MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Parenting: కూతురు జీవితంలో గెలవాలంటే పేరెంట్స్ చేయాల్సిన 5 పనులు ఇవే..!

Parenting: కూతురు జీవితంలో గెలవాలంటే పేరెంట్స్ చేయాల్సిన 5 పనులు ఇవే..!

Parenting: ప్రతి తల్లిదండ్రులు తమ కూతురు జీవితంలో ఉన్నతంగా ఎదగాలని, ఎవరి ముందు తలవంచకుండా ధైర్యంగా నిలబడాలని కోరుకుంటారు. కూతురు జీవితంలో గెలవాలంటే తనని ప్రేమగా పెంచడం మాత్రమే కాదు.. పేరెంట్స్ కచ్చితంగా చేయాల్సిన 5 పనులు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Sep 04 2026, 03:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కూతురి కోసం పేరెంట్స్ చేయాల్సిన 5 పనులు
Image Credit : AI

కూతురి కోసం పేరెంట్స్ చేయాల్సిన 5 పనులు

ప్రతి తల్లిదండ్రులు తమ కూతురు భవిష్యత్తులో సంతోషంగా, ధైర్యంగా, ఎవరి మీదా పూర్తిగా ఆధారపడకుండా జీవించాలని కోరుకుంటారు. మంచి చదువు, ఉద్యోగం, జీవితం ఇవ్వాలని ఆశిస్తారు. కానీ కూతురు జీవితంలో నిజంగా గెలవాలంటే మంచి చదువు చెప్పించడం లేదా ఖరీదైన సౌకర్యాలు అందించడం మాత్రమే సరిపోదు అంటున్నారు నిపుణులు. మరి కూతురి భవిష్యత్ కోసం తల్లిదండ్రులు చేయాల్సిన 5 పనులేంటో ఇక్కడ చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ధైర్యవంతురాలిగా పెంచడం
Image Credit : instagram

ధైర్యవంతురాలిగా పెంచడం

కూతురికి చిన్నప్పటి నుంచే “నువ్వు చాలా స్ట్రాంగ్”, “నువ్వు ఏదైనా సాధించగలవు” అనే నమ్మకాన్నిపెంచాలి. సమస్య వచ్చిన ప్రతిసారీ తల్లిదండ్రులే పరిష్కరించకుండా, పరిస్థితిని అర్థం చేసుకుని ఆమె కూడా పరిష్కారం వెతికేలా ప్రోత్సహించాలి. ఓటమి ఎదురైతే కుంగిపోకుండా, మళ్లీ ప్రయత్నించే ధైర్యం నేర్పాలి. ఇతరులు ఏమనుకుంటారో అనే భయంతో తన కలలను వదులుకోకుండా, తన జీవితానికి తానే బాధ్యత వహించేలా తీర్చిదిద్దాలి.

36
అన్నింట్లో అవకాశం కల్పించడం
Image Credit : Getty

అన్నింట్లో అవకాశం కల్పించడం

చిన్న వయసులో పిల్లలు వినే మాటలు వారి ఆలోచనా విధానంపై చాలా ప్రభావం చూపుతాయి. “అబ్బాయిలు మాత్రమే బయట పనులు చేయాలి”, “అమ్మాయిలు కొన్ని పనులు చేయకూడదు”, “అది మగవాళ్ల పని” అంటూ పరిమితులు విధిస్తే తెలియకుండానే ఆమె మనసులో కొన్ని పనులు తనకు సంబంధించినవి కావనే భావన ఏర్పడవచ్చు. కాబట్టి ఆమెకు ఆసక్తి ఉన్న పనులను ప్రయత్నించే అవకాశం ఇవ్వాలి. క్రీడలు ఆడాలనుకుంటే ఆడనివ్వాలి, సైకిల్ లేదా బైక్ నేర్చుకోవాలనుకుంటే నేర్పించాలి, తనకి ఏ రంగంపై ఆసక్తి ఉంటే అటువైపు ప్రోత్సహించాలి.

46
సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించడం
Image Credit : Getty

సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించడం

ప్రతి అమ్మాయికి తనను తాను రక్షించుకోవడానికి అవసరమైన ప్రాథమిక నైపుణ్యాలు నేర్పించాలి. అయితే సెల్ఫ్ డిఫెన్స్ అంటే కేవలం శారీరకంగా ఎదుటివారిని ఎదుర్కోవడం మాత్రమే కాదు. ప్రమాదకర పరిస్థితులను ముందుగానే గుర్తించడం, అపరిచితుల విషయంలో జాగ్రత్తగా ఉండటం, అసౌకర్యంగా అనిపించినప్పుడు అక్కడి నుంచి దూరంగా వెళ్లడం, అవసరమైనప్పుడు సహాయం కోరడం వంటి విషయాలను కూడా నేర్పాలి. తన భద్రత విషయంలో ఎలాంటి సంకోచం లేకుండా స్పందించే ధైర్యం కూతురిలో ఉండాలి.

56
“నో” చెప్పడం నేర్పించడం
Image Credit : AI

“నో” చెప్పడం నేర్పించడం

కూతురు ప్రతి ఒక్కరినీ సంతోషపెట్టాల్సిన అవసరం లేదని చిన్నప్పటి నుంచే అర్థమయ్యేలా చెప్పాలి. తనకు ఇష్టం లేని పని, అసౌకర్యంగా అనిపించే పరిస్థితి లేదా తన హద్దులను దాటే ప్రవర్తన ఎదురైనప్పుడు స్పష్టంగా “నో” అని చెప్పగలగాలి. ఇంట్లో ఆమె అభిప్రాయాన్ని గౌరవించడం ద్వారా ఈ ధైర్యాన్ని పెంచవచ్చు. ఇతరుల ఒత్తిడికి తలొగ్గకుండా తనకు సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యం పెంచాలి.

66
సమాన బాధ్యతలు అప్పగించడం
Image Credit : gemini ai

సమాన బాధ్యతలు అప్పగించడం

అబ్బాయికి ఒక పని, అమ్మాయికి మరో పని అని జెండర్ ఆధారంగా బాధ్యతలు కేటాయించకుండా, ఇంట్లోని పనులను అందరూ కలిసి చేయడం నేర్పాలి. తన గది సర్దుకోవడం, వస్తువులను శుభ్రంగా ఉంచుకోవడం, చిన్నచిన్న ఇంటి పనుల్లో సహాయం చేయడం వంటి బాధ్యతలను కూతురికి అప్పగించాలి. అదే సమయంలో ఇంట్లో అబ్బాయిలకూ ఇదే బాధ్యతలు ఇవ్వాలి. ఇలా పెరిగిన పిల్లలకు ఇంటి పని అంటే ఒక లింగానికి సంబంధించిన పని కాదని, కుటుంబంలో ప్రతి ఒక్కరి బాధ్యత అని అర్థమవుతుంది. కూతురిని జీవితంలో గెలిచేలా తయారు చేయాలంటే ఆమెను కేవలం రక్షించడమే కాకుండా, తనను తాను రక్షించుకునేంత బలంగా తయారు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
చిన్నారుల సంరక్షణ
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Kitchen Tips: బియ్యం, పప్పులు పురుగు పట్టకూడదంటే ఈ చిన్న పని చేయండి!
Recommended image2
Escalator Safety Tips: ఎస్కలేటర్ లో చీర, చెప్పులు ఇరుక్కుంటే ఏం చేయాలి? ఈ తప్పులు మాత్రం చేయకండి
Recommended image3
Sarees: ఫ్లోరల్ ప్రింట్ శారీస్.. డైలీవేర్ కి సూపర్ గా ఉంటాయి!
Related Stories
Recommended image1
Psychology: సైకాలజీ ప్రకారం మీ భర్తలో ఈ 5 లక్షణాలు ఉంటే మీరు నిజంగా అదృష్టవంతులే!
Recommended image2
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం.. ఈ 5 విషయాల్లో ఇతరుల సలహా తీసుకోవడం ప్రమాదకరం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved