Beauty Tips: పసుపులో ఈ రెండూ కలిపి రాస్తే... నిమిషాల్లో ముఖంలో గ్లో.. ఫేషియల్ అవసరమే రాదు
Beauty Tips: పండగ లేదా ఏదైనా ఫంక్షన్ ఉంటే.. ఖరీదైన ఫేషియల్స్ చేయించుకుంటున్నారా? అయితే, ఇక నుంచి ఖర్చు లేకుండా.. ఇంట్లో ఫేషియల్ లాంటి గ్లో తెచ్చుకోవచ్చు. దానికి పసుపు ఉంటే చాలు.

Turmeric Face Pack
మన అందరి ఇంట్లో పసుపు చాలా సులభంగా దొరుకుతుంది. అమ్మమ్మల నాటి నుంచి పసుపును కేవలం వంటకు మాత్రమే కాకుండా.. అందానికి కూడా వాడుతూ వస్తున్నాం. అయితే, దీనిని ఎలా వాడాలి? దేనితో కలిపి వాడాలి అనే విషయం మాత్రం కచ్చితంగా తెలుసుకోవాలి. కొద్ది రోజుల క్రితం ఇన్ స్టాగ్రామ్ లో ఒక ఫేస్ మాస్క్ బాగా వైరల్ అయ్యింది. అదే కోరా పసుపు మాస్క్. పసుపుతో చేసే ఈ మాస్క్ నిజంగా ముఖానికి అందాన్ని తెస్తుందా? ఈ మాస్క్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..
కోరా పసుపు ఫేస్ మాస్క్...
బాణలిలో వేయించిన పసుపు, తేనె, రోజ్ వాటర్ కలిపి తయారు చేసే ఫేస్ ప్యాక్ ఇది. దీనిని ముఖానికి రాసుకొని 15 నిమిషాల తర్వాత నీటితో ముఖాన్ని శుభ్రం చేస్తే చాలు.. ముఖానికి మంచి గ్లో వస్తుందని వైరల్ వీడియోలో చెప్పారు. ఇంట్లో ఉండే తక్కువ ఖర్చు పదార్థాలతో, మన పాతకాలపు పద్ధతుల్లో ఉండేలా అనిపించడంతో ఈ చిట్కా అందరినీ ఆకట్టుకుంటోంది.
ఈ మాస్క్ ఎలా తయారు చేయాలి?
కావాల్సిన పదార్థాలు:
వేయించిన పసుపు – 1 స్పూన్
తేనె – 1 స్పూన్
రోజ్ వాటర్ – 1 నుండి 2 స్పూన్లు
చేసే విధానం:
ముందుగా పసుపును బాణలిలో పొడిగా వేయించి, పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన పసుపులో తేనె వేసి, ఆపై పేస్ట్‌లా అయ్యేంత వరకు కొద్దికొద్దిగా రోజ్ వాటర్ పోస్తూ కలపాలి. ముఖం కడుక్కున్నాక, కళ్లు పెదవుల చుట్టూ తప్పించి మిగతా ముఖమంతటా పల్చగా అప్లై చేయాలి. కొద్దిసేపు ఉంచుకుని తర్వాత, గోరువెచ్చని నీటితో కడిగేయాలి.
ఈ మాస్క్ తో ప్రయోజనాలు..
పసుపులో ఉండే గుణాలు చర్మంఎర్రబడటం, వాపు తగ్గడానికి సాయపడతాయి. ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం తక్షణమే మృదువుగా, తేమగా మారి మెరుస్తూ కనిపిస్తుంది. చర్మానికి తగిన పదార్థాలు వాడితే ఫేస్ ప్యాక్‌లు మంచి ఫలితాన్ని ఇస్తాయని డెర్మటాలజీ నిపుణులు కూడా చెబుతున్నారు. పసుపులోని 'కర్క్యుమిన్' అనే అంశం చర్మానికి హాని చేసే కణాలతో పోరాడి, చర్మం త్వరగా ముడతలు పడకుండా చూస్తుంది.
ఈ ఫేస్ మాస్క్ ముఖానికి వాడే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
మీది బాగా సున్నితమైన చర్మం అయినా, త్వరగా మంట వస్తున్నా జాగ్రత్తగా ఉండాలి.ఈ ఫేస్ మాస్క్ ని ముఖానికి రాసే ముందు చేతి మీద లేదా మెడ మీద కొద్దిగా రాసి పరీక్షించండి. మంట లేదా దురద అనిపిస్తే వెంటనే కడిగేయండి. చర్మంపై గాయాలు ఉన్నా, చర్మం మండుతున్నా ఈ ప్యాక్ వేసుకోకూడదు.

