Health Tips: వర్షాకాలంలో అరటి పండ్లను తినొచ్చా?
Health Tips: సీజన్లతో సంబంధం లేకుండా చవకగా లభించే అరటిపండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే వీటిని వర్షాకాలంలో తినొచ్చా లేదా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. మరి దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే..?

అరటి పండు తొక్కతో సహా మనకు ఎన్నో విధాలా ఉపయోగపడుతుంది. అరటి పండు ఆరోగ్యాన్నే కాదు అందానికి కూడా మెరుగులు దిద్దుతుంది. అందులోనూ ఈ పండు అన్ని సీజన్లలో మనకు అందుబాటులో ఉంటాయి. అరటిపండ్లలో ఉండే పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. అయితే ఈ పండ్లను వర్షాకాలంలో తినకూడదని కొంతమంది భావిస్తారు. మరి దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
వర్షాకాలంలో అరటిపండును తినొచ్చా?
వర్షకాలంలో గాలి ద్వారా, నీటి ద్వారా, తినే ఫుడ్ ద్వారా ఎన్నో రకాల అంటురోగాలు, ఇతర రోగాలు చుట్టుకునే ప్రమాదం ఎక్కువగా ఉంది. అందుకే తినే ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వర్షాకాలంలో కూడా అరటిపండ్లను ఎలాంటి భయాలు లేకుండా తినొచ్చు. ఇవి శరీరానికి ఎన్నో విధాల ఉపయోగపడతాయి. అయితే తినేటప్పుడు కొన్ని విషయాలను అవగాహనలో ఉంచుకోవాలి.
అరటిని తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి
అరటి పండులో మెగ్నీషియం, అమైనో ఆమ్లాలు, పొటాషియం, విటమిన్ సి, విటమిన్ బి6, మాంగనీస్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండును రోజూ తినడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. అలాగే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. గుండె ఆరోగ్యంగా, ఫిట్ గా కూడా ఉంటుంది. అలాగే స్ట్రోక్ ప్రమాదం కూకడా తగ్గుతుంది. అయితే ఈ పండ్లను కొన్ని తప్పు సమయాల్లో తింటే మంచి కంటే ఎక్కువ చెడే జరుగుతుంది.
ఆయుర్వేదం ప్రకారం.. అరటి పండ్లను ఏ సీజన్ లోనైనా తినొచ్చు. అయితే ఖాళీ కడుపుతో, సాయంత్రం, రాత్రి పూట తింటే మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
అరటి పండ్లను ఏయే సమయాల్లో తినకూడదు?
ఉబ్బసం, దగ్గు, అజీర్థి సమస్యలతో బాధపడేవారు అరటిపండ్లను రాత్రిపూట మాత్రం తినకూడదు. ఎందుకంటే ఇది కఫ దోషాన్ని ఎక్కువ చేయడంతో పాటుగా శరీరంలో శ్లేష్మం ఏర్పడేలా చేస్తుంది. అలాగే శరీరాన్ని బద్దకంగా చేస్తుంది. రాత్రి సమయంలో అరటి పండ్లలోని ప్రోటీన్లు సరిగ్గా అరగవు. అందుకే వీటిని పగటి పూట మాత్రమే తినాలి. అప్పుడే దీనిలో ఉండే ఫైబర్, ప్రోటీన్లు జీర్ణం అవడానికి తగిన సమయం ఉంటుంది.
అరటిని ఖాళీ కడుపుతో తినొచ్చా?
అరటిపండ్లనెప్పుడూ ఖాళీ కడుపుతో తినకూడదు. ఎందుకంటే దీని వల్ల యాసిడ్ రిఫ్లక్స్ తీవ్రతరం అవుతుంది. అంతేకాదు దీనిలో ఉండే విటమిన్ సి వల్ల హైపర్ ఎసిడిటీ బారిన పడతారు. అలాగే దీనిలో ఉండే పొటాషియం గుండె సంబంధిత రోగాలు, అధిక రక్తపోటు సమస్యలున్నవారికి ప్రమాదకరం. అందుకే అరటిపండునెప్పుడూ మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ తర్వాత లేదా మధ్యాహ్నం భోజనం తర్వాత తినడం బెటర్.
వీటితో కలిపి తినకూడదు
ఆయుర్వేదం ప్రకారం.. అరటిపండ్లనెప్పుడూ పాలు లేదా పాల ఉత్పత్తులతో కలిపి తినకూడదు. ఈ రెండు కలయికలు విషంగా మారుతాయి. ఇది అజీర్థికి దారితీస్తుంది. జీర్ణవ్యవస్థ పనితీరు దెబ్బతింటుంది. అలాగే శ్లేష్మం ఉత్పత్తి యాసిడ్ రిఫ్లక్స్ కు కారణమవుతుంది. కఫదోషం కూడా తీవ్రంగా మారుతుంది. అందుకే అరటిపండ్లను విడిగానే తినాలి.
మొత్తంగా..
వర్షకాలంలో సీజన్ వ్యాధులు, దగ్గు, జలుబు, జ్వరం, ఫ్లూ, జీర్ణ సమస్యలు రావడం సర్వసాధారణం. ఇలాంటి సమయంలో అరటిపండ్లను తప్పుడు కాంబినేషన్ లో లేదా తప్పుడు సమాయాల్లో తింటే రోగనిరోధక శక్తిపై, జీవక్రియపై ప్రతికూల ప్రభావం పడుతుంది.