Telugu

Hair Growth: జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఈ సింపుల్ రెమిడీస్ ట్రై చేయండి

Telugu

కొబ్బరి నూనె

గోరువెచ్చని కొబ్బరి నూనెతో తలకు నెమ్మదిగా మసాజ్ చేయండి. ఇలా చేస్తే కుదుళ్లు గట్టిపడి, జుట్టు రాలడం తగ్గుతుంది.

Image credits: Getty
Telugu

ఉల్లిపాయ రసం

ఉల్లిపాయ రసాన్ని జుట్టు కుదుళ్లకు పట్టిస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుందని పెద్దలు చెబుతారు. అయితే, మీకు అలర్జీ ఉంటే దీన్ని వాడకండి.

Image credits: Getty
Telugu

మెంతి పేస్ట్

నానబెట్టిన మెంతులను మెత్తగా నూరి తలకు పట్టించండి. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించి, మీ కేశాలను మృదువుగా మారుస్తుంది.

Image credits: Getty
Telugu

బియ్యం కడిగిన నీళ్లు

బియ్యం కడిగిన లేదా నానబెట్టిన నీళ్లను తలకు వాడండి. ఇది జుట్టు చిట్లిపోవడాన్ని తగ్గించి, కేశాలను బలంగా ఉంచుతుంది.

Image credits: Getty
Telugu

ఆవనూనె + కరివేపాకు

ఆవనూనెలో కరివేపాకు వేసి మరిగించి తలకు రాసుకోండి. ఈ పాతకాలపు చిట్కా జుట్టుకు మంచి పోషణ ఇచ్చి, బలంగా మారుస్తుంది.

Image credits: Getty
Telugu

కలబంద గుజ్జు

కలబంద గుజ్జును తలకు రాసుకుంటే చర్మం చల్లగా, ఆరోగ్యంగా ఉంటుంది. ముందుగా కొద్దిగా రాసుకుని, అలర్జీ రాకపోతేనే వాడండి.

Image credits: Getty
Telugu

మందారం

మందారం పూలు, ఆకులను మెత్తగా నూరి హెయిర్ మాస్క్ లా వేసుకోండి. ఇది జుట్టు పల్చబడటాన్ని ఆపి, కుదుళ్లకు బలాన్ని ఇస్తుంది.

Image credits: Getty

Footwear: తక్కువ ధరలో వచ్చే బెస్ట్ స్టైలిష్ చెప్పులు.. ఇవిగో!

Gold Studs: 2 గ్రాముల్లోనే వచ్చే గోల్డ్ చెవి కమ్మలు

Silver Mettelu: ఈ అందమైన మెట్టెలు చూస్తే ఫిదా అయిపోతారు

Aloe Vera: కలబందను ఇలా వాడితే మీ అందం రెట్టింపు కావడం పక్కా!