MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Jobs
  • Jobs : తెలుగమ్మాయిలకు లక్కీ ఛాన్స్.. కేవలం పది పాసైతే చాలు, సొంత గ్రామంలో గవర్నమెంట్ జాబ్

Jobs : తెలుగమ్మాయిలకు లక్కీ ఛాన్స్.. కేవలం పది పాసైతే చాలు, సొంత గ్రామంలో గవర్నమెంట్ జాబ్

తెలుగమ్మాయిలకు బంపరాఫర్… కేవలం పదో తరగతి చదివుంటే చాలు సొంత ఊళ్లోనే ఉద్యోగం చేసే అవకాశం వచ్చింది. ఈ జాబ్ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Arun Kumar P
Published : Sep 07 2026, 09:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఏపీలో ఆశా వర్కర్ జాబ్స్
Image Credit : Gemini AI

ఏపీలో ఆశా వర్కర్ జాబ్స్

Asha Worker Jobs : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ తెలిపింది. ఆశా కార్యకర్తలుగా పనిచేయాలనుకునే మహిళలకు ఇదే మంచి అవకాశం... రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 913 ఆశా వర్కర్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. తాజా నియామకాల ప్రక్రియ పూర్తయితే రాష్ట్రవ్యాప్తంగా ఆశా కార్యకర్తల పోస్టులన్నీ భర్తీ చేసినట్లవుతుందని మంత్రి తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో ఆశా కార్యకర్తలు కీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణులు, చిన్నారులు, కుటుంబ సంక్షేమం, టీకాలు, ఆరోగ్య అవగాహన వంటి అంశాల్లో వారు ప్రజలకు, ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థకు మధ్య వారధిగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి Zero Vacancy (జీరో వేకెన్సీ) విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 1,294 ఆశా పోస్టులను భర్తీ చేసినట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. తాజాగా మరో 913 పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వడంతో మొత్తం 2,207 ఆశా వర్కర్ పోస్టులను భర్తీ చేసినట్లవుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సెప్టెంబర్ 30లోగా నియామక ప్రక్రియ పూర్తి
Image Credit : Gemini AI

సెప్టెంబర్ 30లోగా నియామక ప్రక్రియ పూర్తి

తాజాగా భర్తీ చేయనున్న 913 పోస్టుల్లో అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల్లో 673 పోస్టులు ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో 64, పట్టణ ప్రాంతాల్లో 176 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నియామక ప్రక్రియను చేపట్టనున్నారు.

జిల్లా కలెక్టర్ అధ్యక్షతన పనిచేసే డిస్ట్రిక్ హెల్త్ సొసైటీ ఆధ్వర్యంలో నియామకాలు జరగనున్నాయి. సంబంధిత గ్రామం లేదా వార్డుకు చెందిన స్థానిక మహిళలకు ఈ నియామకాల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. కనీసం పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు 25 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసున్న మహిళలు అర్హులుగా పరిగణించనున్నారు.

ఆశా వర్కర్ నియామకాలకు సంబంధించి అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లాలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్ బాబు తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి ఈ నెల 30వ తేదీలోగా నియామకాల జాబితాను పంపించాలని జిల్లాలను ఆదేశించినట్లు వెల్లడించారు.

Related Articles

Related image1
Jobs: ఇక‌పై తెలంగాణ యువ‌త‌కు జ‌పాన్‌లో ఉద్యోగాలు.. ప్ర‌భుత్వం కీలక నిర్ణ‌యం
Related image2
Bank Jobs : రాతపరీక్ష లేదు, కేవలం ఇంటర్వ్యూతోనే బ్యాంక్ జాబ్.. ఒకటిరెండు కాదు 2049 పోస్టులు
34
జిల్లాల వారీగా ఖాళీల వివరాలు
Image Credit : Asianet News

జిల్లాల వారీగా ఖాళీల వివరాలు

తాజాగా భర్తీ చేయనున్న ఆశా కార్యకర్తల పోస్టులు వివిధ జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి. జిల్లాల వారీగా ఖాళీల సంఖ్యను పరిశీలిస్తే.. అనకాపల్లిలో అత్యధికంగా 77 పోస్టులు, కర్నూలులో 65, తూర్పుగోదావరిలో 44, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 43, పార్వతీపురం మన్యంలో 43, పశ్చిమగోదావరిలో 42 పోస్టులు ఉన్నాయి. అలాగే అన్నమయ్య జిల్లాలో 41, ప్రకాశంలో 38, వైఎస్సార్ కడపలో 38, కృష్ణాలో 37, విశాఖపట్నంలో 33, చిత్తూరులో 32, కోనసీమలో 32, పల్నాడులో 31, విజయనగరంలో 31, కాకినాడలో 29, ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరులో 29, ఏలూరులో 27 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక

అనంతపురంలో 26, మార్కాపురంలో 25, శ్రీ సత్యసాయి జిల్లాలో 22, శ్రీకాకుళంలో 22, గుంటూరులో 21, నంద్యాలలో 21, పోలవరంలో 21, తిరుపతిలో 21, ఎన్టీఆర్ జిల్లాలో 15, బాపట్లలో 7 పోస్టుల చొప్పున భర్తీ చేయనున్నారు.

44
శాలరీ ఎంత?
Image Credit : Asianet News

శాలరీ ఎంత?

ఆశా కార్యకర్తలకు ప్రస్తుతం నెలకు రూ.10,000 చొప్పున వేతనం అందుతోంది. ఇందులో రూ.8,320 రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి చెల్లిస్తుండగా, మిగిలిన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఆశా కార్యకర్తలకు ప్రతి ఏడాది వేతనాల కోసం సుమారు రూ.513 కోట్ల వరకు ఖర్చు అవుతోంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.426.84 కోట్ల వరకు భరిస్తుండగా, మిగిలిన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తోంది.

కొత్తగా 913 పోస్టుల భర్తీతో రాష్ట్రంలోని ఆరోగ్య సేవలను మరింత విస్తరించడంతో పాటు గ్రామీణ, గిరిజన, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు మరింత చేరువయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఉద్యోగాలు, కెరీర్
ఆంధ్ర ప్రదేశ్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bank Jobs : రాతపరీక్ష లేదు, కేవలం ఇంటర్వ్యూతోనే బ్యాంక్ జాబ్.. ఒకటిరెండు కాదు 2049 పోస్టులు
Recommended image2
Jio IPO: అంబానీ మెగా ప్లాన్.. డబ్బులు రెడీ చేసుకోండి.. దసరాకో దీపావళికో బంపర్ ఆఫర్
Recommended image3
Layoffs: ప్ర‌శ్నార్థ‌కంగా ఐటీ ఉద్యోగుల భ‌విత‌వ్యం.. ల‌క్ష‌ల ఉద్యోగాలు మ‌టాష్
Related Stories
Recommended image1
Jobs: ఇక‌పై తెలంగాణ యువ‌త‌కు జ‌పాన్‌లో ఉద్యోగాలు.. ప్ర‌భుత్వం కీలక నిర్ణ‌యం
Recommended image2
Bank Jobs : రాతపరీక్ష లేదు, కేవలం ఇంటర్వ్యూతోనే బ్యాంక్ జాబ్.. ఒకటిరెండు కాదు 2049 పోస్టులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved