MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Did You Know: ఆకలి లేకపోయినా తినాలని ఎందుకు అనిపిస్తుందో తెలుసా? అసలు కారణం ఇదే!

Did You Know: ఆకలి లేకపోయినా తినాలని ఎందుకు అనిపిస్తుందో తెలుసా? అసలు కారణం ఇదే!

Did You Know: కొందరికి భోజనం చేసిన కాసేపటికే మళ్లీ ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. కడుపు నిండుగానే ఉంటుంది కానీ, మనసు మాత్రం స్నాక్స్ కోసం వెతుకుతుంది. అసలు ఆకలి లేకపోయినా తినాలనిపించడం వెనుక కారణం ఏంటి? దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Aug 18 2026, 06:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఆకలి లేకపోయినా ఎందుకు తినాలనిపిస్తుంది?
Image Credit : Gemini AI

ఆకలి లేకపోయినా ఎందుకు తినాలనిపిస్తుంది?

భోజనం చేసిన కొద్దిసేపటికే మళ్లీ ఏదైనా తినాలని అనిపించడం, టీవీ చూస్తూ తెలియకుండానే స్నాక్స్ తినేయడం, పని మధ్యలో బోర్ కొడితే ఫ్రిజ్ వైపు వెళ్లడం.. ఇవన్నీ చాలామందికి రోజువారీ జీవితంలో ఎదురయ్యే అనుభవాలే. నిజంగా ఆకలి లేకపోయినా తినాలనే కోరిక ఎందుకు వస్తుంది? మన శరీరానికి ఆహారం అవసరమా, లేక మనసు ఏదైనా కోరుకుంటుందా? దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
శారీరక ఆకలి, భావోద్వేగ ఆకలి
Image Credit : Gemini AI

శారీరక ఆకలి, భావోద్వేగ ఆకలి

నిపుణుల ప్రకారం.. నిజమైన ఆకలి, భావోద్వేగ ఆకలి మధ్య చాలా తేడా ఉంటుంది. శారీరక ఆకలి సాధారణంగా క్రమంగా పెరుగుతుంది. కొంత సమయం తినకపోతే కడుపులో ఖాళీగా అనిపించడం, శక్తి తగ్గడం, అలసట వంటి సంకేతాలు కనిపించవచ్చు. కానీ భావోద్వేగ ఆకలి ఒక్కసారిగా వస్తుంది. ముఖ్యంగా ఒక నిర్దిష్టమైన ఆహారం తినాలనే బలమైన కోరిక కలుగుతుంది. అలా ఎందుకు కలుగుతుందో చూద్దాం.

Related Articles

Related image1
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ 3 రకాల వ్యక్తులతో సీక్రెట్స్ అస్సలు చెప్పొద్దు!
Related image2
Ajwain Water: ఉదయం ఈ ఒక్క డ్రింక్ తాగినా చాలు.. ఎన్నో లాభాలు!
36
ఒత్తిడి
Image Credit : Getty

ఒత్తిడి

పని ఒత్తిడి, కుటుంబ సమస్యలు, ఆందోళన, కోపం లేదా నిరాశ వంటి భావాలు మన ఆహారపు అలవాట్లను ప్రభావితం చేయవచ్చు. ఒత్తిడిలో ఉన్నప్పుడు శరీరంలో జరిగే హార్మోన్ల మార్పులు ఆకలి, ముఖ్యంగా తీపి, ఉప్పు లేదా కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారాలపై కోరికను పెంచవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే కొంతమందికి టెన్షన్‌లో ఉన్నప్పుడు చాక్లెట్, ఐస్‌క్రీమ్, బేకరీ ఫుడ్ లేదా ఫాస్ట్‌ఫుడ్ తినాలని కోరిక కలగవచ్చు.

46
బోర్ కొట్టడం
Image Credit : Asianet News/AI Generated

బోర్ కొట్టడం

ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు, పని చేయడానికి ఆసక్తి లేనప్పుడు లేదా ఖాళీ సమయం ఎక్కువగా ఉన్నప్పుడు ఏదైనా తినడం ఒక చిన్న వినోదంలా అనిపించవచ్చు. ఫ్రిజ్ తెరవడం, ఏదైనా స్నాక్స్ తీసుకోవడం, టీవీ లేదా మొబైల్ చూస్తూ తినడం.. ఇవి క్రమంగా ఒక అలవాటుగా మారిపోతాయి. ఒక దశలో ఆకలి లేకపోయినా ఏదైనా తినాలి అనే ఆలోచన రావచ్చు.

56
నిద్ర కూడా..
Image Credit : Getty

నిద్ర కూడా..

తగినంత నిద్ర లేకపోవడం వల్ల ఆకలి, ఆహార కోరికల్లో మార్పులు రావచ్చు. ముఖ్యంగా అలసటగా ఉన్నప్పుడు శరీరానికి తక్షణ శక్తి కావాలనే భావనతో తీపి లేదా ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారం వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉంటుంది. రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోయే వారిలో ఇలా తినే అలవాటు ఎక్కువగా ఉంటుంది.

66
తినే విధానం
Image Credit : Getty

తినే విధానం

మనం ఆహారాన్ని ఎలా తింటున్నామన్నది కూడా ముఖ్యం. మొబైల్ చూస్తూ, టీవీ ముందు కూర్చుని లేదా పని చేస్తూనే తింటే ఎక్కువగా తినే అవకాశం ఉంటుంది. భోజనం చేస్తున్నప్పుడు ఆహారంపై దృష్టి పెట్టడం, నెమ్మదిగా తినడం, రుచి, కడుపు నిండుతున్న అనుభూతిని గమనించడం మంచిది. అయితే ఆకలి లేకపోయినా అప్పుడప్పుడు ఇష్టమైన ఆహారం తినడం తప్పు కాదు. మనం ఆనందం కోసం కూడా కొన్నిసార్లు తింటుంటాం. కానీ అదే పనిగా తింటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Chepala Ulli Karam: ఆదివారం అదిరిపోయే చేపల ఉల్లికారం..లొట్టలేస్తారు అంతే..
Recommended image2
Coconut Water: కొబ్బరి నీళ్లు రోజూ తాగితే ఏమవుతుందో తెలుసా?
Recommended image3
Watch: అంబానీ కోడలు రాధిక మర్చంట్ వాచ్ ఖరీదు ఎంతో తెలుసా? ఒక్క వాచ్ ఖరీదుతో లైఫ్ సెటిల్..!
Related Stories
Recommended image1
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ 3 రకాల వ్యక్తులతో సీక్రెట్స్ అస్సలు చెప్పొద్దు!
Recommended image2
Ajwain Water: ఉదయం ఈ ఒక్క డ్రింక్ తాగినా చాలు.. ఎన్నో లాభాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved