MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • చక్కెరను మొత్తమే తినకుంటే ఎన్ని సమస్యలొస్తాయో తెలుసా..?

చక్కెరను మొత్తమే తినకుంటే ఎన్ని సమస్యలొస్తాయో తెలుసా..?

మనలో చాలా మంది తీపి అంటే పడిసచ్చిపోతుంటారు. స్వీట్లను తినకుండా ఒక్కరోజూ కూడా ఉండలేని వారున్నారు. ఇదంతా బాగానే ఉన్నా కొన్ని కారణాల వల్ల చక్కరకు మొత్తమే దూరంగా ఉండాల్సి వస్తుంది. దీనివల్ల ఎన్ని సమస్యలొస్తాయో తెలుసా?  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Nov 20 2022, 04:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మన దేశంలో రోజు రోజకు షుగర్ పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోందని సర్వేలు వెల్లడిస్తున్నాయి.  అయితే డయాబెటీస్ పేషెంట్లు తీపి, చక్కెర పదార్థాలను తక్కువగా తినాలని డాక్టర్లు చెప్తుంటారు. అయితే ఈ వ్యాధిని నివారించాలని చాలా మంది చక్కెరను మొత్తమే తినడం మానేస్తుంటారు. ఇది మంచిదే.. కానీ చక్కెరను పూర్తిగా తినకపోవడం వల్ల మన ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే.. 
 

25
sugar

sugar

చక్కెరలోని రకాలు

సాధారణంగా చక్కెరలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి సహజ చక్కెర. రెండోది ప్రాసెస్ చేయబడ్డ చక్కెర, కొబ్బరి, పైనాపిల్, మామిడి, లీచి వంటి పండ్ల ద్వారా మనకు సహజ చక్కెర లభిస్తుంది. అయితే ప్రాసెస్ చేయబడ్డ చక్కెరను బీట్ రూట్, చెరుకు నుంచి తయారు చేస్తారు. అయితే చక్కెరను మోతాదులో తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి నష్టం ఉండదు. కానీ పూర్తిగా వదులుకుంటేనే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. 

35

చెరుకు, బీట్ రూట్ నుంచి తయారుచేసిన ప్రాసెస్ చేయబడ్డ సుక్రోజ్ లో కేలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. దీనిలో పోషకాలుండవు. కానీ విటమిన్లు, ఖనిజాలు మాత్రం సహజ చక్కెరలో ఎక్కువ మొత్తంలో ఉంటాయి. తీపి పదార్థాలు ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటుంటారు. ఈ అలవాటును పూర్తిగా వదిలేయడం అంత సులువు కాదు. అందులోనూ పూర్తిగా చక్కెరను వదిలేయడం కూడా పాణానికి మంచిది కాదు. ప్రాసెస్ చేయబడిన చక్కెరకు బదులుగా సహజ చక్కెరలను తీసుకోండి.

45

పలు పరిశోధనల ప్రకారం.. అకస్మత్తుగా చక్కెరను తినడం మాసేసిన వాళ్ల శరీరంలో ఎన్నో మార్పులు వచ్చాయట. ముఖ్యంగా వీళ్ల శరీరం చాలా త్వరగా అలసిపోతుందని వెల్లడైంది. అలాగే ఎప్పుడూ తలనొప్పితో ఇబ్బంది పడతారట. చిరాకు కూడా కలుగుతుందట. 

 

55

సహజ చక్కెరను తీసుకోవాలి

సహజ చక్కెరను కూడా తీసుకోకుండా మీ శరీరంపై చెడు ప్రభావం పడుతుంది. ఇదే మీ శరీరానికి శక్తినిచ్చే వనరు. అందుకే దీన్ని తీసుకోవడం మానేస్తే.. మీ శరీరం ఊరికే అలిసిపోతుంది. మీరు చక్కెరను తీసుకున్నప్పుడే మీ శరీరం నుంచి అదనపు ఇన్సులిన్ తగ్గడం ప్రారంభమవుతుంది. అయితే ప్రాసెస్ చేసిన చక్కెరను పూర్తిగా తీసుకోకపోయినా.. సహజ చక్కెరలు లభించే పండ్లను మాత్రం రోజూ తినండి. వీటివల్లే మీ శరీరం తిరిగి శక్తివంతంగా తయారవుతుంది.  

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Spicy Boti Curry: తెలంగాణ స్టైల్లో స్పైసీగా బోటీ కర్రీ ఇలా వండితే రుచి అదిరిపోతుంది, రెసిపీ ఇదిగో
Recommended image2
Chanakya Niti: జీవితంలో సక్సెస్ కావాలంటే.. ఇలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!
Recommended image3
Uric Acid: ఈ డ్రింక్స్ తాగారంటే శరీరంలో యూరిక్ యాసిడ్ తగ్గుతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved