MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Health
  • జ్ఞాపకశక్తి పెరగాలా? అయితే రోజూ వీటిని తినండి

జ్ఞాపకశక్తి పెరగాలా? అయితే రోజూ వీటిని తినండి

జ్ఞాపకశక్తిని పెంచుకోవాలని ఎన్నో ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే కొన్నింటిని తింటూ కూడా మెమోరీ పవర్ ను పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు.   

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 15 2023, 04:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

జ్ఞాపకశక్తి ఎప్పుడూ ఒకేలా ఉండదు. వయసు పెరుగుతుంటే.. జ్ఞాపకశక్తి  తగ్గుతూ వస్తుంది. ఇది చాలా సహజం. దీనివల్ల విషయాలు గుర్తిండవు. మాట్లాడుతూ.. మాట్లాడుతూ విషయాలను మర్చిపోతుంటారు. అయితే మతిమరుపు సమస్య పెద్దవయసు వారిలోనే కాదు యువతలో కూడా కనిపిస్తుంది. అయితే మెమోరీ పవర్ ను పెంచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలను చేస్తుంటారు.కానీ తింటూ కూడా మెమోరీ పవర్ ను పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు. అదెలాగంటే.. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
cabbage

cabbage

మెమోరీ పవర్ ను పెంచేందుకు క్యాబేజీ, బ్రోకలీ, ఉల్లిపాయ, టర్నిప్ వంటి కూరగాయలు కూడా ఎంతో సహాయపడతాయి. ఈ కూరగాయల్లో ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడును ఆరోగ్యంగా ఉంచి.. మెమోరీ పవర్ ను పెంచేందుకు సహాయపడతాయి. 

38
Image: Getty

Image: Getty

బీన్స్, కొవ్వు చేపలు, పెరుగు, పాలు, చిక్కుళ్లు, గుమ్మడికాయ విత్తనాలు, బార్లీ, ఓట్స్, గోధుమల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. వీటిని మీ రోజువారి ఆహారంలో చేర్చుకుంటే మీ మెమోరీ పవర్ బాగా పెరుగుతుంది. 

48

బచ్చలికూర, క్యారెట్లు, మొలకలు, చిలగడదుంపలు వంటి ఆహార పదార్థాల్లో కెరోటినాయిడ్లు అని పిలిచే మూలకం ఎక్కువగా ఉంటుంది. ఈ కూరగాయలను తీసుకోవడం వల్ల మీ మెమోరీ పవర్ బాగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే వీటిని రోజూ తినండి. 

58

సోయాబీన్స్, గుడ్డులోని పచ్చసొన, నువ్వులు, తృణధాన్యాల్లో లెసిథిన్ అనే పోషకం ఎక్కువగా ఉంటుంది. వీటిని తింటే కూడా మీ మెదడు పనితీరు మెరుగుపడుతుంది. అలాగే మీ మెమోరీ పవర్ కూడా బాగా పెరుగుతుంది. 

68

చేపలు, గుడ్లు, చికెన్, పాలు వంటి విటమిన్ బి12 పుష్కలంగా ఉండే ఆహారాలు కూడా మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా రోగనిరోధక శక్తిని పెంచడం, మెమోరీ పవర్ ను పెంచడానికి సహాయపడతాయి. 

78

సిట్రస్ పండ్లు అయిన నిమ్మకాయ, ఉసిరి, నారింజ వంటి పండ్లతో పాటుగా క్యాప్సికమ్, ఆకుకూరల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి తింటే మీ ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటుగా మీ మెమోరీ పవర్ కూడా బాగా పెరుగుతుంది. అలాగే మెదడు మరింత మెరుగ్గా పనిచేస్తుంది. 
 

88
cashew

cashew

జీడిపప్పు, అంజీర, బాదం పప్పు, వాల్ నట్స్ వంటి గింజల్లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. వీటిని తింటే కూడా మన మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. మెదడు పనితీరు మెరుగుపడుతుంది. మెమోరీ పవర్ పెరుగుతుంది. రోజూ గుప్పెడు గింజలను తింటే మీ ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఆల్క‌హాల్ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్‌ వేసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారంటే..
Recommended image2
Blood Pressure: బీపీ మిష‌న్ ఎలా ప‌నిచేస్తుంది.? దీని వెన‌కాల ఉన్న మెకానిజం ఏంటో తెలుసా?
Recommended image3
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved