MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Life
  • Cooking Hack: వంకాయ కూరలో రెండు స్పూన్ల పాలు వేయాలి.. ఎందుకో తెలుసా?

Cooking Hack: వంకాయ కూరలో రెండు స్పూన్ల పాలు వేయాలి.. ఎందుకో తెలుసా?

Cooking Hack: వంకాయ కూరంటే మీకు ఇష్టమా? ఈ కూర మరింత రుచిగా రావాలంటే ఒక చిన్న చిట్కా పాటిస్తే చాలు. వంటలో పాలు కలిపితే చాలు, హోటల్ స్టైల్ రుచి వచ్చేస్తుంది. ఎలా వంకాయ కూర పాలతో వండాలో తెలుసుకోండి.

1 Min read
Author : Haritha Chappa
Published : Sep 15 2026, 04:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
వంకాయ కూర రుచిగా రావాలంటే..
Image Credit : Instagram

వంకాయ కూర రుచిగా రావాలంటే..

వంకాయ కూరంటే ఎంతో మందికి ఇష్టం. దీన్ని రకరకాలుగా వండుతారు. రెస్టారెంట్లో అయితే ఆ కూర రుచికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అయితే కొందరికి మాత్రం ఆ కూర లోని వగరు రుచి వల్ల అస్సలు నచ్చదు. చాలాసార్లు వంకాయ కూర లేదా గుత్తి వంకాయ వండినప్పుడు దాని తొక్క వల్ల కూర కొద్దిగా చేదుగా అనిపిస్తుంది. అంతేకాదు, కోసిన వంకాయ ముక్కలు వెంటనే నల్లగా (Discoloration) మారిపోవడం కూడా సహజమే. అయితే కూర టేస్టీగా రావడానికి రెస్టారెంట్లలో వాడే కొన్ని చిట్కాలు ఉన్నాయి.

వంకాయ వండేటప్పుడు కేవలం కొన్ని 'పాలు' కలిపితే చాలు, కూర రుచి, దాని టెక్స్‌చర్ మొత్తం మారిపోతుంది. ఈ అద్భుతమైన కిచెన్ ట్రిక్ తెగ వైరల్ అవుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
పాలు కలిపితే ఏమవుతుంది?
Image Credit : Instagram

పాలు కలిపితే ఏమవుతుంది?

వంకాయ ఉడికేటప్పుడు రెండు స్పూన్లు పాలు కలపడం వల్ల మంచి మార్పులు వస్తాయి. అవేంటంటే.. వంకాయ తొక్కలో సహజంగా ఉండే కొద్దిపాటి చేదు లేదా వగరు రుచిని పాలు పూర్తిగా తగ్గిస్తాయి. పాలు కలపడం వల్ల వంకాయ గ్రేవీ లేదా కూరకు హోటల్ స్టైల్‌లో క్రీమీ రుచి, మంచి టెక్స్‌చర్ వస్తుంది. పాలు వంకాయ ముక్కలు నల్లబడకుండా చేసి, వాటి సహజమైన మట్టి సువాసనను నిలిపి ఉంచడంలో సహాయపడతాయి. దీనివల్ల కూర చాలా రుచిగా వస్తుంది.

33
చింతపండు మాత్రం వాడొద్దు
Image Credit : Instagram

చింతపండు మాత్రం వాడొద్దు

వంకాయ కూరలో మీరు పాలు పోసి వండాలనుకుంటే ఒక ముఖ్యమైన హెచ్చరిక గురించి తెలుసుకోండి. = మీరు వండే వంకాయ పులుసు లేదా గ్రేవీలో చింతపండు లేదా పులుపు ఎక్కువగా ఉండే పదార్థాలు వాడకూడదు. అలా వాటిని వాడితే పాలు కలపకూడదు. చింతపండు పులుపుకు పాలు కలిస్తే, అవి విరిగిపోవడమే కాకుండా, గ్రేవీ మరింత చేదుగా లేదా పాడైపోయే ప్రమాదం ఉంది.

చింతపండు వాడని మసాలా గ్రేవీ, గుత్తి వంకాయ లేదా సింపుల్ వంకాయ వేపుడు చేసేటప్పుడు ఈ పాలు ట్రిక్‌ను హ్యాపీగా వాడొచ్చు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Kasuri Methi: కూరలో కసూరీ మేథీ ఎందుకు వేయాలి? ఎలా వేస్తే కూరకు రుచి పెరుగుతుందో తెలుసా?
Recommended image2
Parenting: ఇంటికి బంధువులు వచ్చినప్పుడు పిల్లల ప్రవర్తన ఎందుకు మారిపోతుందో తెలుసా?
Recommended image3
Gold Tops: 5 గ్రాముల్లోనే వచ్చే చెవికమ్మలు, ఎంతో అందంగా ఉంటాయి
Related Stories
Recommended image1
Divorce: భర్తతో విడాకులు తీసుకోబోతున్న స్టార్ హీరోయిన్? ఆ సినిమాలో నటించడమే కారణమా?
Recommended image2
iPhone 17 Pro: ఐఫోన్ 17 ప్రో కొనేందుకు ఇదే మంచి సమయం.. సగం ధరకే అదిరిపోయే ఫోన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved