపై పరుగులు పెడితే ఉంటది

Renault Twizy: నగరాల్లో రోజురోజుకు ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న సైజులో ఉండే, పర్యావరణహిత ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోంది. అలాంటి వినూత్న వాహనాల్లో రెనాల్ట్ ట్విజీ ఒకటి.

3 Min read
Author : Narender Vaitla
Published : Jul 21 2026, 06:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అసలేంటీ కారు.?
Image Credit : greencarreports.com

అసలేంటీ కారు.?

రెనాల్ట్ ట్విజీ అనేది ఫ్రాన్స్‌కు చెందిన రెనాల్ట్ కంపెనీ రూపొందించిన రెండు సీట్ల ఎలక్ట్రిక్ మైక్రో కారు. దీనిని మొదట 2009లో జర్మనీలో జరిగిన ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోలో కాన్సెప్ట్‌గా ప్రదర్శించారు. అనంతరం 2012లో ఫ్రాన్స్‌తో పాటు పలు యూరప్ దేశాల్లో విక్రయాలు ప్రారంభమయ్యాయి. సాధారణ కార్లతో పోలిస్తే దీని పొడవు కేవలం 2.32 మీటర్లు మాత్రమే. వెడల్పు 1.19 మీటర్లు, ఎత్తు 1.46 మీటర్లు ఉండటంతో ఇరుకైన రోడ్లలో కూడా సులభంగా ప్రయాణించవచ్చు. చిన్న పార్కింగ్ స్థలం ఉన్నా సరిపోవడం దీని మరో ప్రత్యేకత.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఈ కారులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి?
Image Credit : greencarreports.com

ఈ కారులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి?

చిన్న కారు అయినప్పటికీ Renault Twizyలో అనేక ఉపయోగకరమైన ఫీచర్లు ఉన్నాయి. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్‌తో నడిచే వాహనం. ఇందులో 6.1 kWh సామర్థ్యం గల లిథియం-అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే గరిష్ఠంగా 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ తెలిపింది. అయితే సాధారణ రోడ్లపై సుమారు 80 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఇంట్లో ఉండే సాధారణ 220–240 వోల్ట్ విద్యుత్ ప్లగ్‌తోనే ఈ కారును ఛార్జ్ చేసుకోవచ్చు. పూర్తి ఛార్జ్ కావడానికి దాదాపు మూడున్నర గంటల సమయం పడుతుంది.

భద్రత విషయంలో కూడా ఈ కారులో మంచి జాగ్రత్తలు తీసుకున్నారు. డ్రైవర్‌కు ఎయిర్‌బ్యాగ్, ముందు నాలుగు పాయింట్ల సీటు బెల్ట్, వెనుక ప్రయాణికుడికి మూడు పాయింట్ల సీటు బెల్ట్ ఏర్పాటు చేశారు. బలమైన స్టీల్ ఫ్రేమ్‌తో తయారు చేయడం వల్ల ప్రమాదాల సమయంలో కొంత మెరుగైన రక్షణ లభిస్తుంది. అవసరాన్ని బట్టి డోర్లు అమర్చుకునే అవకాశం కూడా ఉంది. చలికాలంలో ఉపయోగించేందుకు ప్రత్యేక సైడ్ విండోలు, వింటర్ కిట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Related Articles

Related image1
మీరు కూడా డీమార్ట్‌లో ఇదే త‌ప్పు చేస్తున్నారా.? ఈ చిన్న టిప్స్ పాటిస్తే సమయం, డబ్బు రెండూ ఆదా
Related image2
మిడిల్ క్లాస్ వారికి కూడా లగ్జరీ ట్రావెల్ అనుభూతి.. రూ. 50 ల‌క్ష‌ల కారులో ఉండే ఫీచ‌ర్లు ఇందులో ఉన్నాయిగా
35
ఏయే మోడళ్లు వచ్చాయి? ఏ దేశాల్లో అందుబాటులో ఉంది?
Image Credit : greencarreports.com

ఏయే మోడళ్లు వచ్చాయి? ఏ దేశాల్లో అందుబాటులో ఉంది?

Renault Twizyని కంపెనీ పలు మోడళ్లలో విడుదల చేసింది. Urban 45 అనే మోడల్ గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. Urban 80 మోడల్ గంటకు 80 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. వీటితో పాటు Colour, Technic అనే ప్రత్యేక ఎడిషన్లు కూడా తీసుకొచ్చారు. సరుకుల రవాణా కోసం వెనుక సీటు స్థానంలో 180 లీటర్ల కార్గో బాక్స్ ఏర్పాటు చేసిన Twizy Cargo అనే వెర్షన్‌ను కూడా మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఈ మోడల్ చిన్న స్థాయి డెలివరీ సేవలకు బాగా ఉపయోగపడింది.

ఈ కారు ప్రధానంగా ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, జర్మనీ, బెల్జియం, నెదర్లాండ్స్, ఆస్ట్రియా, స్వీడన్, ఫిన్లాండ్, స్లోవేనియా, యునైటెడ్ కింగ్‌డమ్ వంటి యూరప్ దేశాల్లో విక్రయించారు. జపాన్‌లో ఇదే కారును Nissan New Mobility Concept పేరుతో కార్ షేరింగ్ సేవల్లో ఉపయోగించారు. దక్షిణ కొరియాలో కూడా ఈ కారు తయారీ జరిగింది. 2023లో Renault Twizy ఉత్పత్తిని నిలిపివేసి దాని స్థానంలో కొత్త Mobilize Duoను తీసుకొచ్చారు.

45
భారత్‌లో వస్తే ఎలా ఉంటుంది?
Image Credit : greencarreports.com

భారత్‌లో వస్తే ఎలా ఉంటుంది?

Renault Twizy ప్రస్తుతం భారత్‌లో అందుబాటులో లేదు. అయితే భవిష్యత్తులో ఈ తరహా మైక్రో ఎలక్ట్రిక్ కార్లు భారత మార్కెట్‌లోకి వస్తే పట్టణ రవాణాలో పెద్ద మార్పు తీసుకురాగలవని ఆటోమొబైల్ నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా రోజూ 20 నుంచి 50 కిలోమీటర్ల వరకు మాత్రమే ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులు, చిన్న వ్యాపారులకు ఇది మంచి ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉంది. పెట్రోల్, డీజిల్ ఖర్చు ఉండదు. ఇంట్లోనే సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు. నిర్వహణ ఖర్చు కూడా సాధారణ కార్లతో పోలిస్తే తక్కువగా ఉండే అవకాశం ఉంది.

హైదరాబాద్ వంటి నగరాల్లో అయితే ఈ కారు మరింత ఉపయోగకరంగా ఉండొచ్చు. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాధాపూర్, అమీర్‌పేట్, కూకట్‌పల్లి, బంజారాహిల్స్ వంటి ప్రాంతాల్లో ప్రతిరోజూ తీవ్ర ట్రాఫిక్ ఉంటుంది. అలాంటి రోడ్లలో చిన్న సైజు కారణంగా ఈ కారు సులభంగా ప్రయాణించగలదు. పార్కింగ్ సమస్య కూడా చాలా వరకు తగ్గుతుంది. చిన్న సందుల్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్లే అవకాశం ఉంటుంది. కాలుష్యాన్ని తగ్గించడంలో కూడా ఇలాంటి ఎలక్ట్రిక్ వాహనాలు కీలక పాత్ర పోషిస్తాయి.

55
Renault Twizy ప్రత్యేకత ఏంటి?
Image Credit : greencarreports.com

Renault Twizy ప్రత్యేకత ఏంటి?

Renault Twizyని సాధారణ కారుగా కాకుండా నగర ప్రయాణాల కోసం రూపొందించిన స్మార్ట్ మొబిలిటీ వాహనంగా చెప్పొచ్చు. చిన్న పరిమాణం, తక్కువ విద్యుత్ వినియోగం, సులభమైన ఛార్జింగ్, తక్కువ నిర్వహణ ఖర్చు వంటి అంశాలు దీనిని ప్రత్యేకంగా నిలబెట్టాయి. కుటుంబంతో దూర ప్రయాణాలకు ఇది సరిపోకపోయినా, రోజువారీ ఆఫీస్ ప్రయాణాలు, షాపింగ్, చిన్న దూరాల రాకపోకలు, డెలివరీ సేవలకు మాత్రం ఇది అద్భుతమైన ఎంపికగా నిలుస్తుంది. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో Renault Twizy వంటి మైక్రో ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్లోకి వస్తే నగరాల్లో ట్రాఫిక్, పార్కింగ్, ఇంధన వ్యయం వంటి అనేక సమస్యలకు కొంత మేర పరిష్కారం ల‌భించే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీ వంటి మహానగరాల్లో ఇలాంటి చిన్న ఎలక్ట్రిక్ కార్లకు మంచి ఆదరణ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్

Latest Videos
Recommended Stories
Recommended image1
Hatchback Cars Sales: రూ. 4.99 లక్షల కారు దాటికి స్విఫ్ట్, బలేనో క్లీన్ స్వీప్.. నంబర్ 1 కార్ ఇదే
Recommended image2
Mahindra Scorpio Pickup Truck: అదరగొట్టే లుక్స్, కేక అనిపించే ఫీచర్లతో మహీంద్రా స్కార్పియో లైఫ్‌స్టైలర్ పిక్అప్ గ్రాండ్ ఎంట్రీ
Recommended image3
Upcoming Cars: కార్ లవర్స్‌కి పండగే పండగ.. రోడ్డెక్కనున్న క్రేజీ కార్లు ఇవే !
Related Stories
Recommended image1
మీరు కూడా డీమార్ట్‌లో ఇదే త‌ప్పు చేస్తున్నారా.? ఈ చిన్న టిప్స్ పాటిస్తే సమయం, డబ్బు రెండూ ఆదా
Recommended image2
మిడిల్ క్లాస్ వారికి కూడా లగ్జరీ ట్రావెల్ అనుభూతి.. రూ. 50 ల‌క్ష‌ల కారులో ఉండే ఫీచ‌ర్లు ఇందులో ఉన్నాయిగా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved