MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Business
  • మీరు కూడా డీమార్ట్‌లో ఇదే త‌ప్పు చేస్తున్నారా.? ఈ చిన్న టిప్స్ పాటిస్తే సమయం, డబ్బు రెండూ ఆదా

మీరు కూడా డీమార్ట్‌లో ఇదే త‌ప్పు చేస్తున్నారా.? ఈ చిన్న టిప్స్ పాటిస్తే సమయం, డబ్బు రెండూ ఆదా

Dmart: తక్కువ ధరలకు నిత్యావసర వస్తువులన్నీ ఒకే చోట దొర‌క‌డంతో చాలా మంది డీమార్ట్‌ల‌కు అట్రాక్ట్ అవుతారు. అయితే డీమార్ట్‌లో షాపింగ్ చేసే విష‌యంలో కొన్ని టిప్స్ పాటిస్తే స‌మ‌యంతో పాటు డ‌బ్బు కూడా ఆదా చేసుకోవ‌చ్చ‌ని మీకు తెలుసా.?

2 Min read
Author : Narender Vaitla
Published : Jul 21 2026, 03:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నెలలో 10 నుంచి 25వ తేదీ మధ్య షాపింగ్ చేయాలి
Image Credit : Gemini AI

నెలలో 10 నుంచి 25వ తేదీ మధ్య షాపింగ్ చేయాలి

చాలా మంది ఉద్యోగులకు నెల ప్రారంభంలోనే జీతాలు వస్తాయి. అందుకే 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు డీమార్ట్‌లో రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమయంలో బిల్లింగ్ కౌంటర్ల వద్ద ఎక్కువసేపు వేచి ఉండాల్సి రావచ్చు. అయితే 10వ తేదీ తర్వాత పరిస్థితి కొంత మారుతుంది. రద్దీ తగ్గడంతో ప్రశాంతంగా షాపింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వినియోగదారులను ఆకర్షించేందుకు కొన్ని వస్తువులపై ప్రత్యేక ఆఫర్లు, కాంబో డీల్స్, డిస్కౌంట్లు కూడా కనిపించే అవకాశం ఉంటుంది. అందువల్ల వీలైతే ప్రతి నెల 10 నుంచి 25వ తేదీ మధ్య షాపింగ్ చేయడం మంచి ఎంపిక.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సోమవారం నుంచి గురువారం వరకు వెళ్లడం బెస్ట్
Image Credit : Asianet News

సోమవారం నుంచి గురువారం వరకు వెళ్లడం బెస్ట్

వీకెండ్ అంటే శని, ఆదివారాల్లో డీమార్ట్‌లో కాలు పెట్టడానికి కూడా స్థలం ఉండని పరిస్థితి చాలాసార్లు కనిపిస్తుంది. కుటుంబాలతో కలిసి వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో ట్రాలీలు తీసుకోవడం నుంచి బిల్లింగ్ వరకు ప్రతిచోటా రద్దీ ఉంటుంది. అందుకే వీలైతే సోమవారం నుంచి గురువారం మధ్యలో షాపింగ్‌కు వెళ్లండి. ఈ రోజుల్లో రద్దీ తక్కువగా ఉంటుంది. ప్రశాంతంగా అన్ని వస్తువులను చూసి ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. తొందరపాటు కూడా ఉండదు.

35
సాయంత్రం కాదు... ఉదయం వెళ్తేనే లాభం
Image Credit : DMart

సాయంత్రం కాదు... ఉదయం వెళ్తేనే లాభం

చాలా మంది ఉద్యోగాలు ముగిసిన తర్వాత సాయంత్రం డీమార్ట్‌కు వెళ్తుంటారు. ఇదే సమయంలో ఎక్కువ మంది రావడంతో క్యూలు పెరుగుతాయి. వీలైతే ఉదయం వేళల్లోనే షాపింగ్ చేయండి. ఆ సమయంలో స్టోర్‌లో రద్దీ తక్కువగా ఉండటంతో త్వరగా పని పూర్తవుతుంది. బిల్లింగ్ కౌంటర్ల వద్ద ఎక్కువసేపు నిలబడాల్సిన అవసరం ఉండదు. ప్రశాంతంగా షాపింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లొచ్చు.

45
షాపింగ్‌కు వెళ్లే ముందు తప్పనిసరిగా ఒక లిస్ట్ తయారు చేసుకోండి
Image Credit : X

షాపింగ్‌కు వెళ్లే ముందు తప్పనిసరిగా ఒక లిస్ట్ తయారు చేసుకోండి

డీమార్ట్‌లో చాలా మంది చేసే పెద్ద తప్పు.. అవసరమైన వస్తువులు కొనడానికి వెళ్లి, అవసరం లేని వస్తువులతోనే ట్రాలీ నింపేయడం. ఆఫర్లు కనిపిస్తే వెంటనే కొనేయాలనే ఆలోచన వస్తుంది. చివరకు బిల్లు చూసినప్పుడు ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. ఈ సమస్యకు సులభమైన పరిష్కారం ఉంది. ఇంట్లోనే ముందుగా కొనాల్సిన వస్తువుల జాబితా తయారు చేసుకోండి. షాపింగ్ చేస్తూ ఆ జాబితాలో ఉన్న వస్తువులను మాత్రమే తీసుకుంటూ టిక్ చేసుకుంటూ వెళ్లండి. లిస్ట్‌లో లేని వస్తువులను కొనకుండా ఉండేందుకు ప్రయత్నించండి. ఇలా చేస్తే అనవసర ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి.

55
చిన్న ప్లానింగ్‌తో పెద్ద మొత్తంలో ఆదా చేయొచ్చు
Image Credit : Google

చిన్న ప్లానింగ్‌తో పెద్ద మొత్తంలో ఆదా చేయొచ్చు

డీమార్ట్‌లో తక్కువ ధరలకు వస్తువులు దొరుకుతాయనే కారణంతో ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లడం కంటే, సరైన రోజు, సరైన సమయం ఎంచుకుని, ముందుగానే కొనాల్సిన వస్తువుల జాబితాతో వెళ్లడం వల్ల మరింత ప్రయోజనం పొందవచ్చు. పైన తెలిపిన ఈ చిన్న అలవాట్లు పాటిస్తే డీమార్ట్‌లో షాపింగ్ మరింత సౌకర్యంగా సాగడమే కాదు.. అనవసర ఖర్చులు తగ్గి, ప్రతి నెల కొంత డబ్బును కూడా ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Fridge: ఇంట్లోనే కాదు.. కారులోనూ వాడొచ్చు.. ఈ చిన్న ఫ్రిజ్‌లో ఎన్ని ప్రత్యేకతలో
Recommended image2
Gold Prices Fall: రెండో రోజు పసిడి ప్రియులకు భారీ ఊరట.. మళ్లీ పతనమైన బంగారం..ఎంతో తెలుసా?
Recommended image3
iPhone 17 Pro: ఐఫోన్ 17 ప్రో కొనేందుకు ఇదే మంచి సమయం.. సగం ధరకే అదిరిపోయే ఫోన్
Related Stories
Recommended image1
అహంకారం త‌ల‌కెక్కితే కాలం గుణపాఠం చెబుతుంది.. అన్నీ ఉన్న‌ప్పుడే నువ్వెంటో తెలిపే క‌థ
Recommended image2
మిడిల్ క్లాస్ వారికి కూడా లగ్జరీ ట్రావెల్ అనుభూతి.. రూ. 50 ల‌క్ష‌ల కారులో ఉండే ఫీచ‌ర్లు ఇందులో ఉన్నాయిగా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved