MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Rice vs Chapati vs Jowar Roti: అన్నం, చపాతీ, జొన్న రొట్టె.. వీటిలో రాత్రి భోజనానికి ఏది బెస్ట్?

Rice vs Chapati vs Jowar Roti: అన్నం, చపాతీ, జొన్న రొట్టె.. వీటిలో రాత్రి భోజనానికి ఏది బెస్ట్?

Rice vs Chapati vs Jowar Roti: రాత్రి భోజనం అనగానే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది అన్నమే. కానీ బరువు పెరగకూడదని కొందరు అన్నం మానేసి చపాతీ తింటున్నారు. మరికొందరు జొన్న రొట్టెను ఎంచుకుంటున్నారు. అయితే ఈ మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్టో ఇక్కడ చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Sep 02 2026, 02:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
రాత్రి భోజనానికి ఏ ఫుడ్ బెస్ట్?
Image Credit : AI

రాత్రి భోజనానికి ఏ ఫుడ్ బెస్ట్?

రాత్రి భోజనంలో అన్నం తినాలా? చపాతీ తినాలా? లేక జొన్న రొట్టె తింటే ఆరోగ్యానికి మంచిదా? బరువు తగ్గాలని ప్రయత్నించేవారు, షుగర్ గురించి జాగ్రత్త పడేవారు, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలనుకునేవారు ఈ విషయంలో ఎక్కువగా ఆలోచిస్తుంటారు. మరి దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో.. రాత్రి భోజనంలో ఏం తినడం మంచిదో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
రాత్రి భోజనంలో అన్నం తింటే..
Image Credit : AI

రాత్రి భోజనంలో అన్నం తింటే..

సాధారణంగా చాలామంది రాత్రి భోజనంలో అన్నం తింటుంటారు. అన్నం శరీరానికి శక్తిని అందించే కార్బోహైడ్రేట్లకు మంచి వనరు. అయితే అన్నం ఎంత మోతాదులో తింటున్నామన్నది చాలా ముఖ్యం. పెద్ద ప్లేట్ నిండా అన్నం తీసుకొని, కూర లేదా ప్రోటీన్ తక్కువగా తీసుకోవడం కంటే, అన్నం పరిమాణాన్ని తగ్గించి కూరగాయలు, పప్పు, పెరుగు లేదా ఇతర ప్రోటీన్ ఆహారాలతో కలిపి తినడం మంచిది. ముఖ్యంగా రాత్రి భోజనం చాలా ఆలస్యంగా తినే అలవాటు ఉన్నవారు పరిమాణంపై మరింత శ్రద్ధ పెట్టాలి.

36
చపాతీ విషయానికి వస్తే..
Image Credit : Getty

చపాతీ విషయానికి వస్తే..

గోధుమ పిండితో తయారు చేసే చపాతీ కూడా రాత్రి భోజనానికి మంచి ఎంపిక. చపాతీలో ఫైబర్ ఉంటుంది. ఫైబర్ ఉన్న ఆహారం కడుపు నిండిన భావనను ఎక్కువసేపు కలిగించడంలో సహాయపడుతుంది. అయితే చపాతీపై ఎక్కువ నెయ్యి లేదా వెన్న రాయకుండా, కూరగాయలు, పప్పు వంటి పోషకమైన ఆహారాలతో కలిపి తీసుకోవడం మంచిది.

46
రాత్రిపూట జొన్న రొట్టె తింటే..
Image Credit : AI

రాత్రిపూట జొన్న రొట్టె తింటే..

సాధారణంగా జొన్నను ఎక్కువగా పాలిష్ చేయకుండా తీసుకుంటే శరీరానికి అవసరమైన ఫైబర్, కొన్ని ఖనిజాలు, ఇతర పోషకాలు అందుతాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం.. 100 గ్రాముల జొన్నలో సుమారు 10.22 గ్రాముల ఫైబర్ 9.97 గ్రాముల ప్రోటీన్, అలాగే మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి ఖనిజాలు ఉంటాయి. జొన్నలోని ఫైబర్ కారణంగా ఇది కడుపు నిండిన అనుభూతిని ఎక్కువసేపు కలిగిస్తుంది. అందుకే రాత్రి భోజనంలో అన్నం పరిమాణాన్ని తగ్గించాలనుకునేవారికి జొన్న రొట్టె మంచి ఎంపిక.

56
సమతుల్య భోజనం
Image Credit : Getty

సమతుల్య భోజనం

అయితే రాత్రి భోజనంలో ఏం తింటున్నాం అన్నదానికంటే మొత్తం ప్లేట్ ఎలా ఉందన్నది ముఖ్యం. అన్నం లేదా రొట్టెతో పాటు ఒక మంచి కూరగాయల వంటకం, పప్పు లేదా ఇతర ప్రోటీన్ వనరు, అవసరమైతే పెరుగు తీసుకుంటే భోజనం మరింత సమతుల్యంగా ఉంటుంది. కేవలం రెండు మూడు చపాతీలు లేదా పెద్ద మొత్తంలో జొన్న రొట్టె తిని కూరగాయలు, ప్రోటీన్ లేకుండా భోజనం చేసినా పెద్ద ఫలితం ఉండకపోవచ్చు.

66
మోతాదు ముఖ్యం
Image Credit : stockPhoto

మోతాదు ముఖ్యం

బరువు తగ్గాలనుకునేవారు అన్నాన్ని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. అన్నం తినాలంటే పరిమాణాన్ని నియంత్రించుకోవచ్చు. అలాగే చపాతీ లేదా జొన్న రొట్టెను ఎంచుకున్నా.. ఎక్కువ మొత్తంలో తినకుండా జాగ్రత్తపడాలి. షుగర్ ఉన్నవారు ఆహారాన్ని ఎంచుకునేటప్పుడు కేవలం అన్నం, చపాతీ లేదా జొన్న రొట్టె అనే దాన్ని కాకుండా ఏ రకమైన ధాన్యం, ఎంత పరిమాణం, దాంతో ఏం తింటున్నామనే విషయాలను గమనించుకోవాలి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mangalasutram: 2 గ్రాముల్లో దొరికే లైట్ వెయిల్ షార్ట్ నల్లపూసల చైన్లు
Recommended image2
Shopping: ఆన్ లైన్ కంటే తక్కువ ధరకే చీరలు, కుర్తాలు.. హైదరాబాద్ లో ఈ సీక్రెట్ ప్లేస్ మీకు తెలుసా?
Recommended image3
Nail Polish Hack: నెయిల్ పాలిష్ ఎండిపోయిందని పడేయకండి..ఇలా యూజ్ చేయండి
Related Stories
Recommended image1
Bananas: అరటిపండ్లు కొనేటప్పుడు చాలామంది చేసే 5 తప్పులు ఇవే.. మీరు కూడా చేస్తున్నారా?
Recommended image2
Blackheads: ముఖంపై బ్లాక్ హెడ్స్ పోవాలంటే వీటిని రాస్తే చాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved