MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Coffee Powder: కాఫీ పొడిని ఫ్రిజ్ లో ఎందుకు పెట్టాలి? జరిగే మ్యాజిక్ ఇదే..!

Coffee Powder: కాఫీ పొడిని ఫ్రిజ్ లో ఎందుకు పెట్టాలి? జరిగే మ్యాజిక్ ఇదే..!

Coffee Powder: మీ ఇంట్లో కాఫీ పొడి ఉందా? దానిని ఎక్కడ స్టోర్ చేస్తున్నారు? ఫ్రిజ్ లో అసలు కాఫీ పొడి ఎందుకు ఉంచాలి? దాని వల్ల ఎలాంటి మ్యాజిక్ జరుగుతుందో తెలుసా?

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 19 2026, 07:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
కాఫీ పొడి మ్యాజిక్...
Image Credit : Getty

కాఫీ పొడి మ్యాజిక్...

మన దేశంలో ప్రతి రోజూ ఉదయం టీ లేదా కాఫీతోనే మొదలౌతుంది. కాఫీ పొడి ఎక్కువ రోజులు తాజాగా ఉండాలని చాలా మంది దానిని ఫ్రిజ్ లోనే స్టోర్ చేస్తూ ఉంటారు. ఇన్ స్టాంట్ కాఫీ పొడిని మనం డైరెక్ట్ గా పాలల్లో కలిపేసుకుంటాం. కానీ, చాలా మంది ఇన్ స్టాంట్ కాఫీ నచ్చదు. ఇంట్లో స్వయంగా కాఫీ డికాషన్ తయారు చేసుకొని మరీ కాఫీ చేసుకుంటారు. అయితే.. కాఫీ డికాక్షన్ వడకట్టిన తర్వాత మిగిలిపోయిన కాఫీ పొడి దాదాపు అందరూ డస్ట్ బిన్ లో పడేస్తూ ఉంటారు. కానీ, మనం ఎందుకూ పనికి రాదు అని డస్ట్ బిన్ లో పడేసే కాఫీ పొడితో ఇంటిని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు. ఇటీవల చాలా మంది తమ ఫ్రిజ్ లో వాడేసిన కాఫీ పొడిని ఒక చిన్న గిన్నెలో పెడుతున్నారు. అసలు ఫ్రిజ్ లో వాడేసిన కాఫీ పొడిని ఎందుకు ఉంచాలి? దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఫ్రిజ్‌లో కాఫీ పొడి ఎందుకు పెట్టాలి?
Image Credit : Gemini ai

ఫ్రిజ్‌లో కాఫీ పొడి ఎందుకు పెట్టాలి?

మన ఫ్రిజ్‌లో ఉల్లిపాయలు, వెల్లుల్లి తో వండిన కూరలు, రకరకాల పదార్థాలు పెట్టడం వల్ల కొన్నిసార్లు ఒక రకమైన దుర్వాసన వస్తుంటుంది.

దుర్వాసనలను పీల్చుకుంటుంది: కాఫీకి సహజంగానే మంచి సువాసన ఉంటుంది. దీని రేణువులు గాలిలో ఉండే దుర్వాసన కలిగించే బ్యాక్టీరియా, అణువులను తమలోకి పీల్చుకుంటాయి.

ఫ్రెష్‌నెస్‌ను ఇస్తుంది: ఇది ఫ్రిజ్‌లోని చెడు వాసనలను పూర్తిగా తీసివేయకపోయినా... ఫ్రిజ్‌ను ఎప్పుడూ తాజాగా, మంచి సువాసనతో ఉంచడానికి సహాయపడుతుంది.

33
ఫ్రిజ్‌లో కాఫీ పొడిని ఎలా ఉపయోగించాలి?
Image Credit : Getty

ఫ్రిజ్‌లో కాఫీ పొడిని ఎలా ఉపయోగించాలి?

కాఫీ తయారు చేసుకున్న తర్వాత మిగిలిన పొడిని ఒక ప్లేట్‌లో పరిచి బాగా ఆరబెట్టాలి. అంటే తడి లేకుండా చూసుకోవాలి.

పొడి బాగా ఎండిన తర్వాత, 2 నుండి 4 చెంచాల పొడిని ఒక చిన్న ఓపెన్ బౌల్ లేదా గాజు సీసాలో వేయాలి.

ఈ గిన్నెపై మూత పెట్టకుండా ఫ్రిజ్ షెల్ఫ్‌లో ఒక పక్కగా ఉంచాలి.

ప్రతీ కొన్ని వారాలకు ఒకసారి లేదా ఆ పొడి తడిగా మారినప్పుడు దానిని తీసేసి కొత్త కాఫీ పొడిని మార్చాలి.మీ దగ్గర ఫిల్టర్ కాఫీ పొడి లేదు అనుకుంటే... ఇన్ స్టాంట్ కాఫీ పొడిని అయినా ఒక చిన్న గిన్నెలో... వేసి.. ఫ్రిజ్ లో మూలలో ఉంచొచ్చు.

మిగిలిపోయిన కాఫీ పొడితో ఇతర అద్భుత ఉపయోగాలు: 

1. మొక్కలకు సహజ ఎరువు: కాఫీ పొడిలో మొక్కలకు ఉపయోగపడే పోషకాలు ఉంటాయి. కొద్దిగా కాఫీ పొడిని ఇంట్లో పెంచే మొక్కల కుండీలలో లేదా కాంపోస్ట్ ఎరువులో కలిపితే మొక్కలు బాగా పెరుగుతాయి.

2. పాత్రలను రుద్దడానికి : కాఫీ పొడి కాస్త బరకగా ఉండటం వల్ల వంట పాత్రలు, పెనాలు, గ్రిల్స్‌పై ఉండే గట్టి జిడ్డును వదిలించడానికి దీనిని స్క్రబ్బర్‌లా కూడా పని చేస్తుంది.

3. డస్ట్‌బిన్ వాసన తగ్గించడానికి: ఇంట్లోని డస్ట్‌బిన్ అడుగు భాగంలో కొద్దిగా పొడి కాఫీ పొడిని చల్లితే చెత్త వల్ల వచ్చే వాసనలు తగ్గుతాయి.

4. చీమలను నివారించడానికి: ఇంట్లోకి చీమలు రాకుండా ఇంటి డోర్ దగ్గర, బాల్కనీలు లేదా కిటికీల వద్ద కాఫీ పొడిని చల్లితే చీమల నివారణకు పనిచేస్తుంది.

ఇకపై కాఫీ పొడిని వ్యర్థంగా పారేయకుండా ఇలా మీ ఇంటి అవసరాల కోసం తెలివిగా ఉపయోగించుకోండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Train Travel Rules: ట్రైన్‌లో వెళ్లేటప్పుడు ఈ తప్పు చేస్తే రూ.5,000 ఫైన్, 6 నెలల జైలు!
Recommended image2
Ear Chain Designs: మీ చెవులకు అందాన్ని తెచ్చే మాటీల డిజైన్లు..చూసేయండి
Recommended image3
Top Load Vs Front Load: ఈ రెండు వాషింగ్ మెషీన్లలో ఏది వాడితే కరెంట్ బిల్లు తక్కువ వస్తుంది?
Related Stories
Recommended image1
Mutton: మటన్ కొంటున్నారా? తాజా, లేతగా ఉన్న మటన్ ఎంచుకోవడానికి బెస్ట్ చిట్కాలు
Recommended image2
Chicken Curry Tips: చికెన్ కూర మరింత రుచిగా రావాలంటే సింపుల్ చిట్కాలు ఇవిగో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved