MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Snake Facts: రెండు తలల పాము.. వైరల్ వీడియోల వెనుక ఉన్న అసలు నిజం ఇదే

Snake Facts: రెండు తలల పాము.. వైరల్ వీడియోల వెనుక ఉన్న అసలు నిజం ఇదే

Two Headed Snakes: రెండు తలల పాము నిజంగానే ఉంటుందా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల వెనుక ఉన్న శాస్త్రీయ నిజాలు, జన్యు లోపాలు, మనుగడ గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 21 2026, 11:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రెండు తలల పాము మిస్టరీ వీడింది.. శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే?
Image Credit : Gemini

రెండు తలల పాము మిస్టరీ వీడింది.. శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే?

సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ప్రతిరోజూ ఎన్నో వింతలు, విశేషాలకు సంబంధించిన వీడియోలు మన కంటపడుతున్నాయి. వీటిలో తరచుగా నెటిజన్లను ఆకర్షించే వాటిలో 'రెండు తలల పాము' వీడియోలు ముందు వరుసలో ఉంటాయి. రెండు తలలతో, నాలుకలు బయటకు తీస్తూ పాకుతున్న పాములను చూసి చాలామంది ఆశ్చర్యపోతుంటారు.

కొందరు వీటిని చూసి నిజమే అని నమ్మితే, మరికొందరు మాత్రం ఇదంతా వ్యూస్ కోసం చేసిన గ్రాఫిక్స్ లేదా ఎడిటింగ్ అని కొట్టిపారేస్తుంటారు. అయితే, ప్రకృతిలో నిజంగానే రెండు తలల పాములు ఉంటాయా అన్న సందేహం చాలా మందిలో కలుగుతుంది. దీని వెనుక ఉన్న శాస్త్రీయ వాస్తవాలను ఏంటో ఇక్కడ చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రెండు తలల పాము.. శాస్త్రీయంగా ఇది సాధ్యమేనా?
Image Credit : Gemini AI

రెండు తలల పాము.. శాస్త్రీయంగా ఇది సాధ్యమేనా?

సోషల్ మీడియాలో కనిపించే ప్రతి వీడియో నిజం కాకపోయినా, రెండు తలల పాములు పుట్టడం అనేది శాస్త్రీయంగా ముమ్మాటికీ నిజం. ఇది ప్రకృతిలో జరిగే ఒక అత్యంత అరుదైన జన్యుపరమైన లోపం. సైన్స్ పరిభాషలో ఈ పరిస్థితిని 'బైసెఫలీ' లేదా 'డైసెఫలీ' అని పిలుస్తారు. సాధారణంగా పాము గుడ్డులో పిండం అభివృద్ధి చెందే క్రమంలో ఒకే పిండం రెండు భాగాలుగా విడిపోవడం ప్రారంభమవుతుంది. ఈ విభజన ప్రక్రియ పూర్తిగా జరగకుండా మధ్యలోనే ఆగిపోయినప్పుడు, ఒకే శరీరానికి రెండు తలలు ఉన్న పాము జన్మిస్తుంది. మనుషుల్లో అతుక్కున్న కవలలు ఎలా పుడతారో, పాముల్లో కూడా సరిగ్గా ఇదే ప్రక్రియ జరుగుతుంది.

35
ఒకే శరీరం.. రెండు మెదళ్లు
Image Credit : Chatgpt

ఒకే శరీరం.. రెండు మెదళ్లు

ఇలా రెండు తలలతో పుట్టిన పాములకు సంబంధించిన శారీరక నిర్మాణం చాలా సంక్లిష్టంగా ఉంటుంది. వీటికి శరీరం ఒకటే ఉన్నప్పటికీ, రెండు తలలకు వేర్వేరుగా రెండు మెదళ్లు ఉంటాయి. అయితే గుండె, ఊపిరితిత్తులు, కడుపు వంటి అంతర్గత అవయవాలు మాత్రం కలిసిపోయి ఉంటాయి. రెండు మెదళ్లు ఉండటం వల్ల ఈ పాములకు సమన్వయ లోపం ఏర్పడుతుంది. ఒక తల కుడివైపు వెళ్లాలని సంకేతాలు ఇస్తే, మరో తల ఎడమవైపు వెళ్లాలని ప్రయత్నిస్తుంది. దీనివల్ల ఇవి వేగంగా ముందుకు కదలలేవు. అలాగే ఆహారం తినే సమయంలోనూ రెండు తలల మధ్య విపరీతమైన పోటీ ఉంటుంది. ఒక్కోసారి ఆహారం కోసం ఒకదానిపై మరొకటి దాడి చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.

45
అడవిలో వీటి మనుగడ కష్టమే
Image Credit : AI Image

అడవిలో వీటి మనుగడ కష్టమే

రెండు తలల పాములు పుట్టడం ఎంత నిజమో, అవి ఎక్కువ కాలం జీవించలేవు అన్నది కూడా అంతే నిజం. అడవిలో సహజ సిద్ధమైన వాతావరణంలో ఇవి బతకడం చాలా కష్టం. లక్ష పాము పిల్లల్లో ఒకదానికి మాత్రమే ఇలాంటి లక్షణం ఉండే అవకాశం ఉందని అంచనా. కదలికల్లో వేగం లేకపోవడం వల్ల ఇవి ఇతర జంతువులకు, పక్షులకు సులభంగా చిక్కిపోతాయి. శత్రువులు దాడి చేసినప్పుడు వేగంగా తప్పించుకోలేవు. అందుకే అడవిలో వీటి మనుగడ అవకాశాలు చాలా తక్కువ. కేవలం జంతు ప్రదర్శనశాలలు, పరిశోధనా కేంద్రాల్లో ప్రత్యేక సంరక్షణలో ఉన్న పాములు మాత్రమే కొంతకాలం పాటు జీవించిన దాఖలాలు ఉన్నాయి.

55
రెండు తలల పాము.. మూఢనమ్మకాలు
Image Credit : Asianet News

రెండు తలల పాము.. మూఢనమ్మకాలు

భారతదేశంలో 'రెండు తలల పాము' అనగానే చాలామందికి గుర్తుకు వచ్చేది ఎర్ర ఇసుక బోవా (Red Sand Boa). మన పల్లెటూళ్లలో దీనిని మట్టి పాము లేదా ఇరు తలల పాము, రెండు మూతులు పాము అని పిలుస్తారు. కానీ శాస్త్రీయంగా దీనికి రెండు తలలు ఉండవు. ఈ పాము శరీరం లావుగా ఉండి, తోక భాగం మొద్దుబారి అచ్చం తల ఆకారాన్ని పోలి ఉంటుంది. ప్రమాదం ఎదురైనప్పుడు శత్రువును మోసం చేయడానికి ఇది తన తోకను తలలాగా పైకి లేపుతుంది. ఇది విషరహితమైన పాము. అయితే ఈ పాము ఇంట్లో ఉంటే అదృష్టం కలిసివస్తుందని, గుప్తనిధులు దొరుకుతాయని మూఢనమ్మకాలతో వీటిని అక్రమంగా రవాణా చేస్తుంటారు. వీటికి ఎలాంటి అతీంద్రియ శక్తులు లేవని, రెండు తలల పాము అనేది కేవలం ప్రకృతిలో జరిగే జన్యుపరమైన అద్భుతం మాత్రమేనని గుర్తించాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
విద్య
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Hating Country: ఈ దేశంలో బంగారమంటేనే పడదు, గోల్డ్ జ్యూయలరీ వేసుకోవడం పెద్ద వింత
Recommended image2
Free Train: మనదేశంలో ఎవరైనా ఉచితంగా ప్రయాణించగల రైలు ఇదొక్కటే.. ఈ ట్రైన్ ఎక్కడుందో తెలుసా?
Recommended image3
Mushroom Capital: మన దేశంలో 'మష్రూమ్ సిటీ ఆఫ్ ఇండియా'గా ఏ నగరాన్ని పిలుస్తారో తెలుసా?
Related Stories
Recommended image1
SIP Investment: నెల‌కు ₹500 చాలు.. మీరు కోటీశ్వరులు కావొచ్చు.. అస‌లు సీక్రెట్ ఇదే
Recommended image2
Nissan Car: రూ. 5 లక్షలకే అదరగొట్టే 7 సీటర్ కారు.. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 24 కిలోమీటర్ల మైలేజ్ గ్రావిట్‌ సొంతం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved