MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • జుట్టు విషయంలో ఈ తప్పులు చేయకండి.. లేదంటే జుట్టు దారుణంగా ఊడిపోతుంది..

జుట్టు విషయంలో ఈ తప్పులు చేయకండి.. లేదంటే జుట్టు దారుణంగా ఊడిపోతుంది..

చుండ్రు, జుట్టు ఊడిపోవడం కొన్ని ప్రత్యేక కారణాల వల్లే అవుతాయి. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే చుండ్రు, హెయిర్ ఫాల్ సమస్యల నుంచి సులువుగా బయటపడొచ్చు.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 21 2022, 01:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నెత్తిలో చుండ్రు ఉంటే పక్కాగా జుట్టు రాలిపోతుంది. అయినా ఈ రోజుల్లో చాలా మంది హెయిర్ ఫాల్, చుండ్రు సమస్యలతో బాధపడుతున్నారు. అయితే నెత్తిలో చుండ్రు ఏర్పడటానికి, జుట్టు రాలడానికి కారణాలు చాలానే ఉన్నాయి. కొన్ని టిప్స్ ను ఫాలో అయితే ఆ సమస్యల నుంచి బయటపడొచ్చు. అవేంటో తెలుసుకుందాం పదండి. 

26
hair

hair

తడి జుట్టును దువ్వకూడదు

కొంతమందికి స్నానం చేసిన వెంటనే నెత్తిని దువ్వుకునే అలవాటు ఉంటుంది. కానీ ఇది మీ జుట్టు ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ప్రతిరోజూ తడి జుట్టును దువ్వుకుంటే జుట్టు విపరీతంగా రాలిపోతుంది. ఎందుకంటే తడి వెంట్రుకల మొదళ్లు బలహీనంగా ఉంటాయి. అలాగే తడి జుట్టును హెయిర్ డ్రయ్యర్ తో ఆరబెట్టడం మంచిది కాదు. ఇది కూడా జుట్టు రాలిపోవడానికి దారితీస్తుంది. 
 

36

జుట్టును కత్తిరించుకోవడం

జుట్టు చివర్లను అప్పుడప్పుడు కట్ చేయండి. రోజూ కాకపోయినా.. ప్రతి మూడు నెలలకు ఒకసారైనా జుట్టును పక్కాగా కట్ చేయండి. దీనివల్ల జుట్టు చివర్లు పగిలిపోకుండా  ఉంటాయి. దీంతో జుట్టు ఫాస్ట్ గా పెరుగుతుంది. జుట్టు చివర్లు పగిలిపోతే.. జుట్టు పెరిగే అవకాశమే ఉండదు. 
 

46

ప్రతిరోజూ షాంపూ పెట్టకండి

జుట్టుకు షాంపూ పెట్టడం మంచిదే. కానీ రెగ్యులర్ గా షాంపూను అస్సలు పెట్టకూడదు. జుట్టుకు రోజూ షాంపూ పెట్టడం వల్ల జుట్టు బాగా ఊడిపోతుంది. డ్రైగా కూడా మారుతుంది. అందుకే వారానికి రెండు లేదా మూడు రోజులు మాత్రమే షాంపూను ఉపయోగించండి. షాంపూను పెట్టిన తర్వాత కండీషనర్ ను ఖచ్చితంగా ఉపయోగించండి. అయితే మీ జుట్టును బట్టి కండీషనర్ ను ఎంచుకోండి. కలర్ ప్రొటెక్షన్ ఉన్న షాంపూను, కండీషనర్ ని మాత్రమే ఉపయోగించండి. 

56
hair fall

hair fall

మార్కెట్ లోకి వచ్చిన కొత్త కొత్త హెయిర్ ప్రొడక్ట్స్ ను జుట్టుకు పెట్టుకోవాలని చాలా మందికి ఉంటుంది. అయితే వీటిని యూజ్ చేసే ముందు అలెర్జీ టెస్ట్ తప్పకుండా చేయాలి. వీటివల్ల మీ చర్మం, మీ జుట్టు పాడవకుండా ఉండాలంటే ఈ విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒకవేళ అలెర్జీకి కారణమయ్యే ఉత్పత్తులు ఉంటే వాటిని అసలే ఉపయోగించకూడదు.

66

అతిగా నూనెను అప్లై చేయకూడదు

నూనె జుట్టుకు పోషణనిస్తుంది. తేమగా ఉండేట్టు చూస్తుంది. అందుకే జుట్టుకు ఖచ్చితంగా నూనెను అప్లై చేయాలని నిపుణులు చెబుతున్నారు. అలాగని జుట్టుకు నూనెను అతిగా పెట్టకూడదు. అయినా కొంతమంది రోజూ జుట్టుకు నూనె పెడుతుంటారు. ఇలా పెట్టాల్సిన అవసరం లేనేలేదు. ఒక వేళ మాడు పొడిబారితే కొద్దిగా నూనె తీసుకుని మసాజ్ చేయండి. కొబ్బరి నూనె వాడితే మంచిది. 
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
హైదరాబాద్ మామిడి పళ్లలో ఎంత విషం ఉంటుందో తెలుసా..? తిన్నారో అంతే సంగతి..
Recommended image2
Dandruff: చుండ్రుతో విసిగిపోయారా? ఈ చిట్కాలతో ఈజీగా వదిలించుకోండి
Recommended image3
Mango Recipe: శ్రీకాకుళం స్టైల్ మామిడి ముక్కలు, ఇలా చేస్తే ఏళ్ల పాటు పాడవు, రుచి కూడా డబుల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved