MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • National
  • 8th Pay Commission: 8వ పే కమిషన్ వస్తే పెన్షన్ 50 శాతం పెరగడం పక్కానా? జీతాలు డబుల్?

8th Pay Commission: 8వ పే కమిషన్ వస్తే పెన్షన్ 50 శాతం పెరగడం పక్కానా? జీతాలు డబుల్?

8th Pay Commission: 8వ వేతన సంఘం కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్నారు. జీతాలు ఎంత పెరుగుతాయి? పెన్షన్ నిజంగానే 50 శాతం పెరుగుతుందా? ఇలాంటి సందేహాలు వారిలో అధికంగానే ఉన్నాయి.

2 Min read
Author : Haritha Chappa
Published : Sep 16 2026, 11:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
8వ వేతన సంఘం ఎప్పుడు వస్తుంది?
Image Credit : Gemini AI

8వ వేతన సంఘం ఎప్పుడు వస్తుంది?

8వ వేతన సంఘం కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. వారి జీతభత్యాలు ఎంత పెరుగుతాయో తెలుసుకునేందుకు ఆసక్తిగా ఉన్నారు. 8వ వేతన సంఘం ప్రస్తుతం డేటా సేకరించే పనిలో ఉంది. కేంద్ర ప్రభుత్వం 2025 నవంబర్ 3న ఈ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని ఈ కమిషన్‌లో ప్రొఫెసర్ పులక్ ఘోష్ పార్ట్ టైమ్ మెంబర్‌గా, పంకజ్ జైన్ మెంబర్-సెక్రటరీగా ఉన్నారు. కమిషన్ ఏర్పాటైన 18 నెలల్లోపు వీళ్లు తమ రిపోర్ట్‌ను ప్రభుత్వానికి ఇవ్వాలి. ఇంకా రిపోర్టు ప్రభుత్వానికి అందలేదు. అది అందిన తరువాత కేంద్ర ప్రభుత్వం వేతన సంఘం సిఫార్సులను అమల్లోకి తెస్తుంది. వచ్చే ఏడాది పెరిగిన జీతాలు ఉద్యోగులు, పెన్షనర్లు అందుకునే అవకాశం ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
జీతం ఎంత పెరుగుతుంది?
Image Credit : Asianet News

జీతం ఎంత పెరుగుతుంది?

8వ వేతన సంఘం అమల్లోకి వచ్చాక ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ (Fitment Factor) పైనే జీతం పెరుగుదల ఆధారపడి ఉంటుంది. 7వ వేతన సంఘంలో 2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను వాడారు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ కావాలని ఉద్యోగ సంఘాలు అడుగుతున్నాయి. కొన్ని సంఘాలు 3.61, 3.83, 4.00 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. కానీ, ప్రభుత్వం లేదా 8వ వేతన సంఘం ఇంకా ఏ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను ఫైనల్ చేయలేదు.

ఉదాహరణకు, బేసిక్ పేకి 2.57 లేదా 3.83 ఫ్యాక్టర్లను అప్లై చేస్తే లెక్కలు మారుతాయి. కానీ ఇది కేవలం అంచనా మాత్రమే. ఫైనల్ రిపోర్ట్ వచ్చాకే అసలు జీతం ఎంత పెరుగుతుందో తెలుస్తుంది.

33
పెన్షన్ 50% పెరుగుతుందా?
Image Credit : Asianet News

పెన్షన్ 50% పెరుగుతుందా?

పెన్షనర్లు తమ పెన్షన్ ఎంత పెరుగుతుందో తెలుసుకునేందుకు ఆత్రుతగా ఉన్నారు. పెన్షన్ రివిజన్, ఫ్యామిలీ పెన్షన్, పాత పెన్షనర్ల భద్రత లాంటి చాలా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా 2026 జనవరి 1 కంటే ముందు రిటైర్ అయిన వాళ్లను కూడా కొత్త పెన్షన్ రివిజన్‌లో చేర్చాలని పెన్షనర్ల సంఘాలు గట్టిగా అడుగుతున్నాయి. దీనికోసం 8వ వేతన సంఘం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (Terms of Reference)లో స్పష్టమైన మార్పులు చేయాలని కోరుతున్నాయి.

అలాగే, చెన్నైలో జరిగిన మీటింగ్‌లో కనీస వేతనం, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, పెన్షన్ పెంపుపై పలు డిమాండ్లు పెట్టారు. ఒక పెన్షనర్ల సంఘం అయితే 3.83 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, ₹69,000 కనీస బేసిక్ పే ఇవ్వాలని అడిగింది. అయితే ఇవన్నీ వాళ్ల డిమాండ్లు మాత్రమే, ప్రభుత్వం ఇంకా ఏదీ ఓకే చేయలేదు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
PMAY: తెలుగు ప్ర‌జ‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం గుడ్ న్యూస్‌.. 5 ల‌క్ష‌ల ఇళ్లు కేటాయింపు
Recommended image2
BRICS 2026: గ్లోబల్ సౌత్ బిగ్ బాస్.. బ్రిక్స్ తో భారత్ సాధించిన టాప్ 5 విజయాలు ఏంటో తెలుసా?
Recommended image3
BRICS: స‌వాళ్ల‌ను క‌లిసి ఎదుర్కోవాలి.. బ్రిక్స్ స‌ద‌స్సు ముగింపు వేళ మోదీ కీల‌క ప్ర‌సంగం
Related Stories
Recommended image1
Cooking Hack: వంకాయ కూరలో రెండు స్పూన్ల పాలు వేయాలి.. ఎందుకో తెలుసా?
Recommended image2
భారతదేశం నడిబొడ్డున ఉన్న నగరం ఏదో తెలుసా? ఇది వెరీ స్పెషల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved