MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Chips Packet:ఎంత మోసం..! చిప్స్ ప్యాకెట్ లో సగం చిప్స్ ఎందుకు ఉంటాయి..? అసలు కారణం ఇదే

Chips Packet:ఎంత మోసం..! చిప్స్ ప్యాకెట్ లో సగం చిప్స్ ఎందుకు ఉంటాయి..? అసలు కారణం ఇదే

Chips Packet: చిప్స్ ప్యాకెట్ చూడటానికి పెద్దగా ఉన్నా... అందులో చిప్స్ సగం మాత్రమే ఉన్నాయి అనిపిస్తుంది. అలా ఎందుకు అనిపిస్తుంది? ఇలా అమ్మడం వెనక ఉన్న రీజన్ ఏంటో తెలుసా?

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 25 2026, 05:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
చిప్స్ ప్యాకెట్ లో చిప్స్...
Image Credit : chat gpt

చిప్స్ ప్యాకెట్ లో చిప్స్...

మార్కెట్లో మనకు చాలా రకాల కంపెనీలకు చెందిన చిప్స్ ప్యాకెట్స్ అమ్ముతూనే ఉంటారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు అందరికీ చిప్స్ తినడం ఇష్టమే. అందుకే టైమ్ పాస్ కోసం అని ఈ చిప్స్ కొని ప్యాకెట్ తెరచి చూస్తే.. అందులో సగం మాత్రమే చిప్స్ కనపడతాయి. మిగిలిన సగం మొత్తం గాలితో నింపినట్లు కనపడతాయి. అందుకే.. చిప్స్ ప్యాకెట్ చేసిన ప్రతిసారీ చాలా మంది నిరుత్సాహ పడుతూ ఉంటారు. ‘మనల్ని మోసం చేయడానికి.. ప్యాకెట్ బయటకు పెద్దగా చూపిస్తారు..లోపల మాత్రం తినడానికి చిప్స్ ఉండవు.. ఇదంతా మార్కెటింగ్ స్ట్రాటజీ’ అనే భావన చాలా మందికి ఉంటుంది. కానీ, కస్టమర్స్ ని మోసం చేయడానికి కాదు, చిప్స్ ప్యాకెట్ ఇలా తయారు చేయడం వెనక వేరే కారణం ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
చిప్స్ ప్యాకెట్ ని గాలితో నింపుతారా..?
Image Credit : pinterest

చిప్స్ ప్యాకెట్ ని గాలితో నింపుతారా..?

బయటకు మనకు కనిపించడానికి ప్యాకెట్ నిండుగా కనపడాలని గాలి నింపుతారు అని అనుకుంటాం. కానీ, అందులో నిజానికి నార్మల్ గాలి కాదు.. నైట్రోజన్ నింపుతారు. ప్యాకెట్ లో చిప్స్ వేసి.. సీజ్ చేయడానికి ముందు నైట్రోజన్ వాయివును నింపుతారు. నైట్రజన్ గాలికి రంగు, వాసన ఉండదు. మనం పీల్చే గాలిలో కూడా 78 శాతం నైట్రోజన్ ఉంటుంది. ఈ గాలిని నింపడం వల్ల ప్యాకెట్ లో ఫుడ్ తో ఎలాంటి రియాక్షన్స్ జరపదు. ఫుడ్ ఏమీ పాడవ్వదు.

Related Articles

Related image1
Parenting: పిల్లల కోసం తండ్రి మార్చుకోవాల్సిన 3 అలవాట్లు.. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి టిప్స్
Related image2
Success Story:చేయాలనే తపన ఉంటే వయసుతో పనేంటి..? 65ఏళ్ల వయసులో ప్రపంచాన్ని మార్చిన వ్యక్తి కథ ఇది..!
33
నైట్రోజన్ గాలి ఎందుకు నింపుతారు..?
Image Credit : Getty

నైట్రోజన్ గాలి ఎందుకు నింపుతారు..?

మనం ఇష్టంగా లాగించే చిప్స్ ని నూనెలో వేయించి తయారు చేస్తారు. ఈ ఫుడ్ కి ఆక్సీజన్ ఎక్కువసేపు తగిలితే.. వాటి రుచి మారిపోవడమే కాకుండా, వాసన కూడా వస్తాయి. త్వరగా పాడౌతాయి. అందుకే, ఆక్సీజన్ స్థానంలో నైట్రోజన్ నింపుతారు. అందుకే, మనం చిప్స్ ప్యాకెట్ ఎప్పుడు ఓపెన్ చేసినా కూడా మంచిగా కరకరలాడతూ ఉంటాయి. రుచి మారవు, మెత్తగా కూడా మారవు.

అంతేకాదు, చిప్స్ మనం జస్ట్ చేతితో పట్టుకుంటేనే విరిగిపోతాయి. అలాంటివి ఫ్యాక్టరీ నుంచి తయారై.. ట్రక్కులు, చివరకు దుకాణాల వరకు చేరే ప్రయాణంలో ప్యాకెట్లపై ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది. అదే.. నైట్రోజన్ గాలి ఆ చిప్స్ కి మంచి కుషన్ లా పని చేస్తుంది. దీని కారణంగా.. అవి పాడవ్వకుండా.. సేఫ్ గా మనదాకా వస్తున్నాయి.

చిన్న ప్యాకెట్ లో అమ్మచ్చు కదా...

చిప్స్ ప్యాకెట్ లో చిప్స్ చాలా తక్కువగా ఉంటాయి కదా.. అంత పెద్ద ప్యాకెట్ కి బదులు చిన్న ప్యాకెట్ లోనే అమ్మచ్చు కదా అని మీకు సందేహం రావచ్చు. కానీ.. దీని వెనక కూడా కారణం ఉంది. చిప్స్ అన్నీ ఒకే ఆకారంలో ఉండవు. వాటి పరిమాణం, మందం, ఆకృతి ఆధారంగా అవసరమైన స్థలం మారుతూ ఉంటుంది. అందుకే.. ప్యాకెట్ కవర్ పెద్దగానే ఉంటుంది.

కంపెనీలు మనల్ని మోసం చేస్తున్నాయా..?

మనకు చూడటానికి ప్యాకెట్ పెద్దగా కనిపించినా, అందులో చిప్స్ తక్కువ ఉంటాయి కదా.. మరి కంపెనీలు మనల్ని మోసం చేస్తున్నాయా? అంటే అందులో మోసం ఏమీ లేదు. ఎందుకంటే.. చిప్స్ ఎంత బరువు ఉన్నాయో.. ప్యాకెట్ మీద క్లియర్ గా రాసి ఉంటుంది. మనం.. దానిని చెక్ చేసుకోవాలి.

ఫైనల్ గా చెప్పేది ఏంటంటే...

చిప్స్ ప్యాకెట్ లో కనిపించే ఖాళీ భాగం మనల్ని మోసం చేయడానికి కాదు.. చిప్స్ ని మనకు తాజాగా అందించాలనే లక్ష్యంతోనే ఇలానే తయారు చేస్తున్నారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
సాక్సులు పాతవైపోయాయా? వాటిని పడేసే కన్నా ఇలా వాడితే ఇల్లు క్లీన్ అయిపోతుంది
Recommended image2
Earphone Safety : రోజూ ఇయర్‌ఫోన్స్‌ వాడుతున్నారా? మీ చెవులను కాపాడుకునే సింపుల్ టిప్స్!
Recommended image3
Leftover Rice: మిగిలిపోయిన అన్నంతో కరకరలాడే బోండాలు.. ఈజీగా ఇలా చేసేయండి!
Related Stories
Recommended image1
Parenting: పిల్లల కోసం తండ్రి మార్చుకోవాల్సిన 3 అలవాట్లు.. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి టిప్స్
Recommended image2
Success Story:చేయాలనే తపన ఉంటే వయసుతో పనేంటి..? 65ఏళ్ల వయసులో ప్రపంచాన్ని మార్చిన వ్యక్తి కథ ఇది..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved