MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Life
  • Coffee: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ.. ఎలా తయారుచేస్తారో తెలిస్తే..మళ్లీ కాఫీ తాగరు..!

Coffee: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ.. ఎలా తయారుచేస్తారో తెలిస్తే..మళ్లీ కాఫీ తాగరు..!

Coffee: మీకు కాఫీ తాగడం ఇష్టమా? ప్రతిరోజూ కమ్మగా కాఫీ ఆస్వాదించే అలవాటు ఉందా? అయితే, ప్రపంచంలో కెల్లా ఖరీదైన కాఫీ రుచి చూడాలనే ఆశ ఉందా? అది ఎలా తయారు చేస్తారో తెలిస్తే.. మళ్లీ కాఫీ పేరు కూడా ఎత్తరు.

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 29 2026, 02:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Expensive Coffee
Image Credit : Getty

Expensive Coffee

టీని ఇష్టపడేవారు ఎంత మంది ఉంటారో... కాఫీకి కూడా అంతే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు.ఉదయం లేవగానే ఘుమఘుమలాడే స్టాంగ్ కాఫీ తాగితే వచ్చే కిక్కే వేరు. మనలో చాలా మంది ఇనస్టాంట్ కాఫీ తాగుతూ ఉంటారు. లేదంటే.. స్పెషల్ గా ఇంట్లో ఫిల్టర్ కాఫీ తాగుతూ ఉంటారు. మార్కెట్లో ఎన్నో రకాల కాఫీ పౌడర్లు అందుబాటులో ఉన్నాయి. కానీ, ప్రపంచంలో కెల్లా అత్యంత ఖరీదైన కాఫీ పొడి గురించి ఎప్పుడైనా విన్నారా? ఆ కాఫీ పొడిలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? దానికి అంత రేటు ఎందుకు అనే విషయం ఇప్పుడు చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఈ ఖరీదైన కాఫీ పొడి దొరికేది ఇక్కడే...
Image Credit : Getty

ఈ ఖరీదైన కాఫీ పొడి దొరికేది ఇక్కడే...

ప్రపంచంలో అత్యంత ఖరీదైన కాఫీ పొడి పేరు కోపి లువాక్ ( Kopi Luwak). ఈ కాఫీ రుచిలో మాత్రమే కాదు, తయారు చేసే విధానం కూడా భిన్నంగా ఉంటుంది. అందుకే.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కాఫీ ప్రియులు.. దీనిని జీవితంలో ఒక్కసారైనా రుచి చూడాలని కోరుకుంటారు. ఈ కాఫీ పొడిని మొదటిసారి ఇండోనేషియాలో తయారు చేశారు. ప్రస్తుతం ఇండోనేషియాలోని సుమిత్రా, జావా, బాలి, సులవేసి వంటి ప్రదేశాల్లో ఈ కాఫీ పొడిని అమ్ముతున్నారు.

ఈ కాఫీ పొడిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే...

కాఫీ పొడిని... కాఫీ గింజలతో తయారు చేస్తారు ఇది చాలా కామన్. ఈ కాఫీ పొడిని కూడా కాఫీ గింజలతోనే తయారు చేస్తారు. కానీ, దీని వెనక చిన్న మెలిక ఉంది. ఎందుకంటే.. డైరెక్ట్ గా కాఫీ గింజలతో చేయరు. ఈ కాఫీ గింజలను ఆ ప్రదేశంలో దొరికే ఒక జంతువు.. ఆసియన్ పామ్ సివెట్ వాటిని తింటుంది. ఇది కాఫీ పండ్లను తింటుంది. పండు జీర్ణమైన తర్వాత.. ఆ జంతువు కాఫీ గింజలను మలం రూపంలో బయటకు విసర్జిస్తుంది. అది విసర్జించిన గింజలను శుభ్రం చేసి, ఆర బెట్టి, వేయించి.. ఈ కాఫీ పొడి తయారు చేస్తారు. వినడానికి వింతగా, చెత్తగా అనిపించినా కూడా.. ఇదే నిజం. ఇలా తయారు చేయడమే ఈ కాఫీ పొడి స్పెషాలిటీ.

Related Articles

Related image1
Chips Packet:ఎంత మోసం..! చిప్స్ ప్యాకెట్ లో సగం చిప్స్ ఎందుకు ఉంటాయి..? అసలు కారణం ఇదే
Related image2
Pani Puri: పానీపూరీ కనిపెట్టింది.. మహా భారతంలో ద్రౌపది..? ఈ కథ మీకు తెలుసా?
33
ఈ కాఫీ పొడి రుచి ఎందుకు స్పెషల్..?
Image Credit : Getty

ఈ కాఫీ పొడి రుచి ఎందుకు స్పెషల్..?

ఈ సివెట్ అనే జంతువు జీర్ణ వ్యవస్థలో సహజ ఎంజైమ్ లు ఉంటాయి. ఇవి.. కాఫీ గింజలలోని కొన్ని ప్రోటీన్లను మార్చేస్తాయి. దీంతో, ఈ కాఫీ సాధారణ కాఫీతో పోలిస్తే.. రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ కాఫీ పొడి రుచికి చేదు తక్కువగా ఉంటుంది. చాలా ఫ్లేవర ఫుల్ గా ఉంటుంది. చాక్లెట్ ఫ్లేవర్ కూడా వస్తుంది. క్యారమెల్ తీపి, మట్టి వాసన అన్నీ కలగలసినట్లుగా ఈ కాఫీ పొడి ఉంటుంది. అయితే, ఈ కాఫీ పొడి ఒక్కొక్కరికి ఒక్కో రుచి అనుభూతిని ఇస్తుంది.

ఈ కాఫీ పొడికి ఎందుకు ఇంత ధర..?

ఈ కాఫీ ఉత్పత్తి చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాదు.. ఆ జంతువు విసర్జించిన గింజలను సేకరించడం కూడా చాలా శ్రమతో కూడుకున్న పని. శుభ్రపరిచే ప్రక్రియ చాలా కష్టమైనది. సహజంగా లభించే అసలైన కోపి లువాక్ చాలా అరుదుగా దొరుకుతుంది. అందుకే.. ఈ కాఫీ పొడికి ధర ఎక్కువ. ఈ కాఫీ పొడి కిలో వందల డాలర్ల నుంచి వెయ్యి డాలర్లకు పైగా ఉంటాయి.

అయితే, మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే... ఈ కాఫీ పొడికి డిమాండ్ పెరగడంతో, ఆ సివెట్ జంతువులను బలవంతంగా బోనులో బంధించి.. కాఫీ పండ్లను తినిపించే పద్దతి మొదలుపెట్టారు. దీనిపై జంతు సంక్షేమ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే, ఈ కాఫీ పొడిని జీవితంలో ఒక్కసారైనా రుచి చూడాలి అని కొందరు కాఫీ ప్రియులు తహతహలాడుతూ ఉంటే.. మరి కొందరు మాత్రం.. దీని తయారీ విధానం విని, ఇంకోసారి కాఫీ పేరు ఎత్తడానికి కూడా ఇష్టపడటం లేదు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
ఆహారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Parenting: ప్రతి తల్లీ తన కొడుకుకి చెప్పాల్సిన 7 విషయాలు ఇవి
Recommended image2
Dosa: డయాబెటిక్ ఫ్రెండ్లీ దోశె.. దీన్ని చేయడం వెరీ ఈజీ, షుగర్ వ్యాధి ఉన్నవారికి స్పెషల్
Recommended image3
Rice Water: రైస్ వాటర్‌ని ఇలా వాడితే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది!
Related Stories
Recommended image1
Chips Packet:ఎంత మోసం..! చిప్స్ ప్యాకెట్ లో సగం చిప్స్ ఎందుకు ఉంటాయి..? అసలు కారణం ఇదే
Recommended image2
Pani Puri: పానీపూరీ కనిపెట్టింది.. మహా భారతంలో ద్రౌపది..? ఈ కథ మీకు తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved