MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Money Saving Tips: జీతం వచ్చిన వెంటనే ఖర్చైపోతోందా? ఇలా చేస్తే డబ్బు ఆదా చేయొచ్చు!

Money Saving Tips: జీతం వచ్చిన వెంటనే ఖర్చైపోతోందా? ఇలా చేస్తే డబ్బు ఆదా చేయొచ్చు!

Money Saving Tips: జీతం ఎంత వచ్చినా నెలాఖరుకు చేతిలో డబ్బు మిగలడం లేదా? అయితే కొన్ని అనవసరమైన ఖర్చులను తగ్గించి ప్రతి నెలా కొంత మొత్తాన్ని పొదుపు చేయొచ్చు. మరి డబ్బు ఆదా చేసేందుకు పాటించాల్సిన సింపుల్ టిప్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Kavitha G
Published : Sep 05 2026, 01:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
డబ్బు ఆదా చేసే చిట్కాలు
Image Credit : pinterest

డబ్బు ఆదా చేసే చిట్కాలు

సాధారణంగా చాలామందికి ఆదాయం బాగానే ఉన్నప్పటికీ అనవసర ఖర్చుల కారణంగా నెలాఖరుకు చేతిలో ఏమీ మిగలదు. ఖర్చులను కాస్త ప్లాన్ చేసుకుని, కొన్ని సింపుల్ రూల్స్ పాటిస్తే పెద్దగా కష్టపడకుండానే ప్రతి నెలా డబ్బును సేవ్ చేయొచ్చు. మరి ఆ మనీ సేవింగ్ టిప్స్ ఏంటో చూద్దామా…

ఖర్చులను రాసుకోవడం

ఉదయం తాగే కాఫీ నుంచి ఆన్‌లైన్ ఆర్డర్ వరకు, ప్రతిరోజూ చేసే ప్రతి ఖర్చును తప్పకుండా రాసుకోవాలి. దీనివల్ల డబ్బు ఎక్కడ ఎక్కువ ఖర్చవుతుందో సులభంగా తెలుసుకోవచ్చు. చాలా ఖర్చులు విడిగా చూస్తే చిన్నవిగానే అనిపిస్తాయి. కానీ, నెల చివరికి అవన్నీ కలిపితే పెద్ద మొత్తంలో ఉంటాయి. దీనికోసం పెద్దగా ఖాతా పుస్తకాలేం అవసరం లేదు. మీ మొబైల్‌లోని నోట్స్, ఎక్సెల్ షీట్ లేదా ఖర్చులను నమోదు చేసే ఏదైనా యాప్‌ను ఉపయోగించవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తప్పనిసరి ఖర్చుల కోసం..
Image Credit : pinterest

తప్పనిసరి ఖర్చుల కోసం..

నెల మొదట్లోనే ఇంటి అద్దె, కిరాణా, కరెంట్ బిల్లు, గ్యాస్, ప్రయాణ ఖర్చులు వంటి తప్పనిసరి ఖర్చుల కోసం కొంత మొత్తాన్ని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మిగిలిన డబ్బులో కొంత పొదుపు చేసి, అవసరమైన ఖర్చులకు మిగతా మొత్తాన్ని ఉపయోగించడం మంచిది. ఇలా ముందుగానే బడ్జెట్ వేసుకోవడం వల్ల అనవసర ఖర్చులను తగ్గించడంతో పాటు, నెలాఖరుకు డబ్బు కొరత రాకుండా చూసుకోవచ్చు.

Related Articles

Related image1
Parenting: కూతురు జీవితంలో గెలవాలంటే పేరెంట్స్ చేయాల్సిన 5 పనులు ఇవే..!
Related image2
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం.. ఈ 5 విషయాల్లో ఇతరుల సలహా తీసుకోవడం ప్రమాదకరం!
35
బయటి ఫుడ్ తగ్గించడం
Image Credit : pinterest

బయటి ఫుడ్ తగ్గించడం

ప్రతిరోజూ హోటల్‌లో తినడం లేదా తరచూ ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేయడం వల్ల మనకు తెలియకుండానే నెలవారీ ఖర్చులు భారీగా పెరిగిపోతాయి. ఒక్కోసారి చిన్న మొత్తంగా అనిపించినా, నెల మొత్తం లెక్క వేసుకుంటే ఆ ఖర్చు గణనీయంగా ఉంటుంది. అందుకే వీలైనంత వరకు ఇంట్లోనే వండుకుని తినడం అలవాటు చేసుకోవాలి. వారానికి కావాల్సిన కూరగాయలు, కిరాణా సామాన్లు ముందుగానే కొనుగోలు చేసుకుని, భోజనాన్ని ప్లాన్ చేసుకోవడం ద్వారా బయట ఫుడ్‌పై ఆధారపడటం తగ్గించవచ్చు.

45
కావాల్సిన వస్తువుల జాబితా
Image Credit : pinterest

కావాల్సిన వస్తువుల జాబితా

షాపుకు వెళ్లే ముందే, ఇంటికి కావాల్సిన సరుకుల జాబితా తయారుచేసుకోవాలి. ఇది అనవసరమైన ఖర్చులను నివారించడానికి సహాయపడుతుంది. లిస్ట్‌లో లేని వస్తువులను అనవసరంగా కొనడం మానుకోవాలి. అలాగే, ప్రతిసారీ పెద్ద సూపర్ మార్కెట్లకు వెళ్లే బదులు, దగ్గర్లోని చిన్న దుకాణాల్లోనే అవసరమైన వస్తువులు కొనడానికి ప్రయత్నించాలి.

55
ఆలోచించి కొనడం
Image Credit : pinterest

ఆలోచించి కొనడం

నచ్చిన వస్తువును వెంటనే కొనకుండా, అది నిజంగా ఇప్పుడు అవసరమా? అని ఆలోచించి కొనడం మంచిది. అలాగే, దగ్గరి ప్రదేశాలకు నడిచి వెళ్లడం, ప్రజా రవాణాను ఉపయోగించడం వంటివి ఇంధన ఖర్చును తగ్గించడంలో సహాయపడతాయి.

సేవింగ్స్ కి ప్రాధాన్యం

జీతం రాగానే, 'మిగిలితే దాచుకుందాం' అని అనుకోకుండా, ముందుగా కొంత మొత్తాన్ని పొదుపు కోసం పక్కన పెట్టాలి. ఆ తర్వాత మిగిలిన డబ్బుతో నెలవారీ ఖర్చులను ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. చిన్న చిన్న మార్పులే పెద్ద సేవింగ్స్ కి దారితీస్తాయి. అన్ని ఖర్చులను ఒకే రోజులో తగ్గించుకోవడానికి ప్రయత్నించే బదులు, రోజూ చేసే కొన్ని అనవసరమైన ఖర్చులను గుర్తించి, వాటిని క్రమంగా తగ్గించుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
పర్సనల్ పైనాన్స్
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Ring: కేవలం 2 గ్రాముల్లో అదిరిపోయే రింగ్స్, డైలీవేర్ కి బెస్ట్.!
Recommended image2
White Rice: చద్దన్నం Vs వేడి అన్నం.. రెండింటిలో ఏది మంచిది? ఏది తింటే ఆరోగ్యం..?
Recommended image3
Crispy Vada: హోటల్ గారెలు కరకరలాడేలా ఎందుకు వస్తాయో తెలుసా? ఇదే ఆ చిట్కా
Related Stories
Recommended image1
Parenting: కూతురు జీవితంలో గెలవాలంటే పేరెంట్స్ చేయాల్సిన 5 పనులు ఇవే..!
Recommended image2
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం.. ఈ 5 విషయాల్లో ఇతరుల సలహా తీసుకోవడం ప్రమాదకరం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved