MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Jobs
  • Bank Jobs : రాతపరీక్ష లేదు, కేవలం ఇంటర్వ్యూతోనే బ్యాంక్ జాబ్.. ఒకటిరెండు కాదు 2049 పోస్టులు

Bank Jobs : రాతపరీక్ష లేదు, కేవలం ఇంటర్వ్యూతోనే బ్యాంక్ జాబ్.. ఒకటిరెండు కాదు 2049 పోస్టులు

బ్యాంక్ ఆఫ్ బరోడా అనుబంధ సంస్థ అయిన బరోదా గ్లోబల్ షేర్డ్ సర్వీసెస్ లిమిటెడ్ (బీజీఎస్ఎస్ఎల్) ఉద్యోగాల భర్తీకి సిద్దమయ్యింది. దేశవ్యాప్తంగా 2,049 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

3 Min read
Author : Arun Kumar P
Published : Sep 05 2026, 03:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్
Image Credit : Gemini AI

బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్

Bank of Baroda Recruitment 2026 : బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన అనుబంధ సంస్థ బరోడా గ్లోబల్ షేర్డ్ సర్వీసెస్ లిమిటెడ్ (BGSSL) భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 2,049 పోస్టులను భర్తీ చేయనున్నారు. అనుభవం ఉన్నవాళ్లకే కాదు కొత్తవాళ్లకు కూడా ఇందులో అవకాశాలు ఉన్నాయి. బీజీఎస్ఎస్ఎల్ జారీ చేసిన సంక్షిప్త నోటిఫికేషన్ ప్రకారం... కలెక్షన్, డిజిటల్ బ్యాంకింగ్, గ్లోబల్ ట్రేడ్ సర్వీసెస్, రిటైల్ సేల్స్, హ్యూమన్ రిసోర్సెస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫీల్డ్ కలెక్షన్, డిజిటల్ ఆన్‌బోర్డింగ్, ఆధార్ ఆపరేషన్స్ వంటి పలు విభాగాల్లో ఈ నియామకాలు జరగనున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 1న ప్రారంభమైంది.

భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు

అప్రెంటిస్ (టెలీ కాలింగ్) - 150 పోస్టులు

టెలీ కలెక్షన్ ఏజెంట్ (లోన్ రికవరీ ఏజెంట్) - 100 పోస్టులు

ఎగ్జిక్యూటివ్ ఏటీఎం-రీకన్సిలియేషన్-కంప్లైంట్-డెబిట్ కార్డ్ - 40 పోస్టులు

ఎగ్జిక్యూటివ్ ట్రేడ్ ఫైనాన్స్ ఆపరేషన్స్ - 25 పోస్టులు

ఎగ్జిక్యూటివ్ కాసా-ఎఫ్‌సీఎన్ఆర్ కాలింగ్ - 40 పోస్టులు

ప్రొక్యూర్‌మెంట్ మేనేజర్ - 1 పోస్టు

ఎంఐసీ అనలిస్ట్ - 3 పోస్టులు

డిప్యూటీ మేనేజర్ హెచ్‌ఆర్ & అడ్మిన్ - 1 పోస్టు

ఎగ్జిక్యూటివ్-సీనియర్ ఎగ్జిక్యూటివ్ (మేకర్స్) - 20 పోస్టులు

డెస్క్‌టాప్ సపోర్ట్ అనలిస్ట్ - 1 పోస్టు

ఫీల్డ్ కలెక్షన్ ఆఫీసర్ - 1 పోస్టు

ఎం-డీఎం లీడ్స్ టెలీ కలెక్షన్ - 6 పోస్టులు

ఎం-డిప్యూటీ మేనేజర్ ఎల్&డి - 1 పోస్టు

ఎగ్జిక్యూటివ్ డెబిట్ కార్డ్ ఆపరేషన్స్ - 10 పోస్టులు

ఫీల్డ్ కలెక్షన్ ఆఫీసర్ - 400 పోస్టులు

డిజిటల్ ఆన్‌బోర్డింగ్ స్పెషలిస్ట్ (పార్ట్ టైమ్) - 400 పోస్టులు

సేల్స్ ఆఫీసర్ ఏఎస్ఎం-ఆర్ఎస్ఎం - 350 పోస్టులు

ఆధార్ ఆపరేటర్ (పార్ట్ టైమ్) - 400 పోస్టులు

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సెప్టెంబర్ 30 వరకు దరఖాస్తు గడువు
Image Credit : Getty

సెప్టెంబర్ 30 వరకు దరఖాస్తు గడువు

బీజీఎస్ఎస్ఎల్ రిక్రూట్‌మెంట్ 2026 కోసం దరఖాస్తుల ప్రక్రియ సెప్టెంబర్ 1న మొదలైంది. అభ్యర్థులు సెప్టెంబర్ 30, 2026 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించాలి. అభ్యర్థులు తమ అప్‌డేటెడ్ రెజ్యూమెను recruitment@bgss.in అనే ఈ-మెయిల్ ఐడీకి కూడా పంపవచ్చు. గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను స్వీకరించరు.

35
అర్హతలు
Image Credit : Gemini AI

అర్హతలు

ఈ రిక్రూట్‌మెంట్‌లో అన్ని పోస్టులకు ఒకేరకమైన విద్యార్హత లేదు. పోస్టును బట్టి అర్హతలను నిర్ణయించారు. డిగ్రీ, పీజీ, ఎంబీఏ, సీఏ, సీఎస్ లేదా ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్నవాళ్లు వివిధ పోస్టులకు అర్హులు. చాలా ఎగ్జిక్యూటివ్, మేనేజర్ పోస్టులకు సంబంధిత రంగంలో పని అనుభవం తప్పనిసరి. అభ్యర్థులు తాము అప్లై చేసే పోస్టుకు కావాల్సిన విద్యార్హత, అనుభవం, వయోపరిమితి వంటి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను క్షుణ్ణంగా చదవడం మంచిది. ఎందుకంటే వయోపరిమితి కూడా పోస్టును బట్టి మారుతుంది.

కెరీర్‌లో కొంతకాలం విరామం తీసుకుని మళ్లీ ఉద్యోగాల్లో చేరాలనుకునే అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తామని బీజీఎస్ఎస్ఎల్ తన నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. అయితే వారు కూడా సంబంధిత పోస్టుకు కావాల్సిన అర్హతా ప్రమాణాలను తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఈ నియామక ప్రక్రియలో వివిధ రకాల అనుభవం, నైపుణ్యాలు ఉన్నవారికి తగిన పోస్టులు ఉన్నాయి. కాబట్టి అప్లై చేసే ముందు సంబంధిత పోస్టుకు కావాల్సిన అర్హతలను జాగ్రత్తగా చూసుకోండి.

45
ఎంపిక ప్రక్రియ, జీతం
Image Credit : Freepik

ఎంపిక ప్రక్రియ, జీతం

బీజీఎస్ఎస్ఎల్ రిక్రూట్‌మెంట్ 2026 కోసం ఎంపిక ప్రక్రియ పోస్టును బట్టి మారుతుంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ముందుగా అభ్యర్థుల దరఖాస్తులు, రెజ్యూమెలను పరిశీలిస్తారు. ఆ తర్వాత, పోస్టుకు ఉన్న అవసరాలు, అభ్యర్థి అర్హతల ఆధారంగా షార్ట్‌లిస్ట్ తయారు చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఎంపిక ప్రక్రియలో భాగంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా ఉంటుంది. నోటిఫికేషన్‌లో రాతపరీక్ష గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. అంటే, చాలా పోస్టులకు దరఖాస్తుల పరిశీలన, షార్ట్‌లిస్టింగ్ తర్వాత కేవలం ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది.

55
బీజీఎస్ఎస్ఎల్ జాబ్స్ కు ఎలా అప్లై చేయాలి?
Image Credit : Gemini AI

బీజీఎస్ఎస్ఎల్ జాబ్స్ కు ఎలా అప్లై చేయాలి?

బీజీఎస్ఎస్ఎల్ జాబ్స్ కు అప్లై చేయడానికి, బీజీఎస్ఎస్ఎల్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.

కెరీర్ విభాగాన్ని ఓపెన్ చేయండి.

ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు చూసి, మీ అర్హతకు సరిపోయే పోస్టును ఎంచుకోండి.

ఆ తర్వాత, అర్హతా ప్రమాణాలు, జాబ్ డిస్క్రిప్షన్‌ను పూర్తిగా చదవండి.

అప్‌డేటెడ్ రెజ్యూమె, అవసరమైన డాక్యుమెంట్లను సిద్ధం చేసుకుని, బీజీఎస్ఎస్ఎల్ సూచించిన పద్ధతిలో దరఖాస్తును సమర్పించండి.

నోటిఫికేషన్‌లో చెప్పినట్లుగా recruitment@bgss.in కు మీ రెజ్యూమెను ఈ-మెయిల్ చేసే ఆప్షన్ కూడా ఉంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఉద్యోగాలు, కెరీర్
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
హైద‌రాబాద్‌లో సంద‌డి చేసిన హ్యుమ‌నాయిడ్ రోబోట్‌.. ఘ‌నంగా ఏఐ ఎడ్యుకేష‌న్ స‌మ్మిట్
Recommended image2
Government Jobs : తెలుగు యువతా బి రెడీ .. భారీ జాబ్ నోటిఫికేషన్ రాబోతోంది
Recommended image3
Government Jobs : నెలకు రూ.86,570 జీతం.. కేవలం పదో తరగతి, ఐటిఐ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు
Related Stories
Recommended image1
Bank: మీకు ఈ బ్యాంకులో అకౌంట్ ఉందా? అక్టోబ‌ర్ 1 నుంచి మ‌నీ విత్‌డ్రాపై ఛార్జీలు
Recommended image2
Bank Jobs : ప్రభుత్వ బ్యాంకులో జాబ్ సాధించాలని కలగంటున్నారా? అయితే ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved